వినోదం ఇక ఇళ్లకే పరిమితం

కరోనా దెబ్బతో వెబ్ సిరీస్, ఓటీటీల పై కన్నేసిన చిన్న, పెద్ద నిర్మాతలు 

  • సినీ రంగంలో భారీ మార్పులకు సంకేతం
  • మరో రెండేళ్ల దాకా థియేటర్లకు కష్టకాలమే
  • ఒక వేళ అనుమతించినా సామాజిక దూరమే
  • ఒక సీటు తర్వాత రెండు సీట్ల గ్యాప్ తో అనుమతి 
  • భారీ బడ్జెట్ సినిమాలకు ఇక చెల్లుచీటీ
  • క్రియేటివ్ రచయితలకే ప్రాధాన్యం
  • ప్రతి ఇల్లూ ఇక ఓ హెూమ్ థియేటర్ 

హైదరాబాద్: కాలగమనంలో అన్నీ కనుమరుగైపోతుంటాయి. కాలంతో పాటు మనుషులు మారుతుంటారు. ల్యాండ్ లైన్ ఎస్టీడీ – ఐసీడీలు వచ్చిన కొత్తలో అబ్బో అని అందరూ వాటికి అలవాటుయ్యారు. ఆ తరువాత సెల్ ఫోన్ల రాక మొత్తం ల్యాండ్ ఫోన్లనే ఎత్తేసింది. మనిషి కూడా దానికి టర్న్ అయిపోయాడు. ఫోన్లతో కెమెరాలు – వీడియో గ్రాఫింగ్ పరికరాలు గల్లంతయ్యాయి. వెబ్ సిరీస్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ విలువ ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది జనాలకు. ఈ లాక్ డౌన్ వేళ ఇంటిల్లిపాదికీ వినోదాన్నీ, కాలక్షేపాన్నీ అవే అందిస్తున్నాయి. వాటి మైలేజీ ఏమిటన్నది అందరికీ అర్థమైంది. అందుకే.. బడా నిర్మాతలంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టారు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ అనే పేరు విపరీతంగా వినబడుతోంది. అసలింతకీ ఓటీటీ అంటే ఏంటి? మనకు భారతదేశంలో ఎన్ని రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఓటీటీ అంటే ‘ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్’. ఇంటర్నెట్ ద్వారా సినిమాలను… టీవీ చానల్స్ ను.. ఇతర ఆ కార్యక్రమాలను మన ఇంట్లో ఉండి చూసే సౌలభ్యం అన్నమాట. మరి ఇదే పని టీవీలతో ఇదివరకే చేస్తున్నాము కదా అంటే.. అది బ్రాడ్ కాస్టింగ్ కిందకు వస్తుంది. అంటే ఛానల్ వారికి తోచిన ప్రోగ్రాం.. వారి పైత్యాలను రంగరించి మన పై రుద్దే రసరమ్యమైన కార్యక్రమాలను మనం ఎగబడి చూడాలి. రెండు గంటల సినిమాకు మూడు గంటల యాడ్ల రుద్దుడుకి సిద్ధపడాలి. వారికి నచ్చిన.. వారి దగ్గర ఉన్న ఒకే సినిమాను కనీసం పదేళ్లు భరించాలి. కానీ ఓటీటీ అలా కాదు. మనకు నచ్చిన సమయంలో మనకు నచ్చిన కార్యక్రమాలను.. సినిమాలను అందుబాటులో ఉన్న మెనూ నుంచి ఎంచుకొని చూడటమే. స్మార్ట్ టీవీ లో.. మన లాప్ టాప్ లో .. ట్యాబ్ లో.. ఫోన్ లో.. ఎందులోనైనా చూడొచ్చు. అయితే ఈ సౌలభ్యం వినియోగించుకోవడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. హై స్పీడ్ ఇంటర్నెట్.. స్మార్ట్ టీవీల పుణ్యమా అని ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇండియాలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా మన పై విధింపబడిన లాక్ డౌన్ దెబ్బకు ఓటిటి సబ్ క్రైబర్లు పదింతలయ్యారు. ప్రింటెడ్ న్యూస్ పేపర్ ను చూస్తే భయం.. న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ అనే రొడ్డ కొట్టుడు పదం కనబడితే చిరాకు.. వీటి దెబ్బకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏదో నచ్చిన ప్రోగ్రాం చూసుకుంటూ హాయిగానో.. బాధగానో కాలం గడుపుతున్నారు. మనదేశంలో ఓటిటీ ప్లాట్ ఫామ్ లు మొత్తం 40 ఉన్నాయి. 2019లో ఈ ఓటీటీల టర్నోవర్ 3500 కోట్లు అని.. ఈ ఏడాది అది మూడు నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. శరత్ మరార్ నుంచి నిర్మాత..అసలేం జరిగిందంటే ఆయన వెనకుండి ఓ వెబ్ సిరీస్ బయటకు వచ్చింది. ఆయన మరికొన్ని సిరీస్ లను ప్లాన్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ వృక్షంలో ఎదుగుతున్న మరో నిర్మాణ సంస్థ స్వప్న సినిమా. ఈ సంస్థ కార్యకలాపాలన్నీ అశ్వనీదత్ కుమార్తెలు చూసుకుంటున్నారు. వాళ్లిప్పుడు ఓ వెబ్ సిరీస్ ని రూపొందించే పనిలో ఉన్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ కూడా ఈ మధ్య గట్టిగా వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది. వాళ్ల దగ్గర చాలా కథలు రెడీగా ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేయగానే ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఇప్పటికే చదరంగం అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్ లాంటి భారీ నిర్మాతలు కూడా పనిలో పనిగా ఈ రంగంలోకి దిగిపోతున్నారు. సినిమాకి పడే కష్టమే వెబ్ సిరీస్ కి ఉంటుంది. కానీ.. సినిమా విడుదల చేయడానికి పడే కష్టాలు మాత్రం దీనికి ఉండవు. కంటెంట్ నచ్చితే అమేజాన్ లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నాయి. వాళ్ల ప్లానింగులన్నీ భారీగానే ఉంటాయి. జస్ట్.. ఇక్కడో నిర్మాత అండ దండలు కావాలంతే. వెబ్ సిరీస్ పూర్తి చేసి, ఆ తరవాత మంచి రేటుకి అమ్ముకోవచ్చు. పైగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇప్పుడు కంటెంట్ లేక విలవిలలాడుతున్నాయి. అందుకే ఇంత మార్పు వచ్చింది. మార్పు మంచిదే.. సమాజంలో వస్తున్న మార్పులను గమనించి వాటితో వెళ్లినవాడే సక్సెస్ అవుతాడు. లేదంటే కనుమరుగైపోతాడు. ఒకప్పుడు దేశంలో 90శాతం మార్కెట్ వాటా ఉన్న ‘నోకియా’ ఫోన్లు.. స్మార్ట్ ఫోన్లుగా మారక పాత పంథాలో వెళ్లడంతో ఇప్పుడా కంపెనీయే లేకుండా పోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు సినిమాలకు అదే గతి పట్టింది. సినీ పరిశ్రమను మార్చబోతున్న ‘కరోనా’ కరోనా వైరస్ ఇప్పుడు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం తెచ్చింది. భవిష్యత్ ను అంధకారం చేసింది. కరోనా తగ్గినా జనాలు థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇక భారీగా కోట్లు పెట్టి సినిమాలు తీసే బడా నిర్మాతల వైఖరిల్లో కూడా స్పష్టమైన మార్పు వస్తోంది. టాలీవుడ్ సహా బాలీవుడ్ బడా నిర్మాతలంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారానే తమ సినిమాలు – వెబ్ సిరీస్ లను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. లాక్ డౌన్ లో ఓటీటీలే ది లాక్ డౌన్ తో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారంతా ఇంటిల్లిపాది ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దీంతో భవిష్యత్ లోనూ థియేటర్స్ స్థానాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భర్తీ చేస్తాయని బడా నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే వెబ్ సిరీస్ లపై పడుతున్నారు. సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ లకు డిమాండ్ తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ వస్తోంది. నెట్ ఫిక్స్ అమేజాన్ ప్రైమ్ లు కథ కథనం బాగుండాలే కానీ కోట్లు పెట్టి కొంటున్నారు. ఇది నిర్మాతలకు బాగానే గిట్టు బాటు చేస్తోంది. ఇప్పటికే శరత్ మరార్ వైజయంతీ మూవీస్ ఫస్ట్ ఫ్రేమ్ డీవీవీ దానయ్య భోగవల్లి ప్రసాద్ అలాంటి భారీ నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టడం మారుతున్న సినీ జనాల దృష్టికోణానికి నిదర్శనంగా చెప్పవచ్చు. సినిమాకు పడే కష్టం వెబ్ సిరీస్ కు ఈజీ సినిమాల కంటే వెబ్ సిరీస్ కు పడే కష్టం తక్కువ. దీనికి థియేటర్స్ – అగ్రిమెంట్లు – డిస్టిబ్యూటర్స్ – షేర్లు ఉ ండవు. డైరెక్ట్ గా అమేజాన్ ప్రైమ్ సహా దేనికైనా కోట్లకు అమ్ముకొని లాభపడవచ్చు. కరోనా టైంలో థియేటర్స్ కు జనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్ అంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారానే సినిమాలు రిలీజ్ అవుతాయని భావిస్తున్నారు. పైగా అమేజాన్ – నెట్ ఫ్లిక్స్ లాంటి భారీ సంస్థలు కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉ ంటాయి. అందుకే సినిమాల కంటే వెబ్ సిరీస్ లు బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారు. తీసిన సినిమాలను వీటి ద్వారానే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిణామం సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప మార్పునకు నాంది పలుకుతుందని చెప్పవచ్చు. నిజానికి ఈ రోజు ఉగాది కాబట్టి సినిమాల విడుదలలు ఉండేవి. మార్చ్ 25న నాని నటించిన వి చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు రిలీజయ్యేవి. రెండు నెలలుగా స్లంప్ లో ఉన్న ఇండస్ట్రీకి, థియేటర్లకు కొంత ఊపు వచ్చేది. ఇక ఉగాది తర్వాత నుండి వరసగా సినిమాల జాతరే. ఏప్రిల్ 2న మూడు సినిమాలు, ఏప్రిల్ 9న మరో రెండు సినిమాలు.. ఇలా పేరున్న సినిమాలు అన్నీ సమ్మర్ కు షెడ్యూల్ అయ్యాయి. సరిగ్గా అప్పుడు వచ్చింది కరోనా మహమ్మారి. దాని కారణంగా షూటింగ్ లు రద్దయ్యాయి. సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. మొదట మార్చ్ 21 వరకూ సినిమా రిలీజ్ లను ఆపేసారు. తర్వాత దాన్ని మార్చ్ 31కి షిఫ్ట్ చేసారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించడంతో అప్పటివరకూ సినిమాల రిలీజ్ లు ఉండవు. మరి దాని తర్వాత పరిస్థితి అంతా నార్మల్ అయ్యి సినిమాల రిలీజ్ లకు అనుమతి లభిస్తే అప్పుడు ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నకు నిర్మాతల మండలి సమాధానమిచ్చింది. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు షెడ్యూల్ అయిన రిలీజ్ ఆర్డర్ లోనే సినిమాలు తర్వాత విడుదలవుతాయని తెలిపింది. అయితే ఎవరైనా పోటీ కోరుకుంటే సినిమాలను వాయిదా వేసుకోవచ్చని లేని పక్షంలో అదే ఆర్డర్ లో సినిమాలు వస్తాయని క్లారిటీ ఇచ్చింది. అయితే సినిమాల రిలీజ్ ల వరకూ ఓకే కానీ షూటింగ్ బ్యాలన్స్ ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆర్టిస్ట్, సాంకేతిక నిపుణుల డేట్స్ మళ్ళీ సంపాదించడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. అందులో భారీ బడ్జెట్ చిత్రాలకు బిజీ నటీనటులు ఉంటారు. వేరే భాషల్లో కూడా చేసే వారైతే ఇక వారు డేట్లు అన్ని సినిమాలకు కేటాయించడానికి తల ప్రాణం తోకకొస్తుంది