కరోనా కట్టడికి
మోదీ ‘మండల’ దీక్ష 21 రోజుల లాక్ డౌన్ తర్వాత 19 రోజులకు పొడిగింపు..మొత్తం 40 రోజుల లాక్ ఔట్ వెనుక మర్మం ఇదేనా!
- సెంటిమెంట్ గా దూసుకెళుతున్న మోదీ
- హిందూ ఆచారాలలో 40 రోజుల మండల దీక్షకు ప్రాముఖ్యత
- అయ్యప్ప, హనుమాన్,భవానీ తదితర దీక్షలన్నీ మండల దీక్షలే
- 80 శాతం హిందువులపై పనిచేస్తున్న మోదీ మంత్రం
- ఆయుర్వేద వైద్యంలో కూడా 40 రోజుల చికిత్స
- పూర్వకాలంలో మోక్షసాధనకు రుషుల మండల దీక్ష
హైదరాబాద్: గత నెలలో భారత ప్రజలంతా కరోనా పై పోరాడేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కొన్ని ప్రాంతాల్లో మినహా చాలా చోట్ల ప్రజలు మోదీ మాటలను తు.చ. తప్పకుండా పాటించిన కారణంగానే, కరోనాకు కాస్తంతైనా అడ్డుకట్ట పడిందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ కేసుల సంఖ్య రోజుకు 7 నుంచి 8 శాతం మేరకు పెరుగుతూ, ప్రస్తుతం 10 వేలకు పైగా నమోదయ్యాయి. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, లాక్ డౌన్ పొడిగించాలన్న వినతులు వచ్చాయి. దీంతో ఆయన సైతం కరోనా కట్టడికి నిబంధనల కొనసాగింపే మంచిదన్న ఉద్దేశానికి వచ్చారు. ఇక అటు రెండు వారాలు కాకుండా, ఇటు మూడు వారాలు కాకుండా, మధ్యలో 19 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని మోదీ ప్రకటించడం వెనుక, ఆయన చాలా పెద్ద ఆలోచనే చేశారని భావించవచ్చు. 21కి 19 కలిపితే 40 వస్తుంది. అంటే ‘మండలం’… ఇండియాలో మండల దీక్షకు ఎంతో విలువ ఉంది. ప్రతియేటా కోట్లాది మంది అయ్యప్ప భక్తులు మండల దీక్ష పాటించి, యాత్ర చేస్తుంటారు. జైనులు కూడా మండల దీక్ష చేస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో భక్తి కార్యక్రమాలు మండలం రోజులు కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో మండలం రోజుల లాక్ డౌన్, ప్రజల్లో నిబంధనల సెంటిమెంట్ ను నిలిపివుంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా కట్టడి కావాలంటే, మండల దీక్షను భారత ప్రజలతో చేయించాలన్న ఉద్దేశంతోనే, లాక్ డౌన్ పొడిగింపును 19 రోజులుగా మోదీ నిర్ణయించారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే మండల దీక్ష సెంటిమెంట్ ను మోదీ ప్రయోగించారని అంటున్నారు. మండల దీక్ష ఎందుకు చేస్తారు? భక్తులు అందరు తమ తమ ఇష్ట దైవాల ప్రీతి కొరకు దీక్షలు చేపడతారు. ఈ దీక్షలు ఏ వారమో, నెలో కాకుండా మండలం రోజులే ఎందుకు చేస్తారు? మండలం అంటే 41 రోజులు. ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మందులు తయారు చేయడానికి , కొన్ని రకాల చికిత్సలకు మండల రోజులే కాల పరిమితి ఉంటుంది. అసలు ఈ 41 రోజుల పరిమితి ఏమిటి? మన శరీరం మనం తినే ఆహార పదార్థాలను బట్టి పని చేస్తుంది. మన మనస్తత్వం కూడా మనం తినే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. శరీరం రోగ గ్రస్తం అయినపుడు శరీరంలో నుంచి అనారోగ్యానికి కారణమైన వాటిని తొలగించి, శరీరాన్ని మాములు స్థితికి తేవడానికి కనీసం 40 రోజులు పడుతుంది. అప్పుడే రోగం మూలం నుంచి తొలగించబడి శరీరం ఆరోగ్యవంతం ఔతుందని వైద్యులు విశ్వసిస్తుంటారు. అలాగే మన మనసు కూడా నానా వికారాలకు లోను అవుతుంటుంది. మనసు, బుద్ధి, సరిగా ఉండాలి అంటే అరిషడ్వర్గాలను జయించాలి. ఎవరో యోగులకు తప్ప మాములు మానవులకు , మన లాంటి వాళ్లకి అది సాధ్యం కానీ పని. మనలోని వికారాలు, అహంకారం తొలగిపోయి అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనే భావన నిలుపుకోవటం సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ సాధనకు కనీసం 41 రోజులు అవసరం. ఈ దీక్షలను అందుకే 40 రోజుల కాల పరిమితి తో పాటిస్తారు. దీక్ష చేసేవారు మగవారిని స్వామి అని, ఆడవారిని మాతా అని పిలవడం కూడా అందరిలోనూ భగవంతుడిని చూసే ప్రయత్నమే. అలాగే, భూ శయనం, ఒంటి పుట భోజనం కూడా మనలో రాజసాన్ని అరికట్టి సాత్వికులుగా చేసే ప్రక్రియ. అలాగే చెప్పులు లేకుండా నడవడం, క్షవరం, లేకుండా , గోళ్ళు తీసుకోకుండా ఉండడం మన దేహం పై మనకు ఉన్న ప్రేమని తొలగించి రెండు పూటలా భజన, దైవ పూజ ద్వారా దైవానికి సన్నిహితంగా ఉండడం కొరకే. అలాగే పరుష వాక్యాలు మాట్లాడక పోవడం అనే నియమం అందరి తోను సద్భావనతో ఉండడానికే. అలాగే చన్నీటి స్నానం, మనలో కోరికలను నశింప చేయడానికే. మొత్తం ఒకే రంగు దుస్తులు ధరించడం కూడా మన దేహం మీద, అలంకరణ మిద మనకు ఉన్న ప్రీతిని తగ్గించడానికే. మరి సాత్వికమైన భోజనం, మద్య మంసాలకు దూరంగా ఉ ండడం జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో జీవించడానికే. ఈ అన్ని నియమాలు 40 రోజులు పాటించడం వల్లమనలోని అహంకారం, వికారాలు నశించి, అరిషడ్వర్గాలను జయించి, సాత్వికులుగా మారతాం. అందరు ఇలా మారటం వల్ల సమాజం లో శాంతి , సమభావనలు వెల్లి విరుస్తాయి. కానీ, ఈ దీక్షల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఈ రోజుల్లో ఎంతవరకు %టబశ్రీటఱశ్రీ % అవుతోంది? ఎంతమంది దీక్ష పూర్తీ అయిన తర్వాత తమ అహంకారాన్ని వదులుకుంటున్నారు? ఎంత మంది సమ భావాన్ని అలవరచు కొంటున్నారు? దీక్ష పూర్తీ అయిన కూడా, ఎంత మంది మద్య మాంసాలకు దూరంగా ఉంటున్నారు? దీక్ష అయిపోయి మాల తీసిన తరువాత అంత షరా మాములే. ఈ పద్ధతి మారనంత వరకు ఎన్ని దీక్షలు చేసిన ప్రయోజనం లేదు . ఆలోచించండి. అసలు మండల దీక్ష ఎందుకు చేస్తారు? భక్తులు అందరు తమ తమ ఇష్ట దైవాల ప్రీతి కొరకు దీక్షలు చేపడతారు. ఈ దీక్షలు ఏ వారమో, నెలో కాకుండా మండలం రోజులే ఎందుకు చేస్తారు? మండలం అంటే 41 రోజులు. ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మందులు తయారు చేయడానికి , కొన్ని రకాల చికిత్సలకు మండల రోజులే కాల పరిమితి ఉంటుంది. అసలు ఈ 41 రోజుల పరిమితి ఏమిటి? మన శరీరం మనం తినే ఆహార పదార్థాలను బట్టి పని చేస్తుంది. మన మనస్తత్వం కూడా మనం తినే ఆహార పదార్థాల పై ఆధారపడి ఉంటుంది. శరీరం రోగ గ్రస్తం అయినపుడు శరీరంలో నుంచి అనారోగ్యానికి కారణమైన వాటిపి తొలగించి, శరీరాన్ని మాములు స్థితికి తేవడానికి కనీసం 40 రోజులు పడుతుంది. అప్పుడే రోగం మూలం నుంచి తొలగించబడి శరీరం ఆరోగ్యవంతం ఔతుంది. అలాగే మన మనసు కూడా నానా వికారాలకు లోను అవుతుంటుంది. మనసు, బుద్ధి, సరిగా ఉండాలి అంటే అరిషడ్వర్గాలను జయించాలి. ఎవరో యోగులకు తప్ప మాములు మానవులకు , మన లాంటి వాళ్లకి అది సాధ్యం కానీ పని. మనలోని వికారాలు, అహంకారం తొలగిపోయి అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనే భావన నిలుపుకోవటం సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ సాధనకు కనీసం 41 రోజులు అవసరం. ఈ దీక్షలను అందుకే 40 రోజుల కాల పరిమితి తో పాటిస్తారు. దీక్ష చేసేవారు మగవారిని స్వామి అని, ఆడవారిని మాతా అని పిలవడం కూడా అందరిలోనూ భగవంతుడిని చూసే ప్రయత్నమే. అలాగే, భూ శయనం, ఒంటి పుట భోజనం కూడా మనలో రాజసాన్ని అరికట్టి సాత్వికులుగా చేసే ప్రక్రియ. అలాగే చెప్పులు లేకుండా నడవడం, క్షవరం, లేకుండా , గోళ్ళు తీసుకోకుండా ఉండడం మన దేహం పై మనకు ఉన్న ప్రేమని తొలగించి రెండు పూటలా భజన, దైవ పూజ ద్వారా దైవానికి సన్నిహితంగా ఉండడం కొరకే. అలాగే పరుష వాక్యాలు మాట్లాడక పోవడం అనే నియమం అందరి తోను సద్భావనతో ఉండడానికే. అలాగే చన్నీటి స్నానం, మనలో కోరికలను నశింప చేయడానికే. మొత్తం ఒకే రంగు దుస్తులు ధరించడం కూడా మన దేహం మిద, అలంకరణ మిద మనకు ఉన్న ప్రీతిని తగ్గించడానికే. మరి సాత్వికమైన భోజనం, మద్య మంసాలకు దూరంగా ఉ ండడం జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో జీవించడానికే. ఈ అన్ని నియమాలు 40 రోజులు పాటించడం వల్లమనలోని అహంకారం, వికారాలు నశించి, అరిషడ్వర్గాలను జయించి, సాత్వికులుగా మారతాం. అందరు ఇలా మారటం వల్ల సమాజంలో శాంతి , సమభావనలు వెల్లి విరుస్తాయి. కానీ, ఈ దీక్షల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఈ రోజుల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతోంది? ఎంతమంది దీక్ష పూర్తి అయిన తర్వాత తమ అహంకారాన్ని వదులుకుంటున్నారు? ఎంత మంది సమ భావాన్ని అలవరచు కొంటున్నారు? దీక్ష పూర్తీ అయిన కూడా, ఎంత మంది మద్య మాంసాలకు దూరంగా ఉంటున్నారు? దీక్ష అయిపోయి మాల తీసిన తరువాత అంత షరా మాములే. ఈ పద్ధతి మారనంత వరకు ఎన్ని దీక్షలు చేసిన ప్రయోజనం లేదు . ఆలోచించండి.