మూడు జోన్లుగా లాక్ డౌన్!

నేడు జాతినుద్దేశించి కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ 

  • ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం
  • లాక్ డౌన్ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు
  • ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నెలాఖరు దాకా పొడిగింపు
  • లాక్ డౌన్ పై ప్రధాని మోదీ త్రిముఖ వ్యూహం
  • రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రాంతాల విభజన
  • కరోనా వైరస్ తీవ్రతను బట్టి జోన్లుగా నిర్ణయం
  • మోదీ నిర్ణయం పై చిరుద్యోగులు, రైతుల ఎదురుచూపులు
  • కొన్ని రంగాలకు మినహాయింపు ఇస్తారని ప్రచారం 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు లాక్ డౌన్ పై ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్ లో వెల్లడించింది. కాగా, శనివారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మెజారిటీ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిషా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రధాని ఈరోజే లాక్ డౌన్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డాయి. దేశవ్యాప్త లాక్ డౌ తో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయమై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానయాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని.. భౌతిక దూరం పాటిస్తూ (సీటు వదిలి సీటు) విమానాలు నడిపే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 9,152 చేరుకోగా.. 308 మరణాలు సంభవించాయి. 856 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7,987 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియతో చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లా డౌనను ఈ నెలాఖరు వరకు పొడిగించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అటు మిగతా రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ ను పెంచాలని మోదీకి సూచించాయి. ఐతే ఇటీవల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రజల ప్రాణాలతో పాటు ప్రపంచమూ ముఖ్యమనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి పలు రంగాలకు మినహాయింపు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కరోనా తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజిస్తారని.. దానికి అనుగుణంగా సడింపు ఉంటుందని సమాచారం. రెడ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తారని తెలుస్తోంది. మరి ప్రధాని మోదీ రేపు ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి. రెడ్ జోన్ కరోనా కేసులు 15కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన జోన్లలో ఏప్రిల్ 14 తరవాత కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అన్ని రకాల కార్యకలాపాల పైనా నిషేధం ఉంటుంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆరెంజ్ జోన్ 15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని సర్వీసులు నడపడం, వ్యవసాయ పనులకు అనుమతులు ఉంటాయి. గ్రీజోన్ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తిస్తారు. గ్రీన్ జోన్ల పరిధిలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. దేశంలో దాదాపు 430 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జాబితా రూపొందిస్తున్న కేంద్రం లాక్ డౌన్ అమలులో ఉంటే ఆంక్షల నుంచి ఏయే రంగాలను మినహాయించాలన్నదాని పై కేంద్ర హోంశాఖ ఒక జాబితా రూపొందిస్తోంది. వ్యక్తిగత దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధనతో వ్యవసాయం, చిన్న-మధ్య తరహా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి కొన్ని ఆంక్షలను మినహాయించే అవకాశం ఉందని సమాచారం. విమానయాన రంగానికి కూడా మినహాయింపు లభించవచ్చని తెలుస్తోంది. పనిగంటల పెంపునకు యోచన లాక్ డౌన్ ఆంక్షలు ఏప్రిల్ 15 తరవాత కూడా కొనసాగించే పక్షంలో నిత్యావసర సరుకులు, మందులు ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో పనిగంటలు పెంచాలన్న యోచనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ రంగాలకు చెందిన కొన్ని పరిశ్రమల్లో కార్మిక శక్తి తక్కువగా ఉండి వాటి ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నట్లైతే పనిగంటలను పెంచడం వల్ల ఫలితం ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఫ్యాక్టరీల చట్టం-1948ని సవరించాలని కూడా కొందరు అధికారులు ప్రతిపాదిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులను ఎలా వారి స్వగ్రామాల నుంచి తిరిగి తీసుకురావాలన్నదానిపై కూడా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. లాక్- డౌన్ కొనసాగించాలన్న నిర్ణయం కేంద్రంలోని పలు ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చు రేపుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్యం కోసం లాక్-డౌన్ కొనసాగించాలని కేంద్ర హెూం శాఖ భావిస్తుండగా.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే వాణిజ్య, వ్యవసాయ శాఖలు మాత్రం దాంతో విభేదిస్తున్నాయి. ఇలాగే లాక్- డౌన్ కొనసాగితే-% దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ కోలుకోలేదని రెండు శాఖల ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. ఇందులో వాణిజ్య శాఖ ఏకంగా హెూంశాఖకు లేఖ రాసింది. సడలింపు అనివార్యమని సూచించింది. “ వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించండి.. కొంతమేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలించాలి.. ” ఇదీ కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు కేంద్ర మోంశాఖకు చేసిన తాజా సూచన. ఈ మేరకు వాణిజ్య శాఖ కార్యదర్శి హెూం శాఖ కార్యదర్శికి సోమవారం ఉదయం లేఖ రాశారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు లాక్ డౌన్ అనివార్యమే అయినప్పటికీ, ఇప్పుడు అమలు చేస్తున్న నిబంధనలను కొనసాగిస్తే మాత్రం దేశం తీవ్రంగా నష్టపోతుందని, లాక్ డౌన్ నిబంధనలను సడలించి, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. ఈ మేరకు కొన్ని సలహాలు, సూచనలతో హోమ్ శాఖకు ఓ లేఖను రాసింది. రక్షణాత్మక చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటూ, వాహన, టెక్స్ టైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఫ్యాక్టరీలను తిరిగి తెరిచేందుకు అనుమతించాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ శాఖ సైతం ఇదే విధమైన సూచనలతో హెూమ్ మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలుస్తోంది. వ్యవసాయం అత్యంత కీలకమని, పంట చేతికి వచ్చే ఈ సమయంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూడాల్సివుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదించిన తరువాత, సామాజిక దూరం పాటిస్తూ, ఉద్యోగులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచి పరిశ్రమలు తెరచుకునే వీలు కల్పించాలని కోరారు. ఇప్పటికే భారత్ లో ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిందని, కరోనా మహమ్మారి ప్రభావంతో అది మరింతగా కుదించుకుపోకుండా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. అయితే వాణిజ్య, వ్యవసాయ శాఖల సూచనలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హెూం శాఖా మంత్రి అమిత్ షా ఏమేరకు పరిశీలిస్తారో, పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి.