వ్యవసాయ రంగాన్ని

లాక్ డౌన్ నుంచి మినహాయించాలి : ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి

శ్రీకాకుళం: ముందుచూస్తే నుయ్యి వెనుకచూస్తే గొయ్యి అనే చందనంగా భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి తయారైందని శ్రీకాకుళం డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికకార్యకలాపాలు స్థంభిస్తే ప్రజలకు ఆదాయాలు ఉండవని, అలముకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆపైన లాక్లైన్ ఎత్తివేయకపోతే ఆర్థికవ్యవస్థ పతనమవుతున్నదని, ఇవన్నీ మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుందని వెల్లడించారు. ఇప్పటికే 4 శాతం కన్నా భారత జీడీపీ వృద్ధిరేటు మరింత దిగువకు క్షీణించే పరిస్థితులు ఉ త్పన్నమవుతున్నాయని తెలిపారు. ఒక ఆర్థికవ్యవస్థ లో స్థిరత్వం వుండాలంటే డిమాండ్ మరియు సప్లై అంసాలు కూడా అందుకు దోహదపడాలని, కానీ ప్రస్తుతం మన దేశంలో వివిధ వర్గాల ఆదాయాలు తగ్గు ముఖం పట్టడంతో ప్రభావిత డిమాండ్ మార్కెట్లో లోపించడం, అదే సమయంలో పరిశ్రమల రంగానికి సరైన ముడిసరుకులు లభించక, వర్కర్లు పనులకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉత్పత్తులు ఆగిపోతున్నాయని వివరించారు. ఈ కారణాల వలన దేశంలో వివిధ పరిశ్రమలకు సంబంధించిన ఫ్యాక్టరీలు లేఆఫ్ ప్రకటిస్తే పనిలేకుండా శ్రామికులు కూర్చునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ఇలా ఉంటే మనదేశంలో అసంఘటిత రంగంలో 40 కోట్ల మందికి ఏదో ఒకరకమైన పనికల్పిస్తూ ప్రజల జీవనభృతి కల్పిస్తూ ఉందని, ఇక దేశంలో రిటైల్ రంగం మొత్తం ఉ ద్యోగితలో 8 శాతం కల్పిస్తున్నదని,కరోనా దెబ్బతో రిటైల్ రంగం కూడా కుదేలవుతున్నదని తెలిపారు.కరోనా నేపథ్యంలో ఇప్పటి పరిస్థితులు ఇలానే కొనసాగితే సంఘటిత రంగంలో ఉ ద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతాయని వివరించారు. మన దేశ జీడీపీ లో 55 శాతంకు పైగా సర్వీస్ రంగం నుంచి లభిస్తుందని, లాక్ట్రాన్ నేపథ్యంలో సర్వీస్ రంగం బాగా దెబ్బతింటే దీని ప్రభావం పరిశ్రమల రంగం మీద కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ విష వలయంను చేధించాలంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని,దీని కోసం సురక్షిత లోక్లైన్ విధానం లేదా కంట్రోల్డ్ లాక్లైన్ విధానం ద్వారా కొంతవరకు ఆర్థికవ్యవస్థ ను రక్షించుకోవడానికున్న అవకాశాలు పరిశీలించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ , రవాణా విషయాల్లో లోక్ట్రాన్ సరళీకరిస్తే ఆర్ధిక పరిస్థితులు కొంతమేరకు కుదుటపడి, రైతు ప్రయోజనాల దిశగా అడుగులు వేయడానికి అవకాశాలున్నాయని తెలిపారు. దేశంలో లక్షలాదిమంది రైతులు నేటికి తమ ఉత్పత్తులను అర్బన్, సెమి అర్బన్ ప్రాంతాల్లో నేరుగా వినియోగదారులకు స్థానిక మార్కెట్లలో అందింస్తున్నారని, రిటైల్లా,మార్కెట్ యార్డులు ద్వారా తమ ఉత్పత్తులు ను అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, 60 శాతంకు పైగా ఉద్యోగిత కల్పిస్తున్న వ్యవసాయరంగాన్ని ప్రాధాన్యతా క్రమంలో ముందు ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతుల ఆదాయాలు పడిపోకుండా కాపాడబడి తద్వారా మిగతా రంగాలైన పరిశ్రమలు, సేవల కు ఊతమిచ్చినట్లవుతుందని ఆయన వివరించారు.