10 రాష్ట్రాలలో విజృంభణ

భారత్ లో నమోదయిన కేసులు 7447, మృతుల సంఖ్య 239 24 గంటల్లో భారత్ లో 1035 కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24గంటల్లో భారత్ లో 1035 కొత్త కేసులు నమోదు కావడంతో పాటు 40 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో మొత్తం 7447 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 239 మరణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 642కి చేరిందని చెప్పారు. భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్ లో 36, గుజరాత్ లో 19 మంది మ రణించారు. దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఇంతవరకూ లేనంతగా, 24 గంటల వ్యవధిలోనే 896 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నాటికి దేశంలోని వైరస్ పీడితుల సంఖ్య 6 వేల మార్కును దాటేసింది. మహమ్మారి అత్యంత బలంగా విరుచుకుపడుతున్న తొలి పది రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుండగా… నాలుగో స్థానంలో తెలంగాణ, ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ లున్నాయి. కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ముఖ్యమంత్రులతో వీడియో ద్వారా సమావేశం కానున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై వారు చర్చించే అవకాశముంది. తమిళనాడులో 911, ఢిల్లీలో 903, రాజస్థాన్లో 561, తెలంగాణలో 487, మధ్యప్రదేశ్ లో 451, ఉత్తరప్రదేశ్ లో 433, ఏపీలో 381, గుజరాత్ లో 378, కేరళలో 364 జమ్మూకశ్మీర్ లో 207, కర్ణాటకలో 207, హర్యానాలో 176, పంజాబ్ లో 151, బెంగాల్ లో 116, బీహార్‌లో 60, ఒడిశాలో 50, ఉత్తరాఖండ్లో 35, అసోంలో 29, హిమాచల్ ప్రదేశ్ లో 28, చండీఘర్ లో 19, ఛత్తీస్ గఢ్ లో 18, లడఖ్ లో 155 జార?ంలో 14, అండమాన్ నికోబార్ దీవుల్లో 11, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్ లో 2, త్రిపురలో 2, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలి, మిజోరాంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి మొత్తం కేసుల్లో 59% అక్కడే… దేశంలో కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా విజృంభిస్తున్న తొలి పది రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు నిలిచింది. శుక్రవారం ఉదయం నాటికి అక్కడ మొత్తం కేసులు 1,364కు చేరాయి. తర్వాతి స్థానాల్లో దిల్లీ, తమిళనాడు తెలంగాణ, రాజస్థాన్ నిలిచాయి. మొత్తం కేసుల్లో 59%, మరణాల్లో 64%, కోలుకున్న వాటిలో 45% ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇంకేం సాయం కావాలో చెప్పండి.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, కార్యదర్శి ప్రీతీసూదలు… రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు, కార్యదర్శులతో శుక్రవారం వీడియో ద్వారా సమావేశమయ్యారు. కేంద్రం నుంచి ఇంకేం మద్దతు కావాలో చెబితే, సాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్వాససంబంధ రోగులపై దృష్టి సారించాలని సూచించారు. – ప్రస్తుతం బంగ్లాదేశ్ లో డెంగీ తీవ్రంగా ప్రబలుతోందని, సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రీతీసూదన్ హెచ్చరించారు. లా డౌనను కఠినంగా అమలు చేయాల్సి ఉన్నందున ఎలాంటి సామాజిక, మత ఊరేగింపులనూ అనుమతించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. Sసుల సంఖ్య ఎక్కువగా నమోదైన 23 ప్రాంతాలను దిల్లీ ప్రభుత్వం ‘కంటైన్మెంట్ జోన్లు’గా ప్రకటించింది. వాటిని పూర్తిగా దిగ్బంధించి, రాకపోకలను నిలిపివేసింది. పోలీసు పహారానూ పెంచింది. ట్యాంకర్ల ద్వారా ఆయా చోట్ల హైపోక్లోరైట్, బ్లీచింగ్ ద్రావణాలను పిచికారి చేయిస్తోంది. ప్రజలంతా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తికి సరిహద్దుల్లేవని, దేశ హితం కోరి అందరూ సరైన సమాచారాన్నే పంపాలని మంత్రి హర్షవర్ధన్ హితవు పలికారు. కొన్ని రాష్ట్రాలు సరైన నివేదికలను పంపడం లేదని, దాపరికం లేకుండా అన్ని విషయాలను పంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 110మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24గంటల్లో ఇక్కడ 13మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కి చేరింది. ముంబయి, పుణెలలో తీవ్రత అధికంగా ఉంది. మధ్యప్రదేశ్, గుజరాత్ లోనూ మరణాల సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 33మంది చనిపోగా, గుజరాత్ లో 19మంది కరోనాకు బలయ్యారు. తమిళనాడు, దిల్లీలలో కొవిడ్-19 కేసుల సంఖ్య 900దాటింది. ఢిల్లీలో ఈ వైరస్ సోకి 13మంది మరణించగా, తమిళనాడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487 చేరగా 12మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఆరుగురు మరణించగా మొత్తం బాధితుల సంఖ్య 381కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశంలో ఈ వైరస్ బారినపడి 40మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరణ్ మృతిచెందినవారి సంఖ్య 299కి చేరింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1035 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7447కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో ప్రస్తుతం 643మంది కోలుకోగా మరో 6565మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.