కరోనా భారతం
భారత్ లో కరోనా: 149 మరణాలు, 5247 కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 773 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కాగా 32 మంది మరణించారు. దేశవ్యాప్తంగా నేటి వరకు 5,247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 402 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 బారినపడి 149 మంది చనిపోయారు. రాష్ట్రాలకు వైద్య పరికరాలు అందిస్తున్నాం. కరోనా హాట్ స్పాట్లలో పర్యవేక్షణకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలి. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కొరత ఇప్పుడు గానీ భవిష్యత్తులోనూ ఉండదు. దేశంలో మాత్రల నిల్వలు సరిపడా ఉన్నాయని’ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఉ దయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5247కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య 149కి చేరింది. మరో 4643మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 402మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 70మంది విదేశీయులే ఉన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 773 పాజిటివ్ కేసులు, 35 మరణాలు సంభవించాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 64మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1018కి చేరింది. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు: రాష్ట్రం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు మహారాష్ట్ర 1018 79 64 తమిళనాడు 690 19 7 ఢిల్లీ 576 21 9 తెలంగాణ 404 45 11 ఆంధ్రప్రదేశ్ 314 1 4 కేరళ 336 70 2 ఉత్తర ఫ్రదేశ్ 326 21 3 గుజరాత్ 165 25 13 మధ్య ప్రదేశ్ 229 0 13 రాజస్థాన్ 328 21 3 కర్ణాటక 175 25 4 పంజాబ్ 91 4 7 జమ్మూకశ్మీర్ 116 4 2 పశ్చిమ బెంగాల్ 99 13 5 ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కరోనా కేసుల సమాచారాన్ని ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. వీటిని కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలలో ఒకరు చొప్పున మరణించారు. మిగతా రాష్ట్రల్లో కొవిడ్-19 కేసులు నమోదైనప్పటికీ తీవ్రత కాస్త తక్కువగానే ఉంది.