కరోనార్థిక సంక్షోభం
పేదరికంలో భారత దేశ భవిత..40 కోట్ల మంది పై ప్రభావం
- శార్వారి నామ సంవత్సరంలో సర్వం హరీ
- పెను ఉత్పాతంలో ఉత్పాదక రంగం
- వాణిజ్యంపై రూ.2,556 కోట్ల ప్రభావం
- కుదేలయిన పర్యాటక, విమానయాన రంగాలు
- ఆటోమోటివ్, టెక్స్ టైల్, మెటల్, ఫర్నిచర్ రంగాలకు దెబ్బ
- మందగమనంలోకి జీడీపీ, షేర్ మార్కెట్లు
- రియాలిటీ, నిర్మాణ రంగాల అంచనాలు తారుమారు
- రోజువారీ వినియోగ వస్తువుల పైనా ప్రభావం
హైదరాబాద్: లాక్ డౌన్ చర్యతో మన దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిపోయింది. ఎన్నో పరిశ్రమలు, సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలు క్లోజ్ కావడంతో ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది. తాము కన్న కలలు నెరవేరవా అనే సందిగ్ధంలో పడిపోయారు. యావత్ ప్రపంచాన్ని దెబ్బతీస్తున్న కరోనా రాకాసి ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే.. కొలువుల కోతలే దిక్కని భావిస్తున్నాయి పలు సంస్థలు. కరోనా వైరస్ ప్రభావం వల్ల వివిధ రంగాల్లో పనిచేస్తున్న 40 మంది కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఈ ఏడాది రెండవ క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 19.5 కోట్ల మంది ఉద్యోగ్యాలు (ఫుల్‌టైం) కోల్పేయే ప్రమాదం ఉందని కూడా యూఎన్‌కు చెందిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. అంటే 6.7 శాతం వర్కింగ్ హవర్స్ తగ్గిపోతాయని ఐఎల్ఓ అంచనా వేసింది. ఐఎల్ ఓ మానిటర్ సెకండ్ ఎడిషన్.. కోవిడ్ 19 అండ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ పేరుతో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ నివేదికను రిలీజ్ చేసింది. ఎక్కువ శాతం ప్రభావం అరబ్ దేశాల్లో ఉంటుందని ఐఎల్ఓ అంచనా వేసింది. అరబ్ దేశాల్లో 8.1 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారు. అంటే సుమారు 50 లక్షల ఫుల్ టైం వర్కర్లు పనికోల్పోతారు. ఇక తర్వాత స్థానంలో యురోప్ (7.8 అంటే, కోటి 20లక్షలమంది), ఆసియా(7.2 అంటే 12 కోట్ల మంది) దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి వల్ల రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన పరిస్థితుల కన్నా దారుణమైన పరిస్థితులు ఏర్పడనున్నట్లు యూఎన్ పేర్కొన్నది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఐఎల్ ఓ డైరక్టర్ జనరల్ గయ్ రైడర్ తెలిపారు. చాలా వేగంగా సరైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కోట్లాది మంది బ్రతుకులు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు ఆయన అన్నారు. కరోనా మహమ్మారీ భారతదేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కరోనా వైరస్ సోకుతుండడంతో ఈ భూతం నుంచి బయటపడేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కేంద్రం భావించింది. దీంతో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. కానీ కేసుల సంఖ్య అధికమౌతున్న సందర్భంలో ఈ ఆంక్షలు మరిన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నష్టాల బారిన పడిన పలు సంస్థలు దిక్కుతోచనిస్థితి పరిస్థితి ఏర్పడిపోయింది. దీంతో వ్యయ నియంత్రణ దృష్టి పెడుతున్నాయి. వ్యాపార పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఇదే అంశం తేలింది. లాక్ డౌన్ తర్వాత..కొతలు పక్కగా అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత సంవత్సరం చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన వైరస్… ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా కష్టాలు మెల్లిగా తొలగినా.. ఇతర దేశాలు మాత్రం కష్టాల సుడిగుండంలో చిక్కుకపోయాయి. జనవరి – మార్చి నెల త్రైమాసికంలో దేశీయ ఉత్పాదక రంగాన్ని పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పవచ్చు. మునపటి ఉన్న పరిస్థితి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉ 0దని పలు సంస్థలు భావిస్తున్నాయి. 47 శాతం సీఈవో లు.. ఉద్యోగాలు కోల్పోయే వారు 15 శాతం దిగువనే ఉండొచ్చంటున్నారు. 32 శాతం సీఈవోలు మాత్రం.. 15-30 శాతంగా ఉండొచ్చంటున్నారు. 52 సంస్థలు లాక్ డౌన్ తర్వాత.. ఉద్యోగాల తీసివేతలు ఉంటాయని సీఐఐ చెబుతోంది. నిరుద్యోగం పెరిగితే…డిమాండ్ తక్కువ కావడం.. ఈ ప్రభావం ఉత్పత్తి పడడం..ఫలితంగా ఆర్థిక వ్వవస్థ కుదేలు అవుతుందని భావిస్తున్నారు. భారత వాణిజ్యంపై కరోనా వైరస్ ప్రభావం దాదాపు రూ.2,556 కోట్లు (348 మిలియన్ డాలర్లు)గా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్) అంచనా వేసింది. టాప్-15 వైరస్ ప్రభావిత దేశ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఉందని తెలిపింది. చైనా ఉత్పాదక రంగం కుప్పకూలిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం కూడా దెబ్బతిన్నదని చెప్పింది. చైనాయేతర దేశాల్లో అత్యధికంగా యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 15.6 బిలియన్ డాలర్ల మేర నష్టపోతున్నాయని యూఎన్ వెల్లడించింది. ఆ తర్వాత అమెరికా (5.8 బిలియన్ డాలర్లు), జపాన్ (5.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (3.8 బిలియన్ డాలర్లు), తైవాన్ (2.6 బిలియన్ డాలర్లు), వియత్నాం (2.3 బిలియన్ డాలర్లు) దేశాలున్నాయి. ఇన్ స్ట్రూమెంట్స్, మెషినరీ, ఆటోమోటివ్, క మ్యూనికేషన్ విడిభాగాల రంగాలు వైరస్ ప్రభావంతో చతికిలపడ్డట్లు యూఎన్ పేర్కొన్నది. భారత్ లో రసాయన పరిశ్రమ 129 మిలియన్ డాలర్ల మేర ప్రభావితం కానుండగా, టెక్స్ టైల్స్, దుస్తులు 64 మిలియన్ డాలర్లు, ఆటోమోటివ్ రంగం 34 మిలియన్ డాలర్లు, ఎలక్ట్రికల్ మెషినరీ 12 మిలియన్ డాలర్లు, తోలు ఉత్పత్తులు 13 మిలియన్ డాలర్లు, మెటల్స్, దాని ఆధారిత ఉత్పత్తులు 27 మిలియన్ డాలర్లు, కలప, ఫర్నీచర్ ఉత్పత్తులు 15 మిలియన్ డాలర్ల చొప్పున నష్టపోనున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ విమానయాన రంగం పై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అంటువ్యాధి ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆయా దేశాల ప్రభుత్వాల ఆదేశాలతో ఎయిర్ లైన్స్ సైతం తమతమ రూట్లను పెద్ద ఎత్తున తగ్గించేస్తున్నాయి. కొన్ని మార్గాలకైతే తాత్కాలికంగా సేవలను నిలిపివేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ విమానయాన పరిశ్రమకు రూ.8.29 లక్షల కోట్ల (113 బిలియన్ డాలర్లు) ఆదాయం వరకు పడిపోవచ్చని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) అంచనా వేసింది. రెండు వారాల క్రితం ఈ అంచనా కేవలం రూ.29.3 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం. కానీ ఇప్పుడది నాలుగింతలు పెరిగింది. వైరస్ నేపథ్యంలో 2 లక్షలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యా యి. జీడీపీ మొత్తం వస్తువుల, సేవలు అవి కొన్నప్పుడు లేదా పొందినప్పుడు ఒక దేశంమె ఎత్తం మీద లెక్కించినప్పుడు వచ్చే ఒక సూచిక. అది డబ్బు లేదా కరెన్సీ కదలికను సూచిస్తుంది. ఎన్ని సార్లు కరెన్సీ కదిలితే అంత ఎక్కువ జీడీపీ అన్నమాట. ఒకరి ఖర్చు ఇంకొకరికి రాబడి. ఇది నిరంతరం తిరిగే చక్రం లాంటిది. ఈ చక్రం ఎంత బాగా తిరిగితే అంత మేలు అన్న మాట దేశ ఆర్థిక ఆరోగ్యా నికి. జీడీపీ పడిపోతుందంటే అర్థం ఇప్పుడు ఆ చక్రం తిరగడం మందగించిందని. 2019 మొదటి త్రైమాసికంలో 5.8% నుంచి ఆ చక్రం వేగం బ్రేకులు వేసినట్టు లేక బెరింగులు అరిగిపోయి మొరాయించినట్టు నత్త నడకన సాగుతోంది. ఆ తర్వాత త్రైమాసికంలో ఆర్థిక కుదుపులు చూసాక అది మరింత పడిపోయి 5.0% కు చేరుకుంది. ఒక పరిమిత కాలానికి ప్రైవేటు రంగం చేసే ఖర్చు, ప్రభుత్వ పెట్టుబడులు, చేసే ఖర్చులు, చేసే ఎగుమతుల నుంచి దిగుమతులు మొత్తాన్ని తీసేస్తే వచ్చేదే జీడీపీ. అది అంచనా వేసేందుకు వివిధ రంగాల్లో ఉండే సూచీలు పనికివస్తాయి. వినియోగ సూచి : మొత్తం జనాభా చేసే వస్తు సేవల వినియోగం భారత దేశ ఆర్థిక వ్యవస్థలో సింహభాగం.. అంటే మూడొంతులు ఉంటుంది. వివిధ రంగాలకు సంబంధించి జరిగే వినియోగం తగ్గితే మొత్తం ఆర్ధిక వ్యవస్థ మందగించినట్టే. బ్యాంకులు ఇచ్చే రుణాల్లో తప్ప అన్ని రంగాల్లో ఇప్పుడు వినియోగ సూచీలు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పడిపోతున్న కార్ల అమ్మకాలు మన దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ 2019 మధ్యలో కార్ల అమ్మకాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 23.3% శాతం తగ్గాయి. ఇది 2004 నుంచి రికార్డు అయిన అమ్మకాలలో అన్ని సంవత్సరాల కనిష్టం. (అంత కంటే వెనక్కి వెళ్లే లెక్కలు లేవు). కార్ల అమ్మకాలు తగ్గాయంటే వాటితో ముడిపడి ఉండే విడి భాగాల అమ్మకాలు కూడా తగ్గినట్టే. ఉదాహరణకు టైర్ల అమ్మకాలు ఉక్కు ముడిభాగాల అమ్మకాలు పడిపోయినట్టే. దాంతోపాటు ఆటో డీలర్లు తమ ఆదాయాన్ని కోల్పోయి, దుకాణాలను బందు పెట్టుకుంటారు. ఇదే సమయంలో కార్ల కోసం తీసుకునే లోన్లు కూడా (5.1 శాతానికి) తగ్గాయి. కార్లతో పోలిస్తే టూవీలర్ల అమ్మకాలు 11.7 శాతం తగ్గి కాస్త మె రుగు అనిపించుకున్నాయి. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో అది 14.8 శాతమే. వ్యవసాయ పనులకు వినియోగ పడే ట్రాక్టర్ల అమ్మకాలు 14.1 శాతం పడిపోయాయి. ఇంటి నిర్మాణం, అమ్మకాలు లియాసిస్ ఫారెస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ లెక్కల ప్రకారం ఇండియాలోని 30 అతి పెద్ద నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 7 శాతం పెరిగింది. (12 లక్షల నుండి 12.8 లక్షల ఇళ్లు). ఇళ్ల నిర్మాణం, అమ్మకాలు మీద ప్రధానంగా ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ రంగం, దానితో సంబంధం ఉన్న ఉక్కు, సిమెంట్, పెయింట్, ఫర్నిచర్ అమ్మకాలు సరే సరి. రియల్ ఎస్టేట్ రంగం కొన్ని నెలలగుగా స్తంభించి పోయింది. జనాలు పెట్టుబడులు పెట్టడం మనసి డబ్బు దాచుకోవడం మొదలు పెట్టారన్న మాట. ఇది ఏ దేశ ఆర్ధిక వ్యవస్థకైనా ముప్పే. బ్యాంకు రుణాలు ఆశ్చర్యంగా బ్యాంకులో తీసుకునే రిటైల్ రుణాలు దాదాపు ఒక శాతమే (17.9 శాతం నుండి 16.6 శాతం ) తగ్గాయి. హౌసింగ్ లోన్లు 15.8%నుండి 18.9%) కొంత పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు బిల్డర్ల నుండి కొత్త ఇళ్ళకు బదులు అంతకుముందే కొన్న ఇన్వెస్టర్ల నుంచి ఇళ్లు కొనుక్కుంటున్నారు. దీంతో ఇతర నిర్మాణ రంగాలకు జరిగే మేలు దాదాపు శూన్యం. ఇది కాకుండా క్రెడిట్ కార్డుల నుంచి చేసే ఖర్చు కూడా పెద్దగా తగ్గలేదు (31.3% నుండి 27.6%). ప్రభుత్వ అనుకూలురు చేసే వాదనకు ఇది బాగా పనికి వచ్చే అంశం. జనాల కొనుగోలు శక్తి తగ్గిపోతే మరి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు ఎందుకు ఇంకా కిటకిటలాడు తున్నాయి? ఆ కాస్త సరదాలు జనం మానేయలేదు ఇంకా. రోజువారి సరుకుల అమ్మకాలు వేగంగా అమ్ముడు పోయే వస్తువుల కంపెనీలు (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) గత సంవత్సర కాలంగా మందగమనం బాట పట్టాయి. హిందూస్తాన్ యూనిలీవర్ అమ్మకాలు 12 శాతం నుండి 5 శాతానికి, డాబర్ ఇండియా అమ్మకాలు 21 శాతం నుండి 6 శాతానికి. బ్రిటానియా అమ్మకాలు 13 శాతం నుండి 6 శాతానికి పడిపోయాయి. పార్లేజీ బిస్కెట్ల కంపెనీ నష్టాల బారిన పడి పదివేల మంది ఉ ద్యోగులను ఇంటికి పంపడానికి సిద్ధమైంది. కొనసాగుతున్న కరోనా వ్యాప్తి ఏపీలో 329కి చేరిన పాజిటివ్ కేసులు: అప్రమత్తమైన ప్రభుత్వం అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 329కి చేరింది. ఇవాళ కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉ ందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్టు చేసేందుకు ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా కొవిడ్ లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. “3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్టు చేస్తాం. ప్రైవేటుల్యాబ్ లనూ సంప్రదిస్తున్నాం. టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్ చెప్పింది. 240 ట్రూనాట్ సెంటర్లున్నాయి. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎస్-95 మాస్క్ లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్ లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్ 14 లక్షలు సిద్ధంగా ఉంచాం” అని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.