అగ్రరాజ్యంలో విలయ తాండవం

అమెరికాలో ఒక్కరోజే 1900 మంది మృతి.. అంచనాల కంటే తక్కువే ఉంటుందన్న ట్రంప్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రతాపానికి అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారానికి అక్కడ మృతుల సంఖ్య 12,700 దాటింది. నిన్న ఒక్కరోజే 1,900 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3,99,667 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 22,020 మంది కోలుకోగా.. 12,878 మంది మ రణించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు గతంలో ఉన్నంత విషమంగా లేవని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం అంచనా వేసిన స్థాయిలో మరణాలు ఉ ండకపోవచ్చునని ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు. లక్ష నుంచి రెండు లక్షల మందిని మహమ్మారిని బలిగొనే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన ప్రకటనను సవరించిన ఆయన గతంలో అంచనా వేసిన కంటే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుందని అభిప్రాయపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,400 మంది మ