ఆలీకి..దూరంగా!!
నిజాముద్దీన్ ఘటన తర్వాత హెం మంత్రికి సీఎంకూ మధ్య పెరుగుతున్న అంతరం
-గత కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న హెూం మంత్రి – కరోనా విధులలోనూ అలసత్వం -ఢిల్లీ ఘటన తర్వాత అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు – గోప్యంగా నిర్వహించిన కార్యక్రమం పై నిఘా పెట్టని ఘోం శాఖ -భారీ మూల్యం చెల్లించుకుంటున్న తెలంగాణ సర్కారు -సమీక్ష సమావేశానికి హెూం మంత్రిని పిలవని సీఎం -గతంలోనూ దిశా ఘటనపై సీఎం సీరియస్
హైదరాబాద్: కోపం వచ్చినా, ఆనందం వచ్చినా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆపడం ఎవరి వల్లా కాదు.ఆయనకు నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే పాతాళానికి తొక్కేయ్యడం కేసీఆర్‌కు మొదటి నుంచి ఉన్న అలవాటే అని ఆయనకు అత్యంత సన్నిహితంగా మెదిలే కొందరు బాహాటంగానే అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ముందు నుంచి అందరికి తెలిసిన విషయమే అయినా ఎప్పటికప్పుడు కేసీఆర్ వ్యవహరించే తీరు అర్ధం కాక సొంత పార్టీ నాయకులే జుట్టు పీక్కుంటూ ఉ ంటారు.ఇక అసలు విషయానికి వస్తే మొదటినుంచి కూడా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మహమ్మద్ అలీ ఉన్నారు. అందుకే ఆయనకు ఘోంశాఖ మంత్రిగా, తెలంగాణ డిప్యూటీ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు.ఇక కేసీఆర్ ఏ సమావేశం నిర్వహించినా, ఏ కార్యక్రమం చేసినా, పక్కనే మహమ్మద్ అలీ ఉంటారు. ఆయనకు సం ఒక్కటే కాదు డిప్యూటీ సీఎంగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇద్దరి మధ్య స్నేహం చాలా కాలం నుంచి ఇదే విధంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో మహ్మద్ ఆలీ తీవ్రంగా ఉ న్నట్లు తెలుస్తోంది. హెూం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనను స్వయంగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన చాలా అవమానానికి గురయ్యారట.ఇంతకీ ఏమైందంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా అంశం పై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఏర్పాటు చేశారు.ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తులకు కరోనా వైరస్ సోకిన వ్యవహారంపై చర్చించేందుకు సమావేశాన్ని కెసిఆర్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీతో సహా, ఉన్నతాధికారులు ప్రభుత్వం కీలక వ్యక్తులంతా హాజరయ్యారు. అయితే ఇదే సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ ని పోలీసులు అడ్డుకోవడం, ఈ సమావేశంలో పాల్గొనేందుకు మీకు పర్మిషన్ లేదు అంటూ చెప్పడంతో ఆయన తీవ్ర అవమానానికి గురయ్యారు.అసలు పోలీసులు ఈ విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా పై నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఉండాలి. లేకపోతే స్వయంగా తమ శాఖ అధిపతి, డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయరు. ఖచ్చితంగా కేసీఆర్ సూచనలతో ఈ విధంగా జరిగిందనేది స్పష్టమవుతోంది.అయితే మర్కస్ ప్రార్థనలకు వెళ్లిన వాళ్ళల్లో ఎక్కువ మంది పాతబస్తీకి చెందిన వారే ఉ ండటం, అదే ప్రాంతంలో మహమూద్ అలీ కూడా ఉండడంవల్ల, సమీక్షల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ బయటకు వెళ్లిపోతాయి అనే ఉద్దేశంతో మహమ్మద్ అలీని కెసిఆర్ దూరం పెట్టినట్లు తెలుస్తోంది.మొదటి నుంచి తనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ సమావేశానికి తాను రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన అంత సీరియస్ గా తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని మహమ్మద్ అలీ భావిస్తుంటారు. అదీ కాకుండా మొదటి నుంచి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నిర్ణయాలను చాలా దగ్గర నుండి గమనిస్తున్న వ్యక్తి కావడంతో దీనిని ఆయన పెద్దగా పట్టించుకునే అవకాశం లేనట్టుగానే తెలుస్తోంది. అయితే మీడియాలో మాత్రం దీని పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వెటర్నరీ డాక్టర్ (25) హత్యోదంతం అంశానికి సంబంధించి ఏం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. బాధితురాలు తన సోదరికి ఫోన్ చేయడానికి బదులు డయల్ 100 నంబరుకు కాల్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని అభిప్రాయపడ్డారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అయితే.. ఉన్నత విద్య అభ్యసించి కూడా బాధితురాలు ఇలాంటి పొరపాటు చేయడం ఆలోచించాల్సిన విషయం. రాత్రి సమయంలో తన సోదరికి ఫోన్ చేసే బదులు డయల్ 100కి ఫోన్ చేయాల్సింది. పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకునే వారు. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉ ండేది’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. గతంలోనూ తెలంగాణ మాం మంత్రి మహమూద్ అలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మనవడు ఫురాన్ అహ్మద్, మరో యువకుడితో కలిసి పోలీసు వాహనంపై కూర్చుని ఉన్న వీడియో టిక్ టాక్ యాలో ప్రత్యక్షమై వైరల్ కావడమే ఇందుకు కారణం. ఈ వీడియోలో అహ్మద్ పోలీసు వ్యాన్ పై కూర్చుని ఉ న్నాడు. జీపు పై ఉన్న తన స్నేహితుడిని గౌరవించకపోతే…అతని పీక కోస్తా అనే డైలాగ్స్ తో ఫర్కాన్ అహ్మద్ చేసిన టిక్ టాక్ వీడియో చేసి వైరల్ చేశారు. కాగా అతడు ఎక్కిన వాహనం నంబర్ ప్లేట్ రాష్ట్ర పోలీస్ చీఫ్ పేరిట రిజిస్టరై ఉంది.. తెలంగాణలోని అన్ని పోలీసు వాహనాలూ డీజీపీ పేరిట రిజిస్టరై ఉంటాయి. ఈ వీడియో పై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఘోం మంత్రి అలీ స్పందించారు. తాను రెండు రోజుల క్రితం ఓ ఫంక్షన్ కు వెళ్లగా, ఎవరో స్థానికులు ఈ వీడియో తీశారని, దాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు. కాగా పోలీస్ ఉన్నతాధికారి వాహనం పై కూర్చొని టిక్ టాక్ వీడియో చేసిన తన మనవడిని సంమంత్రి మహమూద్ అలీ తీవ్రంగా మందలించారు. తన మనవడు ఫర్కాన్ అహ్మద్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఉంటే అతని పై చర్యలు తీసుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులకు హెూంమంత్రి మహమూద్ అలీ అప్పట్లో ఆదేశించారు. అది చిన్న విషయమే అయినా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కరోనా వైరస్, లాక్ డౌన్ తదితర అంశాల పై జరిగిన జరిగిన సమావేశానికి హెూం మంత్రి మహమూద్ అలీకి అనుమతి నిరాకరించారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ప్రధాన ద్వారం వద్ద లోపలికి అనుమతి లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెప్పడంతో ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే, డీజీపీ మహేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. % ఔషు : ముళ్ల కర్రతో అక్కడ కొడితే మాంసం ఎగురుతది.. పోలీసుల హెచ్చరిక.. వీడియో వైరల్ తెలంగాణ నుంచి దిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన మర్కాజ్ ప్రార్థనలకు చాలా మంది హాజరైన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉన్నతాధికారులతో చేసిన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వీరివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి సీఎం.. గవర్నర్ కు వివరిస్తారని తెలుస్తోంది.