తప్పుడు వార్తలకిక తప్పదు వాతలు

ఫేక్ న్యూస్ ధ్రువీకరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్ సైట్ 

-ఫేక్ న్యూస్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఫ్యాక్ట్ చెక్ డాట్ తెలంగాణ వెబ్ సైట్ రూపకల్పన -వైరల్ సమాచారంపై క్లారిటీ కోసం ఏర్పాటు -తప్పుడు సమాచారం ఇస్తే ఇకపై కఠిన చర్యలు -వైన్ షాపులు తెరుస్తున్నారని ఫేక్ న్యూస్ హల్ చల్ -వెంటనే సైబర్ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు 

హైదరాబాద్: సోషల్ మీడియా లో ఒకడు ఓ వార్త పెడుతాడు.. ఆ వెంటనే అది ని జమేనని మరొకడు చెప్తాడు. తప్పని ఇంకొకడు వాదిస్తాడు.. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలా జరిగిందని వేరొకడు విమర్శలు గుప్పిస్తాడు. కొన్నిసార్లు ఇది సామాజిక పరమైన ఉద్రిక్తతలకూ దారితీస్తుంది. పెను ఉపద్రవాలకు కారణమవుతుంది. అసలు ఆ వార్త, వీడియో తాజాదా.. లేదా పాతదా అన్న విషయం కూడా తెలియదు. నిత్యం ఇలాంటి ఎంతో చెత్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి యాట్లతోపాటు సోషల్ మీడియాలో వందలసంఖ్యలో వస్తున్న వార్తల్లో నిజమెంత? ఏది అసలు వార్త.. ఏది తప్పుడు వార్త.. అనేది ధ్రువీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే అందరికీ చిన్న చూపు. నిర్ధారణ లేని వార్తలు, తప్పుడు వార్తలు, జనాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు సోషల్ మీడియా కేంద్రంగా ఉండేది. కానీ క్రమంగా కాలం మారుతోంది. అప్పటికీ విశ్వసనీయత రాకపోయినా కనీసం కొన్ని విషయాల్లో మాత్రం జనాభిప్రాయానికి ప్రతీకలుగా మారుతున్న సోషల్ మీడియా పోస్టులను ప్రభుత్వాలు కూడా పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితి. దేశంలో ఫేక్ న్యూస్ కట్టడి, నిజనిర్ధారణ కోసం ప్రత్యేకంగా పోర్టలను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. కరోనాపై ఫేక్ న్యూసకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లాక్ డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై డిజిటల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం, వదంతులపై నిజనిర్ధారణ చేసుకొనేందుకు గురువారం ఫ్యాక్ట్ చెక్ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్ సైట్ ను ప్రారంభించింది. దీనిద్వారా ఏది నిజం, ఏది అబద్ధం అనేది ధ్రువీకరించుకోవచ్చని ఐటీశాఖ తెలిపింది. ఫ్యాక్ట్ లీ మీడి యా అండ్ రిసెర్చ్ సంస్థతో కలిసి ఈ వెబ్ సైట్ ను తీసుకొచ్చామని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే సమాచారానికి సంబంధించిన నిజానిజాలపై నిరంత రం బులెటిన్‌ను విడుదలచేయనున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో సమాచారం షేర్ చేసే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఫేక్ న్యూస్ కట్టడికి కేంద్రం అధికారంగా మార్గదర్శకాలు ఇవ్వడా నికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ వైబ్ సైట్ను అందుబాటులోకి తెచ్చిందని అధికారులు చెప్పారు. అధికారిక ధ్రువీకరణ లేకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను వైరల్ చేయడం శిక్షార్హమైన నేరమని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అవి తప్పుడు వార్తలు ఐటీశాఖ మీడియా బులెటిన్ విడుదలసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పలు కథనాలపై స్పష్టతనిస్తూ తెలంగాణ ఐటీశాఖ గురువారం మీడియా బులెటిన్‌ను విడుదలచేసింది. కొంతమంది ముస్లిం యువకులు కరోనా వ్యాప్తి చేయడానికి ప్లేట్లు, చెంచాలు నాకుతున్నారని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఐటీశాఖ పేర్కొన్నది. ఆహారం వృథాకాకుండా అలా చేయడం ఓ ఆచారమని, ఈ వీడియో 2018 నుంచి ఇంటర్నెట్ లో ఉన్నదని తెలిపింది. ప్రాణాలే లేనప్పుడు డబ్బు ఎందుకని.. ఇటలీ దేశంలో ధనికులు డబ్బును రోడ్లమీద పారేస్తున్నారని వైరల్ అవుతున్న ఫొటో నిజంకాదని, అవి వెనిజులా దేశానికి చెందిన ఫొటోలని స్పష్టతనిచ్చింది. ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మే 4 వరకు పొడిగించారని ఇండియా టుడే న్ షాట్లు పెట్టి వైరల్ చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని తెలిపింది. కరోనా వ్యాప్తికి ముస్లింలు ఒకేసారి తుమ్ముతున్నట్టు వీడియో వైరల్ అవుతున్నదని, అది నిజం కాదని ఐటీశాఖ పేర్కొన్నది. ఆ వీడియోలో ఉన్నదాన్ని సూఫీ ఆచారం ప్రకారం చేసే జిక్ అంటారని వివరించింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరుగుతున్న కొన్ని వీడియోలు, సమాచారంపై గురువారం బులెటిన్ విడుదల చేసింది. కొందరు ముస్లిం య ఎవకులు స్పూన్లు, ప్లేట్లు నాకుతున్నట్లుగా ఉన్న ప్రచారంలో ఉన్న వీడియోలు 2018కి సంబంధించినవి. ఆహారం వృథా చేయకుండా బోహ్రా ముస్లిం తెగలో ఇది ఒక ఆచారం.?కరోనాపై సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపేవారు శిక్షార్హులు అంటూ కేంద్ర హోం శాఖ పేరిట ప్రచారంలో ఉన్న లేఖ జారీ చేయడం అవాస్తవం. ఇటలీలో రోడ్ల మీద డబ్బును పడేస్తున్నారని ప్రచారంలో ఉన్న ఫోటోలు అవాస్తవం. వెనిజులాలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ పడిపోవడంతో అలా చేశారు. లాక్ డౌనను మే 4వ తేదీ వరకు ప్రధాని మోడీ పొడిగించినట్లు స్క్రీన్‌ టన్ను ఫొటో షాప్లో చేశారు. ప్రధాని ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. కొంతమంది ముస్లిం యువకులు బృం దంగా ఏర్పడి తుమ్ముతున్నట్లుగా ప్రచారం లో ఉన్న వీడియోకు నిజాముద్దీన్ దర్గాకు ఎలాంటి సంబంధం లేదు. సూఫీ ఆచారం ప్రకారం ఇలా ఊగిపోవడాన్ని జిక్ర్ అంటారు. పాకిస్తాన్లో జనవరిలోనే ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే అందరికీ చిన్న చూపు. నిర్ధారణ లేని వార్తలు, తప్పుడు వార్తలు, జనాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు సోషల్ మీడియా కేంద్రంగా ఉండేది. కానీ క్రమంగా కాలం మారుతోంది. అప్పటికీ విశ్వసనీయత రాకపోయినా కనీసం కొన్ని విషయాల్లో మాత్రం జనాభిప్రాయానికి ప్రతీకలుగా మారుతున్న సోషల్ మీడియా పోస్టులను ప్రభుత్వాలు కూడా పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితి. ఇదే కోవలో ఏపీలోని వైసీపీ సర్కారు తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై స్పందిస్తోంది. సోషల్ మీడియా అంటేనే… సోషల్ మీడియా పేరు చెబితేనే ప్రభుత్వాలు మండిపడే రోజులివి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వ్యక్తులపై బురదజల్లేందుకు ప్రత్యర్ధులు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని భావించే పరిస్థితులు. కానీ ప్రస్తుతం కాలం మారుతోంది. తమకు ఇబ్బంది కలిగితే చాలు దాన్ని రెగ్యులర్ మీడియాతో ఎలా పంచుకోవాలో తెలియని పరిస్థితులలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. వీటి విశ్వసనీయత ఎంత అన్న సందేహాలు ఉన్నా స్థూలంగా సమస్యను బయటపెట్టడంలో సోషల్ మీడియా ఇప్పుడు వారధిగా మారిపోయింది. జగన్ సర్కారుదీ ఇదే బాట.. ఏపీలో గతంలో తమపై సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే అంతెత్తున ఎగిరే వైసీపీ ప్రభుత్వం, పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు వాటిలో వాస్తవాన్ని కాస్తో కూస్తో గుర్తించే పనిలో ఉంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా విధించిన లాక్ డౌన్ లో పోలీసులు కొన్ని చోట్ల అతిగా ప్రవర్తించిన ఘటనలను సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు. సోషల్ మీడియా తాజా బాధితులు వీరే.. తాజాగా ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై దాడులకు పాల్పడిన రాయచోటి, పెరవలి ఎస్టెలను ప్రభుత్వం సస్పెండ్ చేయగా.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ మద్యాన్ని అక్రమంగా తరలించిన తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్లైజ్ సీఐని సస్పెన్షన్ తో పాటు 5 లక్షల జరిమానా కూడా విధించారు. దీంతో ప్రభుత్వం ఆయా ఘటనలను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధమవుతోంది. సోషల్ మీడియా పేరు చెబితే చాలు.. తాజాగా ఏపీ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులను సైతం సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలకు ఉపక్రమిస్తుండటంతో విధి నిర్వహణలో నిబంధనలు ఉ ల్లంఘించే అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణాన ఎవరు సెల్ ఫోన్లో తమను వీడియో తీసి వైరల్ చేస్తారో తెలియక వీరంతా ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. దీంతో విధి నిర్వహణలో అప్రమత్తత కూడా పెరిగింది. రైతు సమస్యలకు సైతం.. ఒకప్పుడు రైతు సమస్యలను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నరంటూ ప్రభుత్వాలు, పార్టీలు మండిపడేవి. కానీ తాజాగా ఏపీలో వైసీపీ సర్కారు తరఫున వ్యవసాయ మంత్రి కన్నబాబు.. సోషల్ మీడియాలో టమోటా రైతు పడుతున్న ఆవేదనను గమనించి తక్షణం చర్యలకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతులకు సంబంధించిన సమస్యలపైనా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న విశ్వాసం వారికి కలుగుతోంది. తప్పుడు వార్తలపై కేంద్ర హోం శాఖ మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సైడ్ చేసే వారి పట్ల మరింత కఠినంగా వుండాలని ఆదేశాలు జారీ చేసింది. అవాస్తవ వార్తలపై సమరానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాలకు ఘోం శాఖ లేఖ రాసింది. త్వరలోనే వాస్తవాలతో ప్రత్యక పోర్టల్ ని అందుబాటులోకి తెస్తామని తెలియజేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా కొన్ని అవాస్తవ వార్తలు ప్రచారంలోకి రావడంపై ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి అవాస్తవ వార్తలను నియంత్రించేందుకు గాను.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కొనసాగింపుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలకు బల్లా ఒక లేఖ రాశారు. అవాస్తవ వార్తలతో పోరాడేందుకు, ఇలాంటి వార్తలు విరివిగా ప్రచారంలోకి రాకుండా ఉండేందుకు గాను తగిన చర్యలు చేపట్టాలని ఘోం శాఖ కార్యదర్శి ఆ లేఖలో కోరారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొనేందుకు, ధ్రువీకరించుకోకుండానే ప్రచారంలోకి వస్తున్న వార్తల్లో వాస్తవాలను తెలియపరిచేందుకు గాను భారత ప్రభుత్వం వెబ్ పోర్టల్ ని రూపొందిస్తున్నట్టు హోం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అవాస్తవ వార్తలకు వివరణలను ఇచ్చేందుకు వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకుగాను రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలు కూడా ఇలాంటి వ్యవస్థలనే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఘోంశాఖ సూచించింది.