అమ్మో! ఒకటో తారీఖు!!

పాలు, సరుకులు, ఇంటి అద్దెలు, తీసుకున్న అప్పులకు వడ్డీలు, గోల్డు రుణాలు

-గుబులు పుట్టిస్తున్న ఏప్రిల్ నెల -మధ్యతరగతి వర్గానికి మహా సంకటం -ఆర్బీఐ ప్రకటన.. కొందరికే ఊరట -తెలుగు రాష్ట్రాలలో వేలాది మంది చిరు వ్యాపారులు -తీసుకున్న ప్రైవేట్ రుణాలపై దిగాలు -గ్యాస్ బండకు రూ.800 కట్టవలసిందే -కరెంటు బిల్లుల చెల్లింపులపై లేని క్లారిటీ 

హైదరాబాద్: కుటుంబాలను పోషించుకోవడానికి కొందరు.. బతుకుదెరువు కోసం మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొందరు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో నెలసరి వడ్డీలు చెల్లించడానికి తమకు లభించిన వ్యక్తులు, సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. డెయిలీ ఫైనాన్స్ కింద తీసుకున్న వారు రోజూ చెల్లించాల్సి ఉంటుంది. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో పేదలు, చిరువ్యాపారులు ఏప్రిల్ ఒకటో తేదీన వాయిదాలు చెల్లించడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో పనిచేసే కూలీలు, హమాలీలు, తోపుడు బండ్లపై విక్రయాలు జరిపే వారిలో అత్యధిక శాతం మంది అద్దె ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. వీరు నెలకు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇంటి అద్దె ఒకటో తేదీన చెల్లించాలి. చెల్లించకపోతే తమను ఖాళీ చేయించేస్తారేమోనన్న భయం వీరిని వెంటాడుతోంది. ఎక్కువ మంది రోజువారీ కూలీల కుటుంబాలు మహిళా స్వయం శక్తి సంఘాల నుంచి లేదా ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుని అవసరాలు గట్టెక్కించుకుంటాయి. ఆ రుణాల చెల్లింపునకు సంబంధించి కిస్తీలు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక విద్యుత్తు బిల్లులు రూ.300-రూ.400 వరకూ కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం చెల్లింపు కూడా వీరికి భారమే. గ్యాస్ బండ కోసం దాదాపు రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆటోడ్రైవర్లు ప్రైవేటు ఫైనాన్స్ లో ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుంటారు. వాటి రుణ కిస్తీ కింద నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలి. ఎనిమిది రోజులుగా ఆదాయమే లేకపోవటంతో ఈ కిస్తీలు చెల్లించటం ప్రశ్నార్థకంగా మారింది. తలను ఎదురు చూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికై ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆదివారం నుంచి మార్కెట్లు స్తంభించాయి. ముందుగా ఈనెల 31వ వరకే అని చెప్పిన ప్రభుత్వం పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల ద ృష్ట్యా ఏప్రిల్ 14వ తేది వరకు లాక్ డౌన్ పొడగించగా, శుక్రవారం ముఖ్యమంత్రి ఏప్రిల్ 15వ వరకు పొడగిస్తూ ప్రకటన చేశారు. ఇంకా ముందుకు పొడిగించే అవకాశం లేకపోలేదని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఫలితంగా రోజు వారీ కూలీ చేసుకునే బతుకులు, దుకాణాలను అద్దెకు తీసుకొని పానడబ్బాలు, సెల్‌ఫోన్ షాపులతో పాటు ఇతర చిరు వ్యాపారాలు చేసుకునే వారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లో రుణాలు పొందారు. ఇక మద్య తరగతి కుటుంబాలు మొదలుకొని నిరుపేద వర్గాలు కూడా కిస్తుల రూపంలో సెల్‌ఫోన్లు, గృహాలంకరణ వస్తువులు, మరికొందరైతే క్రెడిట్ కార్డులతో వాయిదాల పద్దతిలో వస్తువులు, రుణాలు పొందారు. వీరంతా తమ అకౌంటు ద్వారా ప్రతినెలా మొదటి వారంలో రుణాలు తీసుకున్న బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు తప్పనిసరిగా కిస్తులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా వారం రోజులకుపైగా మార్కెట్ మూసి ఉంటుంది. ఈ క్రమంలో రుణ గ్రహీతల ఉపాధితో పాటు ఆదాయం కోల్పోయారు. పనిచేస్తేనే కానీ నెలసరి కిస్తులు చెల్లించే వీరు ఇప్పుడు ఏప్రిల్ 1న తమ నెలసరి వాయిదాలను కట్టడానికి మార్గం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరికే ఊరట.. గత శుక్రవారం ఆర్బీఐ ప్రకటన ఉద్యోగస్తుల్లో ఊరట కలిగించగా, ప్రైవేట్ వ్యక్తుల, చిరు వ్యాపారులు, నిరుపేదలను ఊగిసలాటకు గురి చేసింది. మొదటి తేదీన వడ్డీలు చెల్లించాలా.. వద్దా అనే మీమాంస చాలా మందిలో నెలకొంది. ఆర్బీఐ అన్ని రకాల రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో గృహ నిర్మాణ రుణాలు, బ్యాంకుల నుంచి పొందిన ఓవర్ డ్రాఫ్టులు తదితర కొన్నింటికే మారటోరియం వర్తిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు నెల సరి జీతాలు బ్యాంకు అకౌంట్లోకి నేరుగా వస్తుండగా, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే వారికి బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ సిస్టం ద్వారా తీసుకున్న అప్పులపై ఆర్బీఐ విధిస్తున్న మారటోరియంతో ఆయా వర్గాలకు ఊరట లభించింది. అయితే క్రెడిట్ కార్డులపై తీసుకున్న నగదు రుణాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ధని, బ్యాంకు బజార్ తదితరాల నుంచి పొందిన రుణగ్రస్తులు నెలసరి కిర్జీలు చెల్లించడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. చిరు వ్యాపారులకు అద్దె భయం.. జిల్లాలోని అన్ని పట్టణాల్లో చిరు వ్యాపారులు చేస్తూ అద్దె చెల్లిస్తున్నారు. వీరికి ప్రస్తుతం ఉపాధి లేదు. ఏప్రిల్ ఒకటో తేదీ సమీపిస్తుండడంతో అద్దెల చెల్లించడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఊరటనిచ్చినా… రుణ వాయిదాల చెల్లింపులపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందా? అని చాలా మంది రుణగ్రహీతలు ఆశతో ఉ న్నారు. మారటోరియం హెం, కార్లు పర్సనల్ లోన్లు తీసుకున్న వాటికి వర్తిస్తుందని ఆర్బీఐ కారులకు స్పష్టమైనా దేశబయీలు రాకపోవడంతో రుణ గ్రహీతలను ఆందోళనలో నెట్టింది. ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా రాని మార్గదర్శకాలు మారటోరియం గృహాలు, కార్లు వాహనాలు పర్సనల్ లోన్లకు వర్తిస్తాయి. కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టనవసరం లేదని ఆర్బీఐ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రా లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రెండు రోజుల్లో అన్ని రకాల రుణాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో రుణాలపై మారటోరియం ఉంటుందా? లేదా అనే విషయం తెలియదని తదుపరి ఉత్తర్వులు కోసం ఎదురు చూస్తున్నట్లు వారు చెబుతున్నారు. అద్దె కట్టడం ఇబ్బందే.. వ్యాపారం నడవకున్నా దుకాణాల అద్దెలు మాత్రం చెల్లించాల్సిందే. వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్వీయ నిర్బంధం పాటించాలని ప్రభుత్వం ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దుకాణాలు మూసి ఉంచాం. అద్దెలు కట్టాలంటే ఇబ్బందులు తప్పవు. యజమానులు కొంత ఆలస్యంగా అద్దెలు తీసుకునేందుకు సహకరిస్తే ఇబ్బందులు ఉండవు. చిరు వ్యాపారస్తులు డైయిల్ చెల్లించేందుకు తీసుకున్న అప్పులను మాత్రం చెల్లించడం కష్టమే. %–% బచ్చు ఆనంద్, చిరువ్యాపారి, జోగిపేట కరోనా నేపథ్యంలో పనులు లేక అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూలి పనులు లేక చేతివృత్తిదారులు… చిన్న చిన్న షాపులు, పరిశ్రమల్లో పనిచేసే కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే ఆదాయంలేని వీరిపై వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పలు కుటుంబాలు సతమతమవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో పనులు లేక సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉన్నజిల్లా కేవలం శ్రీకాకుళం మాత్రమే. జిల్లా వ్యాప్తంగా అత్యధికమంది కూలి పనులపైనే ఆధారపడుతుంటారు. ఇక్కడి వారు కుటుంబాలతో సహా దేశం నలుమూలలకు వెళ్లి అక్కడ భవన నిర్మాణాలు, ఇతర పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా కరోనా ప్రభావంతో పనులు కోల్పోయి వీధిన పడ్డారు. కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్లో జిల్లావాసులు సంపూర్ణంగా భాగస్వాములవుతున్నారు. రెక్కాడితే కానీ, డొక్కాడని ప్రజల జీవనంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అసలే అరకొర ఉపాధి. దీనికితోడు ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారుల నుంచి కొందరు నగదు అప్పుగా తీసుకున్నారు. చిరు వ్యాపారులు రూ.వెయ్యి అప్పుగా తీసుకుంటే.. రోజుకి రూ.10, రూ.10వేలు తీసుకుంటే రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వంద రోజుల్లో అప్పును తీర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా వడ్డీ లెక్కేస్తే రూ.100కు నెలకు రూ.10 కంటే ఎక్కువగానే పడుతోంది. అయినా, రోజువారీ వ్యాపారంలో సులభంగా తీరిపోతుందిలే అని భావించి అప్పులు చేసినవారు అత్యధికమంది జిల్లావ్యాప్తంగా ఉన్నారు. ఇటువంటి వారు ఇప్పుడు అప్పులు చెల్లించుకోలేక.. ఇల్లు గడవడానికి అప్పులు తేలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం నగరంలో వేలాదిమంది ఇలా అప్పులు చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారపు వడ్డీ వ్యాపారులు జిల్లాలోని అత్యధిక మందికి అప్పులు ఇచ్చారు. ఇందుకుగాను ఖాళీ ప్రామిసరీనోట్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఇటువంటివి దాదాపు అన్ని జిల్లాలలో నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు పనులు లేక సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ వడ్డీలు చెల్లించలేకపోతున్నాయి. కరోనాతో సంబంధం లేదని, రోజువారీ వడ్డీ చెల్లించాల్సిందేనంటూ వ్యాపారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ చేసి మరీ డిమాండ్ చేస్తుండడంతో అప్పులు చేసినవారంతా అయోమయం చెందుతున్నారు. పనులు, వ్యాపారాలు లేక సతమతమవుతున్న తమపై వడ్డీవ్యాపారులు ఒత్తిడి తేవడం సరికాదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చిరువ్యాపారులు, వారపువడ్డీకి నగదు వాడుకున్న సామాన్యులు సైతం నేరుగా తమ జిల్లాలలో కలెక్టర్, ఎస్పీలని కలిసి తమ గోడును తెలియజేయడానికి సన్నద్ధమవుతున్నారు.