మూడో ప్రత్యామ్నాయం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు మాట్లాడినంత స్పష్టంగా దేశంలో ఏ ముఖ్యమంత్రీ మాట్లాడి ఉండడు. పౌరసత్వ చట్టం తీసుకురావడమనేదే వందకు వంద శాతం ఒక తప్పుడు నిర్ణయమని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తీరతామని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు స్పష్టం చేశానని ఆయన చెప్పారు. తాము ఏది చేసినా ఒక నిశ్చయ చిత్తంతో చేస్తామని, విధానపరంగా, నిండుమనసుతో వ్యతిరేకిస్తాము కాని సగం సగం మనసుతో చేయబోమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అన్ని వర్గాకు సమాన అవకాశాు కల్పించడంపై భారత రాజ్యాంగ పీఠికలో ఏమి రాశారో ఆయన చదివి మరీ వినిపించారు. సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. కేసీఆర్‌ మాట్లాడినట్లుగా జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీ వంటి నేతు మాట్లాడి ఉంటే ఇవాళ కాంగ్రెస్‌ బమైన ప్రతిపక్షంగా నిలిచి ఉండేదనడంలో సందేహం లేదు. పార్టీ అధ్యక్ష పదవిలో లేకపోయినా పౌరసత్వ చట్టంపై ఇవాళ దేశమంతటా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సుడిగాలిగా తిరుగుతూ వివిధ సభల్లో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పౌరసత్వ చట్టం గురించి మాట్లాడేందుకు భించే ఏ అవకాశాన్నీ వదుకోవడం లేదు. అందరూ ఊహించినట్లే దేశ రాజధాని ఢల్లీిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని ఎన్నిక ప్రధాన అంశంగా మార్చడానికి భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నంలేదు.
 ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో జరిగిన అభివ ృద్దిని చెప్పుకోవడానికి బదు పౌరసత్వ చట్టం, రామజన్మభూమి వివాదం, త్రిపుల్‌ తలాఖ్‌, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు గురించి బీజేపీ నేతు అధికంగా మాట్లాడుతున్నారు.
 కాని రాబోయే ఎన్నికు జరిగే రాష్ట్రా ప్రజు మాత్రం ఎందుకో ఈ అంశాపై పెద్దగా దృష్టి సారిస్తున్నట్లు కనపడడం లేదు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ, ముస్లిం ప్రాతిపదికగా ఓటింగ్‌ జరిగే అవకాశం ఉన్నదా అని ఒక పనిమనిషిని అని అడిగితే ‘ఆ రకంగా జరిగే అవకాశాు లేవు సార్‌, మేమంతా కలిసిమెలిసే ఉంటాం. మా ఏరియాలో కటింగ్‌ చేసేవాడు, పేపర్లు అమ్మేవాడు, సైకిల్‌కు పంచర్‌ కొట్టేవాడు అందరూ ముస్లింలే. ఒకరు లేకపోతే మరొకరు లేరు. కశ్మీర్‌ అంటే మన భూభాగం అన్న ప్రేమ ఉంది సార్‌. అంత మాత్రాన మన మధ్య జీవిస్తున్న ముస్లింను ఎలా వ్యతిరేకిస్తాం’ అని చెప్పింది.  
మరి ఆయా రాష్ట్రా ప్రజు వెలిబుచ్చిన అభిప్రాయానికీ కేసీఆర్‌ వెలిబుచ్చిన అభిప్రాయానికీ పెద్ద తేడా లేదు. దేశ భక్తి, దైవభక్తి, జాతీయవాదం, మతతత్వం వీటన్నింటికీ వేర్వేరు నిర్వచనాున్నాయి. ఈ నాుగింటినీ కగలిపి అన్నీ ఒకటేనని చెప్పుకుని ప్రజల్లో ప్రయోజనం పొందాని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తే అది దీర్ఘకాంలో విజయం సాధించడం కష్టం. ప్రజల్లో ఉన్న దైవభక్తి రాజకీయాకు అతీతమైందనడంలో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఉనికిలో ఉన్నా లేకపోయినా ఈ దేశంలో కోట్లాది ప్రజు రకరకా మత విశ్వాసాతో వివిధ మందిరాకూ, మఠాకూ వెళతారని, రకరకా ఆచారాు పాటిస్తారని అందరికీ తెలిసిందే. ప్రభుత్వం మెజారిటీ ప్రజ మనోభావాకు అనుగుణంగా వ్యవహరించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఢల్లీిలోని ఆంధ్రప్రదేశ్‌/ తెంగాణ భవన్‌లో అడుగుపెడితే ఒకవైపు బాలాజీ మందిర్‌, మరో వైపు కనక దుర్గ మందిరం, వెనుక వైపు మసీదు కనపడతాయి.
 ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో అనేక చోట్ల ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మూంగా దేశంలో దైవభక్తు పెరిగిపోతారని, వారు దేశ భక్తుగా, జాతీయ వాదుగా మారిపోతారని, ఆ తర్వాత వారు ఇతర మతాను వ్యతిరేకిస్తారని, ఆ తర్వాత దేశంలో హిందువుంతా బీజేపీకి అనుకూంగా ఓటు వేస్తారని ఎవరైనా సిద్ధాంతీకరిస్తే వారి ఆలోచనా విధానంలోనే లోపం ఉన్నదని చెప్పవచ్చు. ఈ సిద్ధాంతం తప్పని నిరూపిస్తున్న నేత కేసీఆర్‌. ఎందుకంటే ఆయనలో చాలా మంది బీజేపీ నేతల్లో లేని దైవ భక్తి ఉన్నది. ఆయన బాహాటంగా దేవాయాకు వెళ్లడం, మఠాధిపతును సందర్శించడం, పూజు, యజ్ఞాు చేయడం కొనసాగిస్తూనే ఉంటారు. తెంగాణలో బీజేపీ ఓటర్లను సైతం అయోమయపరచగలిగిన శక్తి ఆయనకున్నది. అలా చేసినా సరే తెంగాణలో ముస్లిరు ఆయనను వ్యతిరేకించడం లేదు. ఆయన హిందువు అయినంత మాత్రాన ముస్లిం వ్యతిరేకి కాదని వారికి తొసు. ‘‘ముస్లిరు మన ప్రజు కాదా? ఎందుకు వివక్ష చూపాలి? మనం కలిసికట్టుగా ఎందుకు జీవించకూడదు?’’ అని ఆయన వేసిన ప్రశ్న ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. అంతేకాదు, బీజేపీ జాతీయవాదంపై దావోస్‌లో పెట్టుబడిదారు మధ్య చర్చ, విదేశాల్లో భారత దేశ ప్రతిష్ఠ వంటి అంతర్జాతీయ అంశాను ఆయన స్పృశించారు. నిజానికి భారత దేశ రాజకీయాల్లో జాతీయ వాదాన్నీ, హిందూత్వ వాదాన్నీ కగలిపి ప్రయోజనం పొందాన్న ఆలోచన కొత్త కాదు. స్వాతంత్య్ర పూర్వం కాంగ్రెస్‌లోనే ఈ శక్తు తలెత్తినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఆడ్వాణీ రథయాత్ర భావోద్వేగాను రేకెత్తించింది కాని బాబ్రీ మసీదు కూల్చి వేత తర్వాత నాుగు బిజెపి పాలిత రాష్ట్రాను రద్దు చేసి ఎన్నికు జరిపిస్తే మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. నరేంద్ర మోదీకి 2014 లోనూ, 2019 లోనూ వచ్చిన ఓట్లు పూర్తిగా హిందూత్వ వాదం ఆధారంగా వచ్చిన ఓట్లు కావు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీలో సీఏఏకి వ్యతిరేకంగా తీసుకున్న చర్యు రాబోయే రోజుల్లో జరిగే మార్పును సూచిస్తున్నాయని చెప్పక తప్పదు.