ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూపు సురేష్‌ ప్రకటించారు. రెండు వారాపాటు పరీక్షు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితును సమీక్షించి కొత్త తేదీు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తొస్తోంది.
ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు..
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూపు సురేష్‌ తెలిపారు. విద్యార్థుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మార్చి 29 వరకు ఉన్న ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5కు పొడిగించారు. అలాగే ఏప్రిల్‌ 2వరకు ఉన్న ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ  పరీక్ష గడువును ఏప్రిల్‌ 9వరకు పొడిగించారు.