‘మండలి’కి నామినేషన్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖు చేసిన కవిత

నిజామాబాద్‌ : శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థ కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ క్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖు చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్‌ వేశారు. ఆమెతో పాటు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేు బిగా గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీల్‌, గంప గోవర్ధన్‌, సురేందర్‌ తదితయి ఉన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి పువురు ఆశావాహు టికెట్‌ ఆశించినప్పటికి పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించని ఆమె ఈ నె 13న జరిగిన పార్టీ రాజ్యసభ అభ్యర్థు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నిక బరిలో నిలిచినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత సునాయాసంగా గొస్తారని పార్టీ వర్గాు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7న పోలింగ్‌ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.  2015లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన  భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.   ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాం 2022, జనవరి 4 వరకు ఉండటంతో  ఎన్నిక సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రక్రియ చేపట్టింది.
కాగా మాజీ ఎంపీ క్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే ఆ అందులో లేకపోవడంతో అంతా ఊపిరి ప్చీుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తెలిపారు. కాగా, నిజామాబాద్‌ చేరుకున్న కవిత శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థ కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖు చేశారు.