జగ(న్‌)మొండి వైఖరితో జనంలో చులకన

స్థానిక సంస్థ ఎన్నికల వ్యవహారంపై సుప్రీంలో ఏపీ సర్కారుకు చుక్కెదురు

`పార్టీకి తలనొప్పిగా మారిన జగన్‌ మొండి వైఖరి
`తాను పట్టిన కుందేుకు మూడుకొమ్ములే అన్న చందాన
`ప్రతి విషయంలోనూ దూకుడు నిర్ణయాలే
`ప్రతిపక్షాకు అస్త్రాుగా మారుతున్న ఏపీ సర్కారు నిర్ణయాు
`రాజధాను విషయంలోనూ తగ్గని తీరు
`స్థానిక ఎన్నికపై ప్రత్యామ్నాయంపై కసరత్తు
`కోర్టు వ్యవహారాలోనూ తప్పని అక్షింతు
`తీరు మారకుంటే ముందు ముందు తంటాలే
`జగన్‌ బాటలోనే అధికార మంత్రాంగం

హైదరాబాద్‌:
ఏపీలో స్థానిక సంస్థ ఎన్నిక కొనసాగింపును ఆరు వారా పాటు నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నిక సంఘం తీసుకున్న నిర్ణయం పైన ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నిక కమిషనర్‌ పైన చర్యు తీసుకోవాని స్వయంగా గవర్నర్‌ ను కోరారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నేనా..రమేష్‌ కుమారా అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు. దీని పైన సుప్రీం కోర్టుకు వెళ్లగా..అక్కడా ఎన్నిక సంఘానికి అనుకూంగా తీర్పు వచ్చింది. స్వయంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ ఈ తీర్పు ఇవ్వటంతో..ఇక, న్యాయపరంగా దాయి మూసుకుపోయినట్లే. అయితే, ముఖ్యమంత్రి జగన్‌ దీనిని అంత సువుగా వదటానికి సిద్ద పడటం లేదు. చంద్రబాబు ఒత్తిడితోనే ఎన్నికు వాయిదా వేశామని వైసీపీ నేతలే ప్రచారం చేయటంతో..ఇప్పుడు ఇది ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో..ఇప్పుడు ఏం చేయానే అంశంతో పాటుగా..ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేంటనే అంశం పైన సీనియర్‌ మంత్రుతో సమావేశం కావాని సీఎం జగన్‌ నిర్ధేశించారు. వచ్చే వారంలోనే అసెంబ్లీ సమావేశాు నిర్వహించే ఆలోచనకు వచ్చినట్లుగా తొస్తోంది. సుప్రీం తీర్పు..ప్రత్యామ్నాయాపైనే ఆలోచన ఎన్నిక సంఘం తమతో సంప్రదింపు చేయకుండా ఏకపక్షంగా ఎన్నికు వాయిదా వేయటాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్‌ గా తీసుకున్నారు. దీని పైన నేరుగా వెళ్లి గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుకు మేు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. దీంతో..ఇది ఒక రకంగా చంద్రబాబు వర్సెస్‌ ముఖ్యమంత్రి జగన్‌ మధ్య ప్రతిష్ఠాత్మక అంశంగా వైసీపీ నేత వ్యాఖ్యలే క్రియేట్‌ చేశాయి. ముఖ్యమంత్రిగా జగన్‌ ఉండగా..చంద్రబాబు ప్రభావంతో ఎన్నికు వాయిదా పడటం ఏంటనే చర్చకు వైసీపీ నేత వ్యాఖ్యు పరోక్షంగా కారణమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్‌ ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ సైతం తాను గవర్నర్‌ కు ఫిర్యాదు చేసానని..ఎన్నిక కమిషనర్‌ వైఖరి మారకుంటే మరింత ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. మరోవైపు చంద్రబాబు సైతం కరోనా గురించే పదే పదే మాట్లాడుతూ.. ఎన్నికల్లో అరాచకాు చేస్తుంటే తాము చూస్తూ కూర్చోవాలా అనే వ్యాఖ్యతో పరోక్షంగా వైసీపీ నేతకు సవాల్‌ విసిరారనే విశ్లేషణు మొదయ్యాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా..అక్కడ ప్రతికూ ఫలితం వచ్చింది. ఇక, న్యాయ పోరాటం పైన ముందుకు వెళ్లే అవకాశం లేదు. దీంతో..రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పరంగా తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గా పైన న్యాయ నిపుణుతో చర్చకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
దీనిని పరిగణలోకి తీసుకొని ..ఈ వ్యవహారాన్ని మరింత ముదురకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటించాలా..లేక ప్రభుత్వం ముందు ఉన్న అన్ని అస్త్రాను ప్రయోగించాలా అనేదే ఇప్పుడు ప్రభుత్వం కీక చర్చగా మారింది. దీని పైనే సీనియర్‌ మంత్రుతో పాటుగా న్యాయ నిపుణుతో చర్చించేందుకు సీఎం సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ముందున్న అవకాశాను వినియోగించుకోవానే భావిస్తే..వెంటనే అసెంబ్లీ సమావేశా నిర్వహణకు నిర్ణయం తీసుకొని సభా వేదికగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సీనియర్‌ మంత్రుతో సీఎం సమావేశం తరువాత దీని పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీక నిర్ణయాు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో విపక్ష పార్టీు ఎన్ని ఇబ్బందు సృష్టించినా మొండిగా ముందుకు వెళ్తున్నారు. కేవం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాదు అంతకు ముందు ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విడిపోయే విషయంలో కూడా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి మొండిగానే వ్యవహరించారు. పాదయాత్ర కు కాంగ్రెస్‌ పార్టీ అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తప్పుకుని  ఏకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. ఇక ఆ తర్వాత పాదయాత్ర చేస్తున్న సమయంలో… అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి పార్టీ జగన్‌ ను అక్రమాస్తు కేసులో జైల్లో పెట్టినప్పటికీ పాదయాత్ర అసు ఆగకూడదు అనే ఉద్దేశంతో… జగన్‌ సోదరి షర్మి తల్లి విజయమ్మతో పాదయాత్రను కంటిన్యూ చేశారు.
ప్రతిపక్షాు కూడా జగన్‌ మొండి వైఖరికి కాస్త భయపడుతున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్‌ చేయాలి అనుకున్నది చేస్తూనే వెళ్లారు. ఒకవేళ ఆయన చేయానుకున్న దానిలో చిన్న చిన్న మార్పు చేశారు కానీ ఏ విషయంలో వెనుకడుగు మాత్రం వేయలేదు. ఇప్పుడు  వరకు జగన్మోహన్‌ రెడ్డి తీసుకున్న కీక నిర్ణయాు అన్నింటిని… ప్రతిపక్ష పార్టీు ఎన్ని ఇబ్బందు సృష్టించినప్పటికీ మొండిపట్టు తోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోని 3 రాజధానికు సంబంధించి కార్యాచరణను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  ఇంకా ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు అన్నది ప్రస్తుతం అందరిలో నెకొన్న ప్రశ్న. అయితే ఆయన జాతకం ప్రకారం ఏప్రిల్‌ నెలో జగన్‌ ఇష్టానుసారంగా పాన సాగిస్తే కలిసివస్తుందని ఆయన ఎంతగానో నమ్మి సాదువు చెప్పారట. అయితే ఒకప్పుడు జగన్‌ కు ఇలాంటి నమ్మకాు కానీ పట్టింపు కానీ ఏమీ ఉండేది కాదు కానీ గత 2019 ఎన్నికు… నుంచి  ఇలాంటి నమ్మకాను పెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. అందుకే ఏప్రిల్‌ నె ముందు  వరకు జగన్‌ కు జాతకం ప్రకారం గండాు ఉన్నాయని ఏప్రిల్‌ నెలో జగన్‌ గండాన్నీ తొగిపోతాయని అప్పటి నుంచి తనదైన పానను కొనసాగించాలి అంటూ జగన్‌ నమ్మే  సాధువు చెప్పినట్లు రాజకీయ విశ్లేషకు భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇన్ని రోజు వరకు వేచి చూసినట్లు చెబుతున్నారు రాజకీయవిశ్లేషకు.
ఆత్మాభిమానం..ఆగ్రహం..
వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావం జాతీయ పార్టీకు ఒక చెంపపెట్టుగానే చెప్పాలి. జగన్మోహన్‌ రెడ్డి తన తండ్రి అడుగు జాడల్లో ఒక రాజకీయ నాయకునిగా పురుడు పోసుకున్నది కాంగ్రెస్‌ పార్టీలోనే. ఆ పార్టీ తొలి నుంచి ప్రాంతీయ నాయకుపట్ల చిన్నచూపు కనబరుస్తూనే వచ్చింది. 1980లో తొగుదేశం పార్టీ వ్యవస్థాపనకు కారణాల్లో అది కూడా ఒకటి. అదే విధంగా సొంతపార్టీ నాయకుడైన జగన్‌ మోహన్‌ రెడ్డి తపెట్టిన ఓదార్పుయాత్రకు బ్రేక్‌ వేయాని చూసింది. ఏపీలోని కొందరు నాయకు అసూయతో చేసిన ఫిర్యాదుకు అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో తండ్రి మరణం సానుభూతితో జగన్‌ రాజకీయంగా ఎదిగిపోతాడని భావించింది. జగన్‌ లో ఉన్న పొలిటికల్‌ పొటెన్షియాలిటీని గుర్తించడానికి నిరాకరించింది. ఆత్మాభిమానం దెబ్బతిన్న జగన్‌ పార్టీని ధిక్కరించారు. తానే ఒక శక్తిగా , వ్యవస్థగా , పార్టీగా రూపాంతరం చెందాడు. ఇది కాంగ్రెసు స్వయంకృతాపరాధం.
అడుగడుగునా ఎదురీత
పార్టీ స్థాపించినంత మాత్రాన నల్లేరుపై బండి నడక మాదిరిగా జగన్‌ ప్రస్థానం సాఫీగా సాగిపోలేదు. క్విడ్‌ ప్రో కో కేసు పట్టి పీడిరచాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ఊరకనే వదిలిపెట్టలేదు. చాలా రకాుగానే వేధించింది. దాంతో పాటు బమైన ప్రత్యర్థిగా మారతాడని భావించిన తొగుదేశమూ జగన్‌ ను టార్గెట్‌ చేసింది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాు, సీబీఐ కేసు ఏతావాతా నిర్బంధపరిస్థితును ఎదుర్కోవాల్సి వచ్చింది. విచారణలో భాగంగా జగన్‌ కు 16 నెలపాటు జైులో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. సమస్యు, సవాళ్లు నాయకుడిని రాటుదేలేలా చేస్తాయి. జగన్‌ విషయంలోనూ అదే జరిగింది. అన్ని వైపులా ప్రతికూ పరిస్థితు నెకొన్నప్పటికీ మొండి ధైర్యంతోనే ముందడుగు వేశారని చెప్పాలి. పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో బమైన ప్రభావాన్ని చూపుతుందనే సంకేతాు మెవడ్డాయి. 2012 ఉప ఎన్నికల్లో సానుభూతి ప్రభంజనం వీచింది. 18స్థానాకు గాను 15 స్థానాు గొచుకొంది. అయితే 2014 రాష్ట్ర విభజన వైసీపీపై పెను ప్రభావమే చూపింది. జనసేన, బీజేపీతో జట్టుకట్టిన తొగుదేశం పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్‌ లో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీకి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే తరువాయి అనుకుంటున్న పరిస్థితుల్లో పార్టీ చేదు ఫలితాన్ని చవిచూసింది. ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.
వ్యూహ నైపుణ్యంలో ఎంతో ఘటికుడైన చంద్రబాబు నాయుడి ఎత్తుగడను ఎదుర్కొంటూ వైసీపీ మనుగడ సాగించడమే కష్టమని రాజకీయ మేధావు తొుత భావించారు. టీడీపీ అధినేత వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయానే దిశలోనే పావు కదిపారు. 23 మంది ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుని అందులో నుగురికి మంత్రి పదవు ఇచ్చారు. వైసీపీ శ్రేణుల్లో నైతిక స్తైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీకి భవిష్యత్‌ లేదనే సూచనను ప్రజల్లోకి పంపానుకున్నారు. ఒకరకంగా చూస్తే టీడీపీ అనైతిక పద్ధతు వైసీపీకి కలిసొచ్చాయి. శాసనసభను 2017 నవంబర్‌ నుంచి వైసీపీ ఎమ్మెల్యేు బహిష్కరించారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. తద్వారా ప్రభుత్వంపై తీవ్రస్థాయి అవిశ్వాసాన్ని జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించగలిగారు. దాంతో పాటు తమ పార్టీ విధానాను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి 2017 నవంబర్‌ ఆరో తేదీ నుంచి ప్రజాసంక్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 14 నెలపాటు 3648 కిలోమీటర్ల మేరకు సాగిన ఈ పాదయాత్ర రాజకీయ పార్టీగా వైసీపీకి టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవాలి.