సామాజిక దూరం పాటిద్దాం
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు సందేశం
హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సూచించారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాత్మక వీడియోను షేర్ చేశారు. వరుస క్రమంలో ఉన్న అగ్గిప్లు ఒకదాని తర్వాత మరొకటి కాలిపోతుండగా.. ఓ అగ్గిప్లు పక్కకు తప్పుకుంటుంది. దీంతో మంటు అక్కడితో ఆగిపోయి మిగిలిన అగ్గిప్లు సురక్షితంగా ఉంటాయి. వీటిని మనుషుతో ప్చోుతూ ఆయన సందేశం ఇచ్చారు.
‘‘ఇప్పుడు సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. ఇది చాలా కష్టం, కానీ ఉండాలి. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేసి పబ్లిక్ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన సమయం ఇది. వీలైనంత వరకు ఇంటిలోనే ఉండండి. ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యు, ఇష్టమైన వారితో గడపండి. వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా మంది జీవితాు సురక్షితంగా ఉంటాయి’’ ‘తరచూ మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. మీ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి. వీలైనంత వరకు హ్యాండ్ శానిటైజర్‌ను వినియోగించండి. మీ ఆరోగ్యం బాగోలేదనిపిస్తే మాస్క్‌ు వాడండి. వైరస్ బారి నుంచి పూర్తిగా బయటపడే వరకు ఈ సూచనల్ని పాటిద్దాం. కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కొందాం. జాగ్రత్తగా ఉండండి’ అని మహేశ్ పోస్ట్ చేశారు.