కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు తీపి కబురు

కరువు భత్యాన్ని 21 శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

న్యూఢల్లీి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేత ృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు 17 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 21 శాతానికి చేరుకుంది. కాగా ఈ పెరుగుద జనవరి 01, 2020 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ నేడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 48 క్ష మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు, 65 క్ష మంది పింఛనుదార్లకు ప్రయోజనం చేకూరనుంది.
కాగా ఇందుకు గానూ ప్రభుత్వంపై 14,595 కోట్ల రూపాయ అదనపు భారం పడనున్నట్టు మంత్రి వివరించారు. ఏడో వేతన సంఘ సిఫార్సును 2016లో మోదీ ప్రభుత్వం అము చేసినపుడు వేతనాు పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మొత్తం 1.13 కోట్ల కుటుంబాు ప్రయోజనం పొందనున్నాయని ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.