దౌర్జన్యాు శృతిమించిపోయాయి
మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీరియస్
అమరావతి: రాష్ట్రంలో వైకాపా కార్యకర్త దౌర్జన్యాు, అరాచకాు శృతి మించిపోయానని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతు బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు న్యాయవాది కిశోర్ ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా కార్యకర్త దాడిని ఆయన తీవ్రంగా ఖండిరచారు. వాళ్లను వెంబడిరచి చంపేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అరాచకాు పరాకాష్ఠకు చేరుకున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో న్యాయస్థానాు, ఎన్నిక సంఘం ఉన్నాయా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చెప్పే మాటకు చేతకు పొంతన లేదని విమర్శించారు. బుద్దా వెంకన్న, బొండా ఉమకు రక్షణగా ఉన్న పోలీసు వాహనంపైనా వైకాపా కార్యకర్తు దాడి చేశారని.. ఇంత జరిగినా పోలీసుకు బాధ లేదా? అని ప్రశ్నించారు.
డీజీపీ ఏం సమాధానం చెబుతారు?
‘‘మాచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వానికి కనబడలేదా? ఏంటీ రాజకీయాు? గత 40ఏళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? డీజీపీ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఆయన ఏం సమాధానం చెబుతారు? ఇంత జరిగినా చీమకుట్టినట్లైనా లేదు? బుద్దా వెంకన్న, బొండా ఉమపై హత్యాయత్నం జరిగితే ఏం చేస్తున్నారు. చంపేస్తారా? చంపండి! తమాషా ఆటు ఆడుతున్నారు. ఎప్పుడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఇలా జరిగిందా? ఇంత అరాచకాలేంటి? కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? కట్టడి చేయలేకపోతే వ్యవస్థ ఎందుకు? ప్రజు స్వేచ్ఛగా తిరగడానికి లేదా? ఓటు వేసే హక్కు లేదా? కశ్మీర్, బిహార్‌లోనూ ఇలా జరగలేదు’’ అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పు చెరిగారు.
నియంత పాన అడ్డుకోలేమా?
రాష్ట్రంలో నియంతపాన కొనసాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని.. ఆ హద్దున్నింటినీ వైకాపా నేతు అతిక్రమించారని విమర్శించారు. ప్రజలే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘చేతు జోడిరచి అడుగుతున్నా.. ఆలోచించుకోండి. మేం కూడా పోరాడతాం. వైకాపా అరాచకాను అడ్డుకోవడం మా ఒక్కరితోనే సాధ్యం కాదు. నియంత పాన అడ్డుకోలేమా? బాధ, ఆవేదన కుగుతోంది. రాష్ట్రాన్ని శాశ్వతంగా తాకట్టు పెట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. మీకూ బాధ్యత ఉంది.. మీరూ పోరాడాలి’’ అని ప్రజను చంద్రబాబు కోరారు.