దెబ్బతింటున్న జ..ఆశయం
గృహ, పారిశ్రామిక వ్యర్థాతో ప్రమాదకర స్థాయిలో బీఓడీ
`మురుగు, ఘన వ్యర్థాతో కృష్ణా, గోదావరి
`నదుల్లో క్షీణిస్తున్న ఆక్సిజన్ స్థాయి
`54 ప్రధాన పరీవాహక పట్టణా నుంచి మురుగు
`200 ఎంఎల్‌డీ మురుగు గోదావరిలోకి
`మంజీరా, మూసీ నదుల్లో 60 ఎంజీకు బీఓడీ స్థాయి`
`మున్సిపాల్టీల్లో వ్యర్థా నివారణే మార్గం
`తేల్చిన జాతీయ హరిత ట్రిబ్యునల్
హైదరాబాద్:
తెట్టొ కట్టిన మురుగు.. గుట్టుగా పోగుబడిన వ్యర్థాు.. చూస్తేనే ‘జ’దరింప చేసేలా ఉన్న ఇది మురుగు కాువ కాదు. జీవనది గోదావరి. మంచిర్యా పట్టణం, దాని చుట్టుపక్క ప్రాంతాల్లోని గృహ, పారిశ్రామిక వ్యర్థ జమంతా రాళ్లవాగు ద్వారా నేరుగా వచ్చి గోదావరిలో ఇలా కుస్తోంది. నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయి లీటరుకు 3 మిల్లీగ్రాము మించితే ప్రమాదకరంగా భావిస్తారు. అయితే, గోదావరిలో బీఓడీ స్థాయి 4 నుంచి 9 మిల్లీగ్రాము వరకు ఉందంటే.. ఈ జీవనవాహిని ఎంతటి కాుష్య కాసారంగా మారిపోతోందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రానికి వర ప్రదాయినిుగా ఉన్న నదీమ త్లు కాుష్య కోరల్లో చిక్కుకుంటున్నా యి. నిత్యం వే గ్యాన్ల మురుగునీరు, టన్ను కొద్దీ చెత్త, పారిశ్రామిక వ్యర్థాు కుస్తుండటంతో క ృష్ణా, గోదావరి నదు కాుష్య కాసారాుగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామ, పట్టణ ప్రాంతా నుంచి శుద్ధి చేయని మురుగును నదిలోకి వదిలేస్తుండటం, ప్లాస్టిక్ వంటి ఘన వ్యర్థా కారణంగా వంద కిలోమీటర్ల మేర గోదావరి, క ృష్ణా నదు కుషితమవుతున్నాయి. దీంతో నదుల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి, ఆ నీరు తాగడానికి, స్నానం చేసేందుకే కాదు కనీసం జచరాు కూడా బతకలేని పరిస్థితిని తీసుకొస్తున్నాయి.
అత్యంత ప్రమాదకరంగా గోదావరి..
బాసర నుంచి భద్రాచం వరకు 500 కి.మీ. మేర ప్రయాణిస్తున్న గోదావరిలో 4 ఉపనదు, మరిన్ని నాలాు కుస్తున్నాయి. నది పరీవాహకంలోని 19 ప్రధాన పట్టణా నుంచి గోదావరిలో అవ్యవస్థీక ృత వ్యర్థాు, పారిశ్రామిక వ్యర్థాు, మురుగు నీరు వచ్చి చేరుతోంది. బాసర వద్ద గోదావరిలోకి మహారాష్ట్రలోని పరిశ్రమ ద్వారా, భద్రాచం వద్ద ఐటీసీ కాగితపు పరిశ్రమ ద్వారా వ్యర్థాు గోదావరిలో కుస్తున్నాయి. భద్రాచంలో మురుగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో ఆ నీరంతా బూర్గంపహాడ్ వద్ద నదిలో కుస్తోంది. మంచిర్యా పట్టణ మురుగునీరు రాళ్లవాగు ద్వారా, ధర్మపురి పుణ్యక్షేత్రం వద్ద నాలా ద్వారా మురుగు గోదావరిలోకి వస్తోంది. మొత్తంగా 54 పరివాహక పట్టణాల్లోని మురుగు క్వా ద్వారా గోదావరిలోకి వచ్చి చేరుతున్నట్లు ఇదివరకే గుర్తించారు.
ఈ పరివాహక పట్టణాల్లో 22.57 క్ష మేర జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 249.81 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) మేర నీరు వినియోగిస్తుండగా అందులో 200 ఎంఎల్‌డీ మురుగు నదిలో చేరుతోంది. రోజుకు 6.75 క్ష కేజీ ఘన వ్యర్థాు నదిలో చేరుతుండటం మరింత సమస్యగా మారుతోంది. దీనికి తోడు పరీవాహకం వెంట ఉన్న 244 పరిశ్రమ ద్వారా 8,825 కేఎల్‌డీ వ్యర్థాు నదిలో చేరుతున్నాయి. దీంతో నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ (డీఓ) పరిమాణం క్రమంగా తగ్గుతోంది. డీఓ పరిణామం లీటర్‌కు కనీసం 4 మిల్లీగ్రాము ఉండాలి. కానీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక నీటిలో బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్‌కు 3 మిల్లీగ్రాము మించొద్దని నిబంధను ఉన్నా.. ప్రస్తుతం నదిలో బీవోడీ స్థాయి 4 నుంచి 9 మిల్లీగ్రాము/లీ వరకు ఉంది.
దీంతో నదిలోని నీరు తాగేందుకు కానీ, స్నానాకు కానీ వాడేందుకు పనికి రావు. డీవో తగ్గేకొద్దీ బీఓడీ పెరుగుతూ వస్తోంది. గోదావరికి ఉపనది అయిన మంజీరాలోనూ బీఓడీ స్థాయి ఏకంగా 5 ఎంజీ/లీ నుంచి 26ఎంజీ/లీటర్‌గా ఉందని నివేదికు చెబుతున్నాయి. నక్కవాగులో సైతం బీఏడీ శాతం ఏకంగా 26 ఎంజీ/లీటర్‌గా నమోదైంది. ఇక వరంగల్ నుంచి సోమన్‌పల్లి వరకు ఉన్న మానేరులోనూ 6-20ఎంజీ/లీటర్‌గా బీఓడీ నమోదు కావడం గమనార్హం. ఇవే పరిస్థితు కొనసాగితే మున్ముందు జచరాకు తీవ్ర గడ్డు పరిస్థితు తలెత్తడంతో పాటు సాగు అవసరాను తీర్చడం ఇబ్బందికరంగా పరిణమించనుంది.
కృష్ణాలోనూ అదేతీరు..
కృష్ణా నదీ, దాని ఉపనదుల్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తంగడి మొదు వడపల్లి వరకు ఉన్న కృష్ణా పరివాహకంలో బీఓడీ స్థాయి 5-%నుంచి 7మి.గ్రా/లీ.గా నమోదవ్వగా, మూసీలో అయితే ఏకంగా 4మి.గ్రా/ లీ నుంచి 60మి.గ్రా/లీటర్‌గా ఉంది. కర్నూు తుంగభద్ర నది ద్వారా ఎగువ నుంచి కాుష్య రసాయనాు కృష్ణాలో కుస్తున్నాయి. దీంతో పాటు కృష్ణా పరివాహకం వెంట ఉన్న కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వా, న్లగొండ వంటి పట్టణా ద్వారా వస్తున్న మురుగు కారణంగా కృష్ణానది కాుష్యం బారిన పడుతోంది.
అడ్డుకట్ట ఎలా వేయాంటే..
నదీజలాు కుషితం కాకుండా ఉండాంటే ఏమేం చేయాలో జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్రాకు కొన్ని సూచను చేసింది. అవి..
కాుష్య నివారణకు పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాను నియంత్రించడంతో పాటు, శుద్ధి చేసేలా జాగ్రత్తు తీసుకోవాలి. ఎక్కువగా మురుగు ఉత్పత్తికి కారణమవుతున్న పట్టణాు, గ్రామాను గుర్తించి ఎస్టీపీు ఏర్పాటు చేయాలి.
ఎన్టీపీసీ, టీఎస్‌జెన్‌కోు ఉన్న ప్రాంతాల్లో కర్మాగారా నుంచి మెవడే బూడిద నియంత్రణకు సరైన యాంత్రీకరణ ఉండాలి. ప్రతి ఆస్పత్రిలో తక్కువ వ్యయంతో దాని ఆవరణలోనే ఎస్టీపీు ఏర్పాటు చేయించాలి. నది పరీవాహకంలోని పరిశ్రమన్నీ భూగర్భ జ వనరుశాఖ అనుమతిలేనిదే వ్యర్థాు విడుద చేయకుండా జాగ్రత్తు పాటించాలి.
ప్రక్షాళనకు కేంద్రం చొరవ
దేశవ్యాప్తంగా అత్యంత కుషితమైనవిగా గుర్తించిన 13 నదుల్లో క ృష్ణా, గోదావరి ఉండటంతో గంగానది మాదిరిగా వీటినీ ప్రక్షాళన చేయాని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా అనంత్ 1, అవిరల్‌ధార, నిర్మల్ ధార పేర్లలో కార్యక్రమాను చేపట్టిన కేంద్రం, రాష్ట్ర అటవీశాఖ సహకారంతో కృష్ణా, గోదావరి నదు పునరుజ్జీవానికి ప్రయత్నా ు ముమ్మరం చేసింది. తొలి ప్రయత్నంలో భాగంగా నదు ప్రస్తుత స్థితి, పరివాహక ప్రాంత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమైంది. కృష్ణా, గోదావరి నదుకు 2 వైపులా 5 కి.మీ. మేర, వాటి ఉపనదు పరిధిలో ఇరువైపులా 2 కి.మీ. మేర మొక్కు నాటేందుకు సన్నద్ధమవుతోంది. నదీ పరివాహకాల్లో చెట్లు నాట డం, కోతను నియంత్రించడం, ఇసుక తవ్వకాను నిషేధించడం వంటివి చేపట్టనుంది.
కాుష్య వ్యర్థాు, మానవ వ్యర్ధాు , రసాయనాు, దుర్వాసన, మురుగు నీరు కాకూట విషం ఇదంతా మూసీ ప్రత్యేకతు. మూసి అంటే ముక్కు మూసుకోవాల్సిందే. హైదరాబాద్ మహానగరంలో ప్రవహించే మూసీ నది నగరవాసుకు దుర్వాసన వెదజ్లుతోంది. పారిశ్రామిక వ్యర్ధాు మూసిని మురికి కూపంగా మారుస్తున్నాయి. ఒకప్పుడు జీవ నది సాగు , తాగునీరు అందించిందీ మూసీ నది అంటే ఎవరు నమ్మరు. అప్పుడలా ఉన్న భాగ్యనగరం మూసీనది ఇప్పుడు మురికి కూపంగా మారింది. దుర్వాసన వెదజ్లుతోంది. దోమకు నియమైంది. నగరంలోని 30కి పైగా నాలా ద్వారా మూసీలోకి మురుగు చేరుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగు మూసీలో కుస్తోంది. అత్తాపూర్, అంబర్‌పేట, నాగోల్, న్లచెరువు ప్రాంతాల్లో 600 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో మురికి నీటిని శుద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే 400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయినా మురుగు తగ్గలేదు. సుందరీకరణ జరగలేదు. మురుగును మళ్లించడానికి ఏర్పాటు చేసిన పైపులైన్లు, ట్రీట్ ప్లాంట్స్ సరిగా పనిచేయకపోవడంతో సీవరేజ్ వాటర్ మూసీలోకి చేరుతుంది. మూసీ పరిరక్షణ, పరివాహక ప్రాంతాను అభివ ృద్ధి చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. మురుగునీటిని అరికట్టడం, వాటిని శుద్ధి చేసి నదిలోకి వదడం, నది వెంబడి పర్యాటక స్థలాు అభివృద్ధి చేయడం, వాక్ మే, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు… గ్రీన్ స్పెస్, ఎకో టూరిజం కోసం ప్రణాళికు సిద్ధం చేస్తున్నారు. మూసిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అందమైన మూసిని అందుబాటులోకి తేవాని సిటిజన్స్ కోరుతున్నారు.