న.మో..నమస్తే
కిక్కిరిసిన జనా మధ్య మోతేరా స్టేడియంలో మోదీ`ట్రంప్ అభివాదం
‘‘నమస్తే ట్రంప్.. నేను ఇండియా-యూఎస్ ఫ్రెండ్‌షిప్ అంటే మీరు లాంగ్‌లీవ్ అనాలి. ఐదు నెల క్రితం నేను అమెరికా యాత్రను హ్యూస్టన్‌లో హౌదీమోదీ కార్యక్రమంతో మొదుపెట్టాను. నేడు నా మిత్రుడు ట్రంప్ అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’తో మొదుపెడుతున్నారు. ఆయన చాలా సుదూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. వెంటనే సబర్మతి ఆశ్రమానికి వెళ్లి ఇక్కడికి చేరుకొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోకి మీకు సుస్వాగతం. మీకు స్వాగతం పలికిన భూమి గుజరాత్‌ది అయినా.. ఉత్సాహం భారత్ మొత్తానిది.’’
`నరేంద్ర మోదీ
‘భారత్ అంటే మాకు చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. దాన్ని చాటిచెప్పేందుకు మెలానియా, నేను 8000 కిలోమీటర్లు ప్రయాణించాం. మోతెరా లాంటి అద్భుతమైన స్టేడియంలో ప్రసంగించడం గర్వంగా ఉంది. భారత్‌లో నాకు ఘన స్వాగతం భించింది. దీన్ని నేను, మెలానియా ఎప్పటికీ మర్చిపోం’
`డొనాల్డ్ ట్రంప్
అహ్మదాబాద్ :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన కొనసాగుతోంది. సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం ట్రంప్ దంపతు నేరుగా మోతెరా స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియంలో ఏర్పాటుచేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ దంపతుతో పాటు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తదితయి పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజతో మోతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..
‘నమస్తే ట్రంప్.. నేను ఇండియా-యూఎస్ ఫ్రెండ్‌షిప్ అంటే మీరు లాంగ్‌లీవ్ అనాలి. ఐదు నెల క్రితం నేను అమెరికా యాత్రను హ్యూస్టన్‌లో హౌదీమోదీ కార్యక్రమంతో మొదుపెట్టాను. నేడు నా మిత్రుడు ట్రంప్ అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’తో మొదుపెడుతున్నారు. ఆయన చాలా సుదూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. వెంటనే సబర్మతి ఆశ్రమానికి వెళ్లి ఇక్కడికి చేరుకొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోకి మీకు సుస్వాగతం. మీకు స్వాగతం పలికిన భూమి గుజరాత్‌ది అయినా.. ఉత్సాహం భారత్ మొత్తానిది. ట్రంప్ ఆయన భార్య,కుమార్తె ఇవాంక, అు్లడు జర్డే ఇక్కడికి రావడం భారత్‌కు అమెరికాతో కుటుంబం వంటి సంబంధాున్నాయన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఈ కార్యక్రమం పేరైన నమస్తేకు చాలా అర్థం ఉంది.’
‘మిస్టర్ ప్రెసిడెంట్ మీరు.. ఇప్పుడు వే సంవత్సరా క్రితం వెసిల్లిన ధోవీర పట్టణం, లోథల్ రేవు, భారత స్వాతంత్య్రంలో కీక పాత్ర పోషించిన సబర్మతి ఒడ్డున ఉన్నారు. ఇక్కడ వివిధ భాషు, ఆహారం, జాతు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనిపించేదే భారత తత్వం. ఒక దేశం ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అయితే.. రెండోది ప్రపంచం మొత్తాన్ని కుటుంబం అనుకుంటుంది. ఒక దానికి లిబర్టీ ఆఫ్ స్టాట్యూ గర్వకారణం. రెండోచోట ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమ స్టాట్యూఆఫ్ యూనిటీ ఉంది. భారత ప్రజ తరఫున ట్రంప్‌ను మాట్లాడేందుకు ఆహ్వానిస్తున్నాను.’’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పువురు కేంద్ర మంత్రు, ఉన్నతాధికాయి ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్ సహాదారు ఇవాంక, అు్లడు జారెడ్ కుష్నర్, అమెరికాకు చెందిన పువురు మంత్రు, ఉన్నతాధికారు బ ృందం కూడా భారత్‌కు విచ్చేసింది.
22 కి.మీ. రోడ్ షో..
ఎయిర్‌పోర్టు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళకారు ప్రదర్శన బ ృందాు ట్రంప్‌నకు స్వాగతం పలికాయి. ఆయన పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్ ఆంక్షు విధించారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో ఇరు దేశాధినేతు పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
నా నిజమైన స్నేహితుడు మోదీ :ట్రంప్
భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని, దాన్ని చాటి చెప్పేందుకే నేను 8000 కిలోమీటర్లు ప్రయాణించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ప్రజనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్.. ప్రధాని మోదీపై ప్రశంసు కురిపించారు.
‘భారత్ అంటే మాకు చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. దాన్ని చాటిచెప్పేందుకు మెలానియా, నేను 8000 కిలోమీటర్లు ప్రయాణించాం. మోతెరా లాంటి అద్భుతమైన స్టేడియంలో ప్రసంగించడం గర్వంగా ఉంది. భారత్‌లో నాకు ఘన స్వాగతం భించింది. దీన్ని నేను, మెలానియా ఎప్పటికీ మర్చిపోం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
మోదీ అసాధారణ నేత
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంస వర్షం కురిపించారు. మోదీ అసాధారణ నేత అని, భారత అభివృద్ధి కోసం ఆయన రాత్రింబవళ్లు ఎంతగానో క ృషి చేస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్‌కు మాత్రమే ఆదర్శం కాదని, శ్రమ.. పట్టుదతో ఏదైనా సాధించొచ్చని మోదీ నిరూపించారని ట్రంప్ చెప్పారు. ‘‘మోదీ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఒక ఛాయ్ వాలాగా జీవితం మొదుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంలో అందరూ ఆయన్ను అభిమానిస్తారు. మోదీ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. నా నిజమైన స్నేహితుడు మోదీ. అద్భుత విజేతగా దేశాభివ ృద్ధి కోసం నిరంతరం క ృషి చేస్తున్నారు. ఐదు నెల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ మైదానంలో మోదీకి స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో నాకు స్వాగతం పలికారు’’ అని ట్రంప్ చెప్పారు.
భారత్ ఎదుగుద ప్రపంచానికి మార్గదర్శకం
‘భారత్ అద్భుత అవకాశాకు నెవు. 70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. ప్రపంచానికి భారత్ ఎదుగుద ఓ మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామ్య దేశంగానే ఎన్నో విజయాు సాధించింది. భారత్ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారు. సర్వమానవ సౌభ్రాత ృత్వానికి ప్రతీకగా హోళీ జరుపుకొంటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవు, జైను, బౌద్ధు, సిక్కు అందరూ కలిసి జీవించే దేశం ఇది. వందకు పైగా భాషతో కలిసిమెలిసి ఉండే భారత్ ప్రపంచానికి ఎంతో ఆదర్శం. అమెరికాకు గుజరాతీు అందించిన సేమ ప్రశంసనీయమైనవి. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం నాలో గొప్ప స్ఫూర్తి నింపింది. మహాత్ముడిని స్మరిస్తూ రేపు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తా’ ట్రంప్ చెప్పుకొచ్చారు.
పురుషు జాగ్రత్త..!
‘దక్షిణాసియాలో భారత్ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. వాణిజ్య వ్యాపార సంబంధాు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవ కాంలో ఇరుదేశా మధ్య వాణిజ్యం 40శాతం పెరిగింది. ఇరుదేశా మధ్య ఎగుమతు, దిగుమతు వ ృద్ధి పథంలో ఉన్నాయి. మోదీ వేగవంతమైన సంస్కరణతో వ్యాపార వాణిజ్యంలో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు. దేశాభివ ృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తు గొప్ప ప్రగతి సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళు దూసుకొస్తున్నారు. పురుషు జాగ్రత్తగా ఉండండి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ నోట సచిన్, కోహ్లీ మాట
ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమాు, క్రీడ గురించి ట్రంప్ ప్రస్తావించారు. క్రికెట్ దిగ్గజాు సచిన్ తెంద్కూర్, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప క్రీడాకారును ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారత్‌ది అని కొనియాడారు. ఇక భారత్ ఏటా 2000కు పైగా సినిమాను విడుద చేస్తోందని, వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ భిస్తోందన్నారు. దిల్‌వాలే ద్హునియా లే జాయింగే, షోలే లాంటి క్లాసికల్ చిత్రాను యావత్ ప్రపంచం ఎంతో ఎంజాయ్ చేస్తోందన్నారు.
3 బిలియన్ డార్ల ఒప్పందం
‘ఇరు దేశా మధ్య రక్షణ సహకారం కొనసాగుతుంది. భారత్‌కు మరిన్ని అధునాతన సైనిక పరికరాు, ఆయుధాు అందించేందుకు అమెరికా ఎదురుచూస్తోంది. దీనికోసం మంగళవారం భారత్, అమెరికా మధ్య 3 బిలియన్ డార్ల ఒప్పందం కుదరనుంది. రక్షణరంగంలో భారత్‌కు అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉండనుంది. ద్వైపాక్షిక బంధానికి మోదీ, నేనూ కృషి చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..
‘ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదును అడ్డుకునేందుకు భారత్-అమెరికా ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి మా ప్రజను రక్షించుకునేందుకు ఇరు దేశాు కట్టుబడి ఉన్నాయి. ఇటీవలే మేం ఐసిస్ అధినేతను హతమార్చాం. అది చాలా గొప్పవిషయం. ఉగ్రవాద నిర్మూనకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తున్నాం. దీని వ్ల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతు తగ్గుతాయని ఆశిస్తున్నాం’ అని ట్రంప్ చెప్పారు.
చంద్రయాన్ 2పై ప్రశంసు
‘అంతరిక్ష అన్వేషణలో భారత్, అమెరికా దగ్గరగా పనిచేస్తున్నాయి. మోదీ నేత ృత్వంలో భారత అంతరిక్ష ప్రయోగాు అభినందనీయం. చంద్రయాన్ 2 గొప్ప ప్రయోగం. అంతరిక్ష విజయా కోసం అమెరికా భారత్‌కు ఎ్లప్పుడూ సహకారం అందిస్తుంది’ అని ట్రంప్ పేర్క్న్న్షొరు.
ప్రపంచ శాంతి, ప్రజ ఆకాంక్షకు రెండు దేశాు శక్తిమంతమైన రక్షకుగా నివాని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఈ రోజు మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. భారతదేశ గత వైభవానికి మీరంతా గర్వపడాలి. భవిష్యత్తు కోసం ఏకమవ్వాలి. స్వేచ్ఛ, మివ కోసం రెండు దేశాు కలిసి రావాలి. గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ ఇండియా. వి వ్ ఇండియా వెరీ మచ్’ అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఆర్థిక ప్రబ శక్తిగా భారత్
భారత్ ఆర్థిక ప్రబ శక్తిగా ఎదిగింది. దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 12 కోట్ల మందికి పైగా ప్రజు ఇంటర్‌నెట్ వాడుతున్నారు. మౌలిక సదుపాయా క్పనలో ఎంతో పురోగతి సాధించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ స్ధాయిలో మధ్యతరగతి ప్రజు ఉన్నారు
సచిన్, కోహ్లీు ఇక్కడే..
ప్రపంచ క్రికెట్‌లో అద్భుతాు స ృష్టించి సత్తా చాటిన క్రికెట్ దిగ్గజాు సచిన్ టెండ్కూర్, విరాట్ కోహ్లీ పుట్టిన్లిు భారతేనని కొనియాడారు. భవిష్యత్‌లో భారత్ అద్భుత శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఈ దశాబ్ధంలో భారత్ అత్యధిక విజయాు సాధించింది. ఈ భారీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. భారత్ మాతా కీ జై ’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇవాంకా..సెల్ఫీ ప్లీజ్
తొలిసారిగా భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అహ్మదాబాద్ ప్రజు సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి స్టేడియంకు వెళ్లే దారిలో ప్రజు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని జెండాతో, సంప్రదాయ న ృత్యాతో ట్రంప్‌కు స్వాగతం పలికారు. మొదటగా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ దంపతు.. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ కూడా భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొతేరా స్టేడియంకు చేరుకున్న ఆమెను ప్రజు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ‘సెల్ఫీ ప్లీజ్’ అంటూ ఇవాంకా ట్రంప్‌తో ఫొటోు దిగేందుకు పోటీపడ్డారు.
తాజ్‌మహల్ సందర్శించిన ట్రంప్ దంపతు
భారత చారిత్రక కట్టడం, ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ అందాను వీక్షించారు. అక్కడి ప్రఖ్యాత బెంచ్ వద్ద న్చిుని ఫొటోకు పోజిచ్చారు.
అహ్మదాబాద్ నుంచి నేరుగా ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా ట్రంప్ దంపతు తాజ్‌మహల్ చేరుకున్నారు. స్థానిక గైడ్ ఒకరు వీరికి తాజ్ గొప్పదనాన్ని వివరించారు. అంతకుముందు ఇక్కడి సందర్శకు పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాశారు. కాసేపటి తర్వాత ట్రంప్ కుమార్తె ఇవాంకా, అు్లడు జేర్డ్ కుష్నర్ కూడా తాజ్ సందర్శనకు వచ్చారు.