ఆధార్‌ నోటీసుపై అసదుద్దీన్‌ ఫైర్‌..

ఆధార్‌ సంస్థ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

హైదరాబాద్‌ : పౌరసత్వాన్ని నిరూపించుకోవాంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసు జారీ చేయడంపై  ఏఐఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉడాయ్‌, తెంగాణ పోలీసుపై మండిపడ్డారు. ఉడాయ్‌ నోటీసు అందుకున్న 127 మందిలో ముస్లిరు, దళితు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఆధార్‌ సంస్థ తన అధికారాను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ చూపమని అడగటం విరమించుకోవాని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెంగాణ పోలీసును ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్‌ ట్వీట్‌ చేశారు. నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్‌ సస్పెండ్‌ చేయాని మరో పోస్టులో ఆయన కోరారు. కాగా 127 మందికి నోటీసు జారీ చేసిన ఉడాయ్‌ అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాని వారిని ఆదేశించింది. సరైన పత్రాు సమర్పించకపోయినా, భారత పౌరుమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డును రద్దు చేస్తామని హెచ్చరించింది.