రైతు రాబడి రెట్టింపయ్యేనా?

2023 సంవత్సరం నాటికి రైతు రాబడి రెట్టింపు కావాంటే వారి ఆదాయం ఏటా 30 శాతం పెరగవసివున్నది. రైతు స్థితిగతును మెరుగుపరిచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దిగుబడు పెంపుద వ్యూహం ఆ క్ష్య పరిపూర్తికి తోడ్పడదు. రైతు స్థితిగతును మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం దృఢనిశ్చయంతో వున్నది. 2023 సంవత్సరం నాటికి సాగుదారు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు నిబద్ధమయింది. ఈ మేరకు తన హామీని 2020-21 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో కూడా పునరుద్ఘాటించింది.  2013-19 సంవత్సరా మధ్య మన రైతు ఆదాయం ఏడాదికి 7శాతం చొప్పున పెరిగిందని ఒక ప్రతిష్ఠాత్మక ఆర్థిక అధ్యయనా సంస్థ నిర్ధారించింది. మరో మూడేళ్ళలో రైతు రాబడిని రెట్టింపు చేయాన్న పాకు సంక్పం నెరవేరాంటే సాగుదారు ఆదాయం ఏడాదికి 30 శాతం చొప్పున పెంపొందవసివున్నది! రైతు ఆదాయాన్ని అధికం చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త బడ్జెట్‌లో ఒక ప్రతిపాదన చేశారు. దిగుబడు పరిమాణాన్ని ఇతోధికం చేయడమే ఆ వ్యూహం. సమత్యు ఎరువు, సోలార్‌ పంప్‌ సెట్స్‌ నుపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా దిగుబడును అధికంచేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు సాధారణంగా అమ్మకాు విరివిగా జరుగుతాయి. రైతుకు మరింత ఆదాయం భిస్తుంది. అయితే దిగుబడు పెరుగుద, ఆదాయా హెచ్చుద మధ్య సంబంధం సున్నితమైనది. అంతేకాదు, అది సాగుదారుకు సానుకూంగా వుండే అవకాశమూ లేదు. ఎందుకంటే ఉత్పత్తుకు భించే ధరపై ఆ సంబంధం ఆధారపడివున్నది. పాంపూర్‌ రైతు తాము ఉత్పత్తి చేసిన బంగాళాదుంపను రోడ్లపై పారేశారు. తమ ఫసాయానికి గిట్టుబాటు ధర భించక పోవడం వ్ల వారు తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. నిజానికి వ్యవసాయోత్పత్తు ధరు తగ్గిపోవడమనేది గత కొన్ని దశాబ్దాుగా రైతుకు ఆశనిపాతంగా వున్నది. ఎందుకని? నవీన సాంకేతికతు ఉత్పత్తిని ఇతోధికంగా పెంచుతున్నాయి. వ్యవపాయోత్పత్తు సరఫరా సమృద్ధిగా ఉంటోంది. సమస్యేమిటంటే ఈ సమ ృద్ధ సరఫరాకు అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడం లేదు.పెరుగుతున్న ఉత్పత్తుకు సమ నిష్పత్తిలో ప్రపంచ జనాభా పెరగడం లేదు. సరఫరా వున్నా గిరాకీ లేదు. ఫలితంగా వ్యవసాయోత్పత్తు ధరు తగ్గిపోతున్నాయి. జీవ ఇంధనా (బయో ఫ్యూయెల్స్‌) అభివృద్ధి రైతుకు కొంత ఉపశమనాన్నిచ్చింది. అయితే వీటి ధర కూడా గత కొన్ని సంవత్సరాుగా తగ్గిపోతున్నది. ఆర్థిక మంత్రి అభిషించినట్టు దిగుబడు పెరుగుద ఆదాయా హెచ్చుదకు విధిగా దారితీయదు. ఉత్పత్తి వ్యయాను సైతం రాబట్టుకోలేని విధంగా రైతు పరిస్థితి విషమించే ప్రపమాదమూ ఎంతైనా వున్నది.  మరి రైతు శ్రేయో సాధనకు మార్గాంతరమేమిటి? దిగుబడు నాణ్యతను పెంపొందించడమే. ఆర్థిక మంత్రి ఈ దిశగా ప్రశస్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు ఆమె ఎంతైనా అభినందనీయురాు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఒక నిర్దిష్ట పంటను గుర్తించి ఆ పంట సాగుకు, దిగుబడు పెంపుదకు అవసరమైన చర్యను సంపూర్ణంగా తీసుకోవాని ఆమె సూచించారు. నిస్సందేహంగా ఇది మంచి నిర్ణయం. అసత్వానికి తావివ్వకుండా అముపరచవసిన నిర్ణయమిది.

మన దేశ శీతోష్ణ స్థితులో అపారమైన వైవిధ్యమున్నది. హిమాయాు, ఇతర పర్వత ప్రాంతాలో వేసవిలో చ్లని వాతావరణం వుంటుంది. కేరళ, తమిళనాడులో శీతాకాంలో వెచ్చని వాతావరణం వుంటుంది. ఈ వాతావరణ వెసుబాటుతో మనం గులాబీ పువ్వు లాంటి శీతాకా ఉద్యాన పంటను సంవత్సరం పొడుగూనా ఏదో ఒక ప్రాంతంలో సాగుచేసి, ఎలాంటి విరామం లేకుండా ప్రపంచ మార్కెట్‌కు సరఫరా చేయవచ్చు. నెదర్లాండ్స్‌ లాంటి ఒక చిన్న దేశం తులిప్‌ పుష్పాను ప్రపంచమంతటికీ సరఫరా చేస్తూ ఏడాదికి రూ.2500కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇది మన మొత్తం వ్యవసాయ దిగుబడు మివలో (రూ.30,000 కోట్లు) 8 శాతం. నెదర్లాండ్స్‌లో వ్యవసాయ యోగ్యమైన భూమి వైశ్యాం పది క్ష హెక్టార్లు మాత్రమే. ఇది మన మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో 0.6 శాతం మాత్రమే. అయితే ఒక హెక్టారు భూమిలో మనం సాధించే దిగుబడి కంటే నెదర్లాండ్స్‌ రైతు సాధించే ఉత్పత్తి 12 రెట్లు అధికంగా ఉంటుంది. పైగా ఆ యూరోపియన్‌ దేశ వాతావరణంలో వైవిధ్యమేమీ లేదన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెదర్లాండ్స్‌ వలే టునీసియా కూడా ఆలివ్‌  ఎగుమతుతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ద్రాక్షా సవం (గ్రేప్‌ వైన్‌) ఎగుమతితో ఫ్రాన్స్‌ పొందుతున్న బ్ధి గురించి మరింక చెప్పనవసరం లేదు. ఆ దేశా వలే మనమూ హెక్టారుకు సగటు దిగుబడు స్థాయిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. జిల్లా వారీగా నిర్దిష్ట పంట సాగును అభివృద్ధి పరచుకోవడానికి విస్త ృత, ప్రగాఢ పరిశోధన చేయవసివున్నది. ఇటువంటి బ ృహత్‌ కర్తవ్య నిర్వహణకు మన విశ్వవిద్యాయాు, వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) ప్రయోగశాలు చాలా వెనుకబడి వున్నాయి. ఒక రైతు అనుభవమే ఇందుకొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక సుప్రసిద్ధ విశ్వవిద్యాయంలోని ఉద్యానవన శాస్త్ర విభాగం ఆచార్యుడు ఒకరు కినో పండ్లను సాగుచేయమని ఒక రైతుకు సహా ఇచ్చాడు. ఆ రైతు ఒక ఎకరంలో కినో మొక్కను నాటాడు. అవి పెరిగి, ఐదు సంవత్సరాకు కాపుకు వచ్చాయి. తీరా చాలా చిన్న పరిమాణంలో ఉన్న పండ్లను మాత్రమే అవి ఇచ్చాయి. కినో సాగుకు తనను ప్రేరేపించిన హార్టిక్చర్‌ ప్రొఫెసర్‌ మహాశయుడి వద్దకు వెళ్ళి ఆ రైతు మొరపెట్టుకున్నాడు. ‘అవునయ్యా, నా చెట్లు కూడా చిన్న పండ్లనే కాచాయని’ ఆ ఆచార్యుడు అంగీకరించాడు. ఆయన అంగీకరించడం అలావుంచితే, రైతుకు జరిగిన నష్టం ఎలా తీరుతుంది? ఈ వాస్తవం దృష్ట్యా రైతుకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ప్రతి జిల్లాకు లేదా కొన్ని జిల్లాకు కలిపి ఒక ఐఐటి లేదా ఐఐఎమ్‌ స్థాయి వ్యవసాయ పరిశోధనా సంస్థను నెకొల్పాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇది జరిగితీరాలి. దిగుబడు నాణ్యతకు కాకుండా దిగుబడు పరిమాణానికి మాత్రమే ప్రాధాన్యమివ్వడం వ్ల రైతు ఆదాయాన్ని 2023 సంవత్పరం నాటికి రెట్టింపు చేయడం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరదు. తొుత జిల్లావారీగా నిర్దిష్ట పంటను గుర్తించి, ఆ పంట సాగును ప్రోత్సహించాలి. గోదారు, శీత గిడ్డంగు మొదలైన సదుపాయాను అభివృద్ధిపరచాలి. బడ్జెట్‌ లో సూచించిన విధంగా కేవం దిగుబడు పరిమాణాన్ని పెంచినంత మాత్రాన రైతుకు మేు జరగదు.