అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

డీమార్ట్‌ సెక్యూరిటీ గార్డు కొట్టడంతో చనిపోయాడని ఆరోపణ

హైదరాబాద్‌ : వనస్థలిపురం డీమార్ట్‌ వద్ద నిన్న రాత్రి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని శ్రీచైతన్య కళాశాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి సతీష్‌గా గుర్తించారు. డీమార్ట్‌ సెక్యూరిటీ గార్డు కొట్టడంతోనే సతీష్‌ చనిపోయాడని తల్లిదండ్రు ఆరోపిస్తున్నారు. రాత్రి షాపింగ్‌కు వెళ్లిన సతీష్‌కు, సెక్యూరిటీకి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. డిమార్ట్‌ సిబ్బంది దాడిలోనే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రు పోలీసుకు ఫిర్యాదు చేశారు. శ్రీచైతన్య కళాశా యాజమాన్యంపై కూడా ఫిర్యాదు అందించారు. సతీష్‌ను నిర్లక్ష్యంగా బయటకు పంపించారని తల్లిదండ్రు ఆరోపిస్తున్నారు.
డీమార్ట్‌ వద్ద ధర్నా
ఈ ఘటన నేపథ్యంలో పెద్దసంఖ్యలో ంబాడీ ఐక్యవేదిక కార్యకర్తు, గిరిజన శక్తి సంస్థ ప్రతినిధు డీమార్ట్‌ వద్దకు చేరుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాని డిమాండ్‌ చేశారు. డీమార్ట్‌, శ్రీచైతన్య యాజమాన్యాపై చర్యు తీసుకోవాని నినాదాు చేశారు. ఈ ధర్నాతో పోలీసు అక్కడ భారీగా మోహరించారు.
తప్పు చేశారని తేలితే ఉపేక్షించం : ఎల్బీనగర్‌ డీసీపీ
సతీష్‌ మరణం దురద ృష్టకరమని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఈ ఘటనపై సతీష్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. డీమార్ట్‌ సెక్యూరిటీ గార్డ్‌ ఘర్షణకు దిగి దాడి చేయడం వల్లే తమ కుమారుడు మ ృతి చెందాడని సతీష్‌ తండ్రి ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే చర్యు తీసుకుంటామని చెప్పారు. డీమార్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాను, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ను కలెక్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించేది లేదని డీసీపీ పేర్కొన్నారు.

డీమార్ట్‌ సిబ్బంది దాడి వల్లే మృతి
డీమార్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం వల్లే తమ కుమారుడు మ ృతి చెందాడని సతీష్‌ తల్లిదండ్రు, బంధువు ఆరోపించారు. 25 క్ష ఎక్స్‌ గ్రేషియా చెల్లించాంటూ సతీష్‌ బంధువు డీమార్ట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే సతీష్‌ మ ృతి చెందారని, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాని డిమాండ్‌ చేశారు. ఔటింగ్‌ పంపించే సమయంతో కాలేజీ యాజమాన్యం తమ అనుమతి తీసుకోలేదని ఆరోపించారు.