ప్రత్యూష ఎత్తుకు ప్రత్యర్థు చిత్తు
ఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందును ధైర్యంగా ఎదుర్కొంది. తల్లిదండ్రు ప్రోత్సాహంతో ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అందుకుని.. ఆ హోదా అందుకున్న మూడో తొగమ్మాయిగా గుర్తింపు పొందింది. ఆమే విశాఖపట్టణానికి చెందిన బొడ్డ ప్రత్యూష…ప్రత్యూషది విశాఖ జిల్లా పాయకరావుపేట మండంలోని మంగవరం. తండ్రి ప్రసాద్ ఉపాధ్యాయుడు. ఆయన కొయ్యూరులో ఉద్యోగం చేసే సమయంలో కాక్షేపం కోసం ప్రత్యూషకు ఆరేళ్లు ఉన్నప్పుడు చెస్ నేర్పించారు. అప్పటి నుంచి ఆయనకు తెలిసిన చదరంగం ఆటగాళ్లతో ప్రత్యూషను పోటీకి దింపేవారు. తక్కువ సమయంలోనే ఆమె ఆటపై పట్టు సాధించడాన్ని గుర్తించి ప్రోత్సహించారు. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 24, జాతీయస్థాయిలో 8 పతకాు కైవసం చేసుకుంది. ‘‘రెండువే రెండులో అనుకొంటా… మా నాన్న విశాఖ జిల్లా కొయ్యూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నాకప్పుడు ఆరేళ్లు. ఇప్పటిలా స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని రోజు. బడి నుంచి వచ్చాక నాకు, మా అక్కకు ఏమీ తోచేది కాదు. దీంతో ఒకరోజు మా నాన్న… ఎప్పుడో అటకపై దాచిన చదరంగం బోర్డును బయటకు తీశారు. దానికున్న బూజు దులిపి ఆడుకోమని మాకు ఇచ్చారు. ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా మాతో ఆడుతుండేవారు. చిన్న చిన్న ఎత్తు, పైఎత్తు ఆయన వద్దే నేర్చుకున్నాను. అలా నాకు తెలియకుండానే చెస్‌పై విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. రెండేళ్లు గడిచేసరికి ప్రతి ఆటలో నాన్నను ఓడిరచడం మొదుపెట్టాను. తరువాత చుట్టుపక్క ప్రాంతాల్లో చదరంగం ఆడేవారందరితో పోటీపడి గెవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకసారి సంక్రాంతి సెవుకు నర్సీపట్నంలో ఉంటున్న మా తాతయ్య ఇంటికి బస్సులో బయుదేరాం. మార్గమధ్యంలో జోగుంపేట గ్రామం వద్ద రహదారి పక్కన కట్టిన ‘జిల్లా స్థాయి చదరంగం పోటీు’ బ్యానర్ నన్ను ఆకర్షించింది. వెంటనే నాన్నకు చెప్పి అక్కడే బస్సు దిగిపోయాం. పోటీల్లో పాల్గొన్నా. జిల్లా నుమూల నుంచి సీనియర్ క్రీడాకాయి ఎంతో మంది వచ్చారు. అయితే వారిందరినీ ఓడిరచి విజేతగా నిలిచాను. అనుకోకుండా అలా తొలిసారి జిల్లా ఛాంపియన్‌ను అయ్యాను. ఒక రకంగా ఆ గొపే నా జీవితాన్ని ముపు తిప్పిందని చెప్పాలి. ‘మంచి శిక్షణ ఇప్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంద’ని స్నేహితు నా గురించి నాన్నకు చెప్పారు. నాన్న కూడా అందుకు ఓకే అన్నారు. ఒక పక్కన శిక్షణ తీసుకొంటూనే ఎక్కడ పోటీుంటే అక్కడకు వెళ్లే దాన్ని. అలా జిల్లాలో జరిగిన అండర్-7 జాతీయ బాలిక చదరంగం పోటీల్లో పాల్గొన్నాను. అందులో నెగ్గి జాతీయ ఛాంపియన్‌గా నిలిచాను. ఆ పోటీకు వచ్చిన తాడేపల్లిగూడెంలో ఉండే చదరంగ నిపుణుడు అమర్నాథ్తో నాకు శిక్షణ ఇప్పించాని నాన్న భావించారు. దీంతో ఆయన్ను నర్సీపట్నం తీసుకువచ్చి, తాతయ్య వాళ్లింట్లో ఉంచి మరీ నాకు శిక్షణ ఇప్పించారు. ఇది నా ఆటను మరో ఎత్తుకు తీసుకువెళ్లింది. ఆ ఉత్సాహంతోనే సింగపూర్‌లో జరిగిన అండర్-7 ఆసియా చదరంగం పోటీల్లో స్వర్ణ పతకం సాధించాను. అలా అంతర్జాతీయ చదరంగం క్రీడాకారిణిగా నా ప్రస్థానం ప్రారంభమైంది. కామన్వెల్త్, వరల్డ్ చెస్ స్కూల్ తదితర 12 అంతర్జాతీయ చదరంగం టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వెళ్లిన చోటల్లా దాదాపు విజయం నాదే. అయితే నాకు మరింత మెరుగైన శిక్షణ అవసరమని అమ్మానాన్ను భావించారు. దాంతో మహిళా గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కోచ్ పి.రామరాజు వద్ద నన్ను చేర్చారు. ప్రస్తుతం ఆయనే నా కోచ్. ఇప్పటి వరకు 45 దేశాల్లో పర్యటించి 24 అంతర్జాతీయ, 8 జాతీయ పతకాు సాధించానంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్లిద్దరి తరువాత నేనే… ప్రపంచ వ్యాప్తంగా 126 మంది ‘ఉమన్ గ్రాండ్‌మాస్టర్’ హోదా దక్కిచుకున్నారు. వారిలో భారత్ నుంచి ఎనిమిది మందే ఉన్నారు. ఇక తొగు రాష్ట్రాల్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆ తరువాత ఆ హోదా దక్కించుకుంది నేనే! చెస్‌ను సీరియస్‌గా తీసుకున్నాక నేను కన్న క ‘గ్రాండ్‌మాస్టర్’! ఒక్కొక్కటిగా సాధిస్తూ… ‘గ్రాండ్‌మాస్టర్’ కావాంటే మూడు ‘నార్మ్’ు సాధించాలి. 2015లో ఉమెన్స్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్, 2016లో ఉమెన్స్ గ్రాండ్ మాస్టర్ పోటీల్లో గొపొంది రెండు నార్మ్‌ు సాధించాను. మూడో నార్మ్ కోసం పదిహేనుసార్లు ప్రయత్నించి విఫమయ్యాను. కానీ కుంగిపోలేదు. బ్రిటన్‌లో జరిగిన జిబ్ట్రార్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆత్మవిశ్వాసంతో పోటీపడ్డాను. అత్యధిక పాయింట్లు గెలిచి మూడో నార్మ్ సొంతం చేసుకున్నాను. మహిళా గ్రాండ్‌మాస్టర్‌ను అయ్యాను. క్ష్యం… ఓపెన్ గ్రాండ్‌మాస్టర్… నా శ్వాస… ధ్యాస… చదరంగమే! నా శిక్షణ. ప్రస్తుతం నాకు ఫైడ్ (ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెమిస్ ఇన్ చెస్) ఇచ్చిన రేటింగ్ 232. ఓపెన్ కేటగిరీలో గ్రాండ్‌మాస్టర్ కావాంటే రేటింగ్ కనీసం 2400కు పైగా ఉండాలి. ప్రపంచ ఛాంపియన్ కావాన్న పట్టుదతో శ్రమిస్తున్నాను. మిగతా క్రీడ మాదిరిగా చెస్ గ్లామరస్ స్పోర్ట్ కాకపోవడంతో స్పాన్సర్లు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వపరంగా తగిన సహకారం అందిస్తే నాలాంటి ఎందరో అమ్మాయిు చదరంగంలో రాణిస్తారు.’’ మూడేళ్లుగా శ్రమిస్తూ….. మహిళా గ్రాండ్ మాస్టర్ కావానే క్ష్యానికి మూడేళ్ల క్రితమే బాటు వేసుకుంది ప్రత్యూష. టైటిల్ సొంతం కావాంటే మూడు నార్మ్‌ు సాధించాలి. దానికి అనుగుణంగానే 2016లో రెండు నార్మ్‌ు వచ్చాయి. మూడో నార్మ్ కోసం 15సార్లు ప్రయత్నించి విఫమైంది. అయినా ఓటమికి కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని చెదిరిపోనివ్వకుండా శ్రమించింది. తాజాగా ఇంగ్లండ్‌లో జరిగిన జిబ్ట్రార్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 9/5 పాయింట్లు సాధించి మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ హోదా దేశంలో ఎనిమిదిమందికే ఉంది. వారిలో తొగు రాష్ట్రానుంచి ఇద్దరమ్మాయిు ఉండగా, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో తొగమ్మాయిగా రికార్డు సాధించింది ప్రత్యూష. ‘నేను ఆటలో ఎదుగుతున్న కొద్దీ కుటుంబ ఖర్చు ఎక్కువయ్యాయి. దీంతో ఇంటరు వరకే చదివిన అమ్మ సత్యాదేవి.. పీజీ, బీఈడీ పూర్తి చేసి ఓ కళాశాలో అధ్యాపకురాలిగా చేరింది. నాన్న … ఎన్ని ఇబ్బందు ఎదురైనా ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసేవారు. అప్పు చేసి మరీ పంపించిన సందర్భాు కోక్లొు. అప్పులెందుకు చేస్తున్నారు? చక్కగా చదివించక ఆడప్లికు ఆటలెందుకు.. అంటూ చాలామంది అమ్మానాన్నను ప్రశ్నించేవారు. వారు ఇవేవీ పట్టించుకోకుండా నా ఎదుగుదకు తోడ్పడ్డారు’ అని చెబుతోంది ప్రత్యూష. |