16న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఏర్పాట్లు

న్యూఢల్లీి: దేశ రాజధానిలో హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ముచ్చటగా మూడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టనున్నారు. చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఫిబ్రవరి 16(ఆదివారం)న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మరోవైపు కేజ్రీవాల్‌ బుధవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కలిశారు. దాదాపు 15 నిమిషా పాటు వీరి భేటీ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారంపై వీరు చర్చించినట్లు తొస్తోంది.  ఇదిలా ఉండగా.. కొత్తగా ఎన్నికైన ఆప్‌ ఎమ్మెల్యేతో కేజ్రీవాల్‌ నేడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌ను ఎమ్మెల్యేు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీ.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి కోరనుంది. నిబంధన ప్రకారం ప్రమాణస్వీకారానికి ముందు కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయ దుందుభి మోగించింది. మొత్తం 70 స్థానాకు గానూ 62 చోట్ల జయకేతనం ఎగురవేసింది. దీంతో వరుసగా మూడోసారి దేశ రాజధానిలో సామాన్యుడి ప్రభుత్వం కొువుదీరనుంది.