కేజ్రీ..క్రేజీ
వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన ఆప్ సారధి
కమలాన్ని ఊడ్చేసిన చీపురుపార్టీ
- 63 స్థానాలో సత్తాచాటిన ఆమ్ ఆద్మీ పార్టీ
-
7 స్థానాతో సరిపెట్టుకున్న బీజేపీ
కనీసం ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ -
సంక్షేమ పథకాకే సంతృప్తిచెందిన సామాన్యుడు
- బీజేపీని గెలిపించని హిందూ ఓటు బ్యాంకు
- కమం కొంపముంచిన సీఏఏ, ఎన్నార్సీ
న్యూఢల్లీి: దేశమంతటా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఢల్లీి ఎన్నిక ఫలితాు వచ్చేశాయి.. గొపెవరిదో తేలిపోయింది.. కొన్ని సీట్లు అటూ ఇటుగా ఆప్ పార్టీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 13,508 ఓట్ల మెజార్టీతో గొపొందారు. బీజేపీకి సంబంధించి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాషాయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, భారీ సంఖ్యలో కేంద్ర మంత్రు, ఎంపీు, బీజేపీ పాలిత రాష్ట్రా సీఎరు ఢల్లీి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు. అయినప్పటికీ కేజ్రీవాల్‌నే విజయం వరించింది. అందుకే ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశమయింది. ఇంత మంది నేతంతా ప్రచారం చేసినా కేజ్రీవాల్‌నే విజయం వరించడానికి కారణమేంటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ అనుసరించిన వ్యూహం ఫలించిందని రాజకీయ విశ్లేషకు తేల్చిచెబుతున్నారు. జాతీయాంశాపై వ్యూహాత్మక మౌనం, స్థానిక అంశాపై ప్రజల్లో చైతన్యం తేవడం, అభివ ృద్ధి నినాదాన్ని అందిపుచ్చుకోవడమే కేజ్రీవాల్ గొపునకు అసు సిసు కారణాని వారు చెబుతున్నారు.
సీఏఏ, ఎన్నార్సీ… ఢీల్లీ ఎన్నిక ముందు దేశ వ్యాప్తంగా సంచనం సృష్టించిన పేర్లివి. వీటికి వ్యతిరేకంగా యువత ఢల్లీి వీధుల్లో నిరసనకు దిగింది. సీఏఏ వ్యతిరేక నినాదాతో దేశరాజధాని హోరెత్తింది. ఇక ఢల్లీి జనాభాను పరిశీలిస్తే.. హిందువు 81.86 శాతంగా ఉన్నారు. ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాు బీజేపీకి లాభిస్తాయని అంతా భావించారు. బీజేపీ వ్యూహంలో ఆప్ చిక్కుకోనుందా అనే సందేహం వ్యక్తమైంది. అయితే కేజ్రీవాల్ ఇదంతా గమినిస్తూనే ఉన్నారు. ఆయనకు ఇది చావో రేవో తేలిపోయే యుద్ధం. బీజేపీతో పోరాటం చేయడంతో ఆయనకు చాలా అనుభవమే ఉంది. దీంతో ఆయన ప్రజా సంక్షేమ పథకాలే క్ష్యంగా ముందుకెళ్లారు. అప్పటికే ఆయన పేదు మధ్యతరగతి వారికి మేు చేసే దిశగా అనేక పథకాు ప్రవేశపెట్టారు. వీటిపైనే ద ృష్టి పెడుతూ ప్రచారంలో పాల్గొన్నారు.
వివాదాస్పద అంశా జోలికి వెళ్లకుండా ఎన్నికల్లో ఆయా అంశా పట్ల వ్యూహాత్మక మౌనం పాటించారు. బీజేపీ నేతు వాటి గురించి ప్రచారంలో ఎంత ప్రముఖంగా ప్రస్తావించినా కేజ్రీవాల్ మాత్రం స్థానిక అంశానే ప్రజల్లోకి తీసుకెళ్లారు.విద్య, కరెంట్ వంటి విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాు ప్రజల్లో దూసుకుపోయాయి. ఢల్లీి పీఠంపై పూర్తి అధికారాు లేకపోయినా కేజ్రీవాల్ చేసిన కృషి వారి మనసుల్లో నాటుకుపోయింది. ఫలితం.. కేజ్రీవాల్ విజయం ఖరారైపోయింది. ఢీల్లి ప్రభుత్వ పీఠాన్నీ ఆప్ మరోసారి కైవసం చేసుకుంది.
ఓట్ల కోసం వచ్చేవాళ్లను కాదు.. నిత్యం తమ కష్టసుఖాు తొసుకొనే నాయకుడే కావాని కోరుకుంటున్నారు ప్రజు. తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించేందుకు చొరవచూపే నాయకుకే ఎన్నికల్లో జై కొడుతున్నారు. కుం, డబ్బు ప్రభావం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నేపథ్యంలో దిల్లీ ప్రజు ఆమ్ ఆద్మీ పార్టీకి మూడోసారి వరుసగా అధికార పగ్గాు అప్పగించడం ఓ గొప్పరాజకీయ వైవిధ్యానికి సంకేతం. ఈ రోజుల్లో ఎన్నికల్లో గెవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. డబ్బుతో పాటు కుం, మతం తదితర అంశాలే పనిచేయడంతో సామాన్యుడు మాకొద్దు బాబోయ్ ఈ రాజకీయాంటూ వైపు కూడా చూడటంలేదు. కానీ, సామాజిక సమీకరణాను సమత్యుం చేసుకుంటూ ప్రజనాడిని తొసుకొని పదునైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తే ఆ శక్తున్నింటినీ పటాపంచు చేయవచ్చని కేజ్రీవాల్ దిల్లీలో మరోసారి నిరూపించారు. నిరాడంబరతతో పాటు నిత్యం ప్రజతో మమేకమయ్యే నేర్పు, వారి సమస్యపై పోరాడి పరిష్కరించే ఓర్పు కలిగిన నేతను ప్రజు అక్కున చేర్చుకుంటారనేందుకు నిదర్శనంగా నిలిచారు. అలాంటి నేతతో కలిసి నడుస్తారు… ఎన్నికల్లో ఆదరిస్తారు.. ఆశీర్వదిస్తారు..
ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్లుగానే దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. తొుత ఎగ్జిట్‌పోల్స్‌పై విరుచుకుపడిన ఆ పార్టీ ఇప్పుడు ఫలితాను చూసి మౌనంగా ఉండిపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వికాస్‌పూరి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ శర్మ తన ఓటమిని అంగీకరించడం విశేషం. 2015 ఎన్నిక ఫలితాలే ఇప్పుడు కూడా పునరావ ృతమవుతున్నాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
అయితే గత ఎన్నిక కంటే ఈ ఎన్నికల్లో భాజాపా పుంజుకోగా కాంగ్రెస్ మాత్రం అదే స్థితిలో కొనసాగుతోంది. 15 సంవత్సరాు ఏకధాటిగా రాష్ట్రాన్ని పాలించిన షీలాదీక్షిత్ వంటి నాయకు ఇప్పుడు స్థానికంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. 2013లో దాదాపు 24శాతం ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ 2015 వచ్చేసరికి దాదాపు 10శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఫలితాను విశ్లేషిస్తే మాత్రం ఈ సారి మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే స్పందించిన కాంగ్రెస్.. ఈసారి కూడా ఆమ్‌ఆద్మీ పార్టీదే విజయమని అంచనా వేస్తున్నట్లు అధికార ప్రతినిధు పేర్కొన్నారు. తాము కావానే ఎన్నికల్లో భారీగా ప్రచారం చేయలేదని..ఒకవేళ అలా చేస్తే ఓట్లు చీలిపోయి పరిస్థితి బీజేపీ అనుకూంగా మారే అవకాశం ఉందని తెపడం గమనార్హం.
హస్తిన వాసు మళ్లీ సామాన్యుడికే పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. కాగా.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రేమికు దినోత్సవం నాడే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాు కన్పిస్తున్నాయి.
ఫిబ్రవరి 14 కేజ్రీకి స్పెషల్..
కేజ్రీవాల్‌కు ఫిబ్రవరి 14 ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. 2012 నవంబరులో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత ఏడాది 2013లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో భాజపా 31 స్థానాల్లో గెలిచినప్పటికీ 28 స్థానాల్లో విజయం సాధించిన ఆప్.. కాంగ్రెస్(8)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 2013 డిసెంబరులో కేజ్రీవాల్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌తో విభేదాు రావడంతో 49 రోజు తర్వాత 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దాదాపు ఏడాది తర్వాత 2015లో దిల్లీలో ఎన్నికు జరగ్గా.. ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అలా కేజ్రీ రెండోసారి సీఎం పగ్గాు చేపట్టారు. 2015 ఫిబ్రవరి 14న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని నడుమ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ‘ద్వేషానికి ద్వేషం సమాధానం కాదు. ద్వేషాన్ని ప్రేమతోనే జయించాలి’ అంటూ ప్రేమికు రోజున ప్రమాణస్వీకారం చేయడానికి గ కారణాన్ని కేజ్రీ ఒకానొక సందర్భంలో చెప్పారు. తాజా ఎన్నికల్లోనూ ఆప్ ఘన విజయం సాధించింది. ప్రతిపక్షా విమర్శు, ఆరోపణకు తన గొపుతో సమాధానం చెప్పింది. అలా ముచ్చటగా మూడోసారి సీఎం పగ్గాు చేపట్టేందుకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. కాగా.. ఈసారి కూడా ఫిబ్రవరి 14నే ప్రమాణం చేసే అవకాశాున్నట్లు విశ్వసనీయ వర్గాు చెబుతున్నాయి.
ద్ద కొడుకులా పనిచేశాను..
ఎన్నిక ప్రచారంలో ఆయన ప్రజ సంక్షేమమే క్ష్యంగా కుటుంబానికి పెద్ద కొడుకులా పనిచేశానని చెప్పేవారు. కుటుంబ బాధ్యతను భుజాపై ఎత్తుకోవడంతో పాటు దిల్లీలో అందరి బాగోగు చూసుకున్నానని చెప్పడాన్ని ప్రజు స్వాగతించారు. తాగునీరు, ఉచిత విద్యత్తుతో పాటు విద్య, ఆరోగ్యవ్యవస్థను తమ ప్రభుత్వహయాములో ఎలా మెరుగుపరిచిందో సవివరంగా ప్రజకు వ్లెడిరచారు.
మహిళా భద్రతకు ప్రాధాన్యత..
దిల్లీలో నిర్భయ ఘటన అనంతరం మహిళకు మరింత భద్రత కల్పించాని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు మహిళకు నగర బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. దీంతో మహిళు పెద్ద ఎత్తున ఆప్‌కు మద్ధతు పలికారు.