‘లెక్క’ చేయని తెలుగు ఎంపీలు
ఎన్నికలలో ఖర్చులు చూపించని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు
కేంద్ర ఎన్నికల సంఘం షాక్
-దేశవ్యాప్తంగా 80 మంది ఎంపీలకు ఝలక్
-17 మంది తెలుగు ఎంపీలపై ఈసీ సీరియస్
-13 మంది ఏపీ వైసీపీ ఎంపీలు
-ఇద్దరు ఏపీ టీడీపీ ఎంపీలు
-ఇద్దరు తెలంగాణ ఎంపీలు
-10 నెలలయినా ఖర్చులు తెలపని ఎంపీలు
-గెలిచిన 45 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి
-అలా చేయని ఎంపీలపై చర్యలు తీసుకుంటామంటున్న ఈసీ
”వైసీపీకి చెందిన రఘురామకృష్ణంరాజు, మాధవి, ఎంవీవీ సత్యన్నారాయణ, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, వెంకట సత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయ, శ్రీనివాస్‌రెడ్డిలు ఎన్నికల సంఘానికి ఖర్చులు ఇవ్వలేదు. ఇక టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్‌నాయుడులు కూడా ఈ లిస్టులో ఉన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి తమ ఖర్చుల వివరాలను తెలపలేదు. నిజామాబాద్ నుండి బీజేపీ తరపున విజయం సాధించిన ధర్మపురి అరవింద్, మెదక్ నుండి విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఎన్నికలలో చేసిన ఖర్చులను ఎన్నికల సంఘానికి చూపలేదని నేషనల్ ఎలక్షన్ వాచ్ తేల్చి చెప్పింది.”
హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరు ఎలక్షన్‌లో గెలిచిన 90రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సమర్పించకపోవడంతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ఖర్చు ఫైల్ చేయకుంటే.. తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అధిక ఖర్చుల విషయ బయటపడుతుందనే భయం ఎంపీల్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన అభ్యర్ధులు 45 రోజుల్లో అఫిడవిట్ ఇవ్వాలని.. ఎలక్షన్ వాచ్ కన్వినర్ వీవీ రావు తెలిపారు.
కానీ దేశవ్యాప్తంగా 80 మంది ఎంపీలు ఇప్పటికీ ఆ వివరాలను సమర్పించకపోవడంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల ఖర్చులను ఫైల్ చేయాలని అలా చేయని పక్షంలో చేయని ఎంపీలపై చర్యలు తీసుకునే అధికారం కూడా తమకు ఉందంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఎంపీలు అఫిడవిట్ దాఖలు చేయాలని అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో ఎన్నిక రద్దు చేసే అధికారం కూడా తమకు ఉందంటూ ఈసీ పేర్కొంది.
ఎంపీలు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తే ఎక్కువ మొత్తంలో ఎన్నికల కొరకు ఖర్చు చేశామనే విషయం బయటపడుతుందని భయపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వీవీరావు 45 రోజులలో ఎంపీలు అఫిడవిట్ ఇవ్వాలని కోరారు. 45 రోజులలో అఫిడవిట్ ఇవ్వకపోతే మాత్రం ఎన్నికల కమిషన్ ఆ ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వైసీపీకి చెందిన రఘురామకృష్ణంరాజు, మాధవి, ఎంవీవీ సత్యన్నారాయణ, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, వెంకట సత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయ, శ్రీనివాస్‌రెడ్డిలు ఎన్నికల సంఘానికి ఖర్చులు ఇవ్వలేదు. ఇక టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్‌నాయుడులు కూడా ఈ లిస్టులో ఉన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి తమ ఖర్చుల వివరాలను తెలపలేదు. నిజామాబాద్ నుండి బీజేపీ తరపున విజయం సాధించిన ధర్మపురి అరవింద్, మెదక్ నుండి విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఎన్నికలలో చేసిన ఖర్చులను ఎన్నికల సంఘానికి చూపలేదని నేషనల్ ఎలక్షన్ వాచ్ తేల్చి చెప్పింది.
30 రోజుల్లో ఇవ్వాల్సి ఉండగా..
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి లెక్కలు చూపాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెలిచినా, ఓడిపోయినా, డిపాజిట్ కోల్పోయినా లెక్కలు ఇవ్వాలిందేనని పేర్కొంటున్నారు. కొంతమంది క్యాండిడేట్లకు ఈ విషయం తెలియదని, అయినప్పటికీ జిల్లాల్లో డీఈవోలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి, వివరించామంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 30 రోజుల్లో అభ్యర్థులు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. లోక్?సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అంటే జూన్ 22 వరకు క్యాండిడేట్లు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్?కు అందజేయాలి. ఇప్పటివరకు 76 మంది అభ్యర్థులు ఆ వివరాలు ఇవ్వలేదు. వీరికి ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల అధికారులు నోటీసులు కూడా పంపారు. మరోసారి నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు.
లెక్కలియ్యకుంటే ఏం చేస్తరు?
లోక్?సభ ఎన్నికల్లో క్యాండిడేట్లు రూ. 70 లక్షల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖర్చుపై ఈసీ షాడో టీంలను కూడా ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఎంత ఖర్చు చేశామో వివరాలు ఇవ్వాలి. గెలిచిన అభ్యర్థులు ఇవ్వకపోతే వారిని ఎంపీ స్థానానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఓడిన అభ్యర్థుల విషయంలో అప్పటికప్పుడు చర్యలు ఉండవు. అయితే.. మళ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈసీ నోటీసులు పంపి, వివరాలు కోరుతుంది. అప్పటికీ ఇవ్వకపోతే.. పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యంయ రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్ల వరకు ఉందని సెంటర్ ఫర్ మీడియాస్టడీస్ (%జవీూ%) వెల్లడించింది. 2014 లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఇది రెండింతలు అని చెప్పింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేశారని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోను భారీగా నగదు ప్రవాహం కనిపించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా రూ.12వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు నేరుగా ఓటర్లకు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలుసా?: త్వరలో ప్రజల ముందుకు జగన్, ఏం కోరుకుంటున్నారు రూ.40 కోట్ల ఖర్చు పెట్టిన తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాలు తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కలిపి రూ.5,400 కోట్లు (అసెంబ్లీ ఎన్నికలకు రూ.5,000, 16 లోకసభ స్థానాలకు రూ.400 కోట్లు) ఖర్చు అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే రూ.7వేల కోట్ల నుంచి రూ.9వేల కోట్లకు పైగా ఆయా పార్టీలు, అభ్యర్థులు ఖర్చు చేసినట్లు %జవీూ% వివరించింది. 2019 ఎన్నికల్లో ఖర్చుపై %జవీూ% నివేదికను విడుదల చేసింది. దేశంలో 75 నుంచి 85 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఖర్చు చేశారని, తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు పేర్కొంది. తెలంగాణలోని నల్గొండ, చేవెళ్ల, మల్కాజిగిరి, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, అనంతపురం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఏపీలో ఓటుకు రూ.7వేలు ఏపీలో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లకు భారీగా నగదును పంపిణీ చేశాయని, ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చిందని %జవీూ% నివేదిక వెల్లడించింది. ఓ నియోజకవర్గంలో ఓటుకు రూ.2వేలు ఇస్తే మరో నియోజకవర్గంలో రూ.7వేలు ఇచ్చినట్లు పేర్కొంది. క ష్ణా, గుంటూరు జిల్లాల్లో సగానికి పైగా ఓటర్లకు సగటున రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎక్కువ శాతం మంది కోటీశ్వరులు పోటీ చేశారని, దీంతో ఎక్కువ శాతం నగదు ప్రవాహం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు పెరిగిన కొద్దీ… ప్రాథమిక సేవలపై ఖర్చు ఎన్నికల ఖర్చు పెరుగుతున్న కొద్దీ భారత్‌లో కరప్షన్ పెరుగుతోందని %జవీూ% ప్రతినిధులు అన్నారు. సర్వే ప్రకారం సాధారణ పౌరులు 18 ప్రాథమిక సేవల పైన ఏడాదికి రూ.30,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని, కానీ ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని వారు వెల్లడించారు. ఎన్నికల ఖర్చు ఎలా పెరుగుతోందో అవినీతి అలా పెరుగుతోందన్నారు.