వినియోగదారుల ఫోరం సమస్యల తీరం
అరకొర నిధులు, స్టేషనరీ కొరతతో ఇబ్బందులు పడుతున్న
వినియోగదారుల ఫోరం సిబ్బంది
-అటు సిబ్బంది, ఇటు ఫిర్యాదుదారులుకు కనీస అవసరాలు కట్
-స్టేషనరీ ఖర్చులకు 3 నెలలకోసారి రూ.10,000 కేటాయింపు
-రోజురోజుకూ పెరుగుతున్న వినియోగదారుల ఫిర్యాదులు
-1986లో వినియోగదారుల రక్షణ చట్టం రూపకల్పన
-ఇప్పటికీ ఫోరంపై అవగాహన లేక మోసపోతున్న వినియోగదారులు
-20 శాతం పెరిగిన ఫోరమ్‌ను ఆశ్రయించే వారి సంఖ్య
-సగటున రోజుకు 30 నుంచి 40 ఫిర్యాదులు
-మరమ్మతుకు గురవుతున్న కంప్యూటర్లు, ఇతర ఉపకరణాలు
-రిపేర్లకు సరిపడని నిధులు, ఎక్కడికక్కడే నిలిచిపోతున్న పనులు
———————————————–
హైదరాబాద్:
మోసాలు, కొలతలు, ఇబ్బందులు, సేవలు ఇలా ఏ అంశంలోనైనా వినియోగదారుడికి ఇబ్బంది కలిగితే వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా వారు సమస్య పరిష్కారంతోపాటు నష్టపరిహారం పొందవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్ధేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే దానివల్లకలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువులను తయారుచేసిన సంస్థ భరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తగాదాల పరిష్కారం కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ సంస్థలను ఏర్పాటు చేసి వినియోగదారుల హక్కులను కాపాడుతుంది. అలాంటి వినియోగదారుల ఫోరం నగరంలో సమస్యల వలయంగా మారింది.
హైదరాబాద్ నగరంలో వినియోగదారుల ఫోరంలో సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయి. అటు సిబ్బంది, ఫిర్యాదుదారులు కూడా కాగితాల కొరత, ఇతర సమస్యలతో అవస్థలు పడుతున్నారు. బడ్జెట్‌పరంగా చూస్తే..మూడు నెలలకోసారి కేటాయించే బడ్జెట్ పరిమితంగానే ఉంది. దీనితో పరిమిత సదుపాయాలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినియోగదారులు తమకు సరైన న్యాయం లభిస్తుందని ఎక్కువ సంఖ్యలో నగర వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణ తదనంతర ప్రక్రియలకు అవసరమైన కాగితాల కొరత ప్రధాన సమస్యగా మారంది. మూడు నెలలకోసారి స్టేషనరీ ఖర్చులకు కేటాయించే రూ.10,000 ఏ మాత్రం సరిపోవడం లేదు. మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు సైతం అరకొరగానే ఉండటంతో వాటితోనే సిబ్బంది నెట్టుకురావాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.
పెరుగుతున్న సంఖ్య
వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించే వారి సంఖ్య ఆరు నెలలుగా పెరుగుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఇటీవల ఈ సంఖ్య సుమారు 20 శాతం పెరిగింది. సగటున రోజుకు 30 నుంచి 40 ఫిర్యాదులు నగర వినియోగదారుల ఫోరమ్‌కు అందుతున్నాయి. దీంతో ఫిర్యాదుల స్వీకరణ, డ్రాఫ్టింగ్, తీర్పుల వెల్లడి తదితరాలకు కాగితాలు సరిపోని పరిస్థితి నెలకొంది. ఫోరమ్‌లో ఏర్పాటుచేసిన కంప్యూటర్లు, ఇతర ఉపకరణాలు కూడా మరమ్మతులకు గురవ్వడంతో సేవలు అందించడంలో జాప్యం జరుగుతోంది. ఉన్న బడ్జెట్‌లోనే వీటిన్నింటినీ నిర్వహించడం సిబ్బందికి తలనొప్పిగా మారింది.
కంప్యూటర్లు మొరాయిస్తున్నాయ్..
ఫిర్యాదుల స్వీకరణ, డ్రాఫ్టింగ్ కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్లు అప్పుడప్పుడూ మొరాయిస్తుండటంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఏసీలు, ఇన్వర్టర్, ఇతర విద్యుత్ ఉపకరణాలు తరచూ మర్మమతులకు గురవుతుండటంతో పనులు చేసుకోవడంలో ఇబ్బందుల తలెత్తుతున్నాయి. ఇటీవలే ఇన్వర్టర్ మరమ్మతులకు గురైందని, విద్యుత్ అంతరాయాలతో చేసిన పనినే మళ్లీ మొదటి నుంచి చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
రికార్డుల నిర్వహణ అంతంతమాత్రమే
నగర ఫోరమ్‌లోని సెక్షన్లలో రికార్డుల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. ఒక్కో సెక్షన్‌లో ఒక్కో రికార్డును నిర్వహించాల్సి ఉండగా వీటి కొనుగోలుకు డబ్బులు సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు వెలువడిన తీర్పులను భద్రపరిచేందుకు కూడా సరైన గది లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఫోరమ్ నుంచి సుమారు 30,000 తీర్పులు వెలువడగా వాటిని భద్రపరిచేందుకు ఉన్న గదులను వినియోగిస్తున్నారు. ఒకేచోట వాటిని భద్రపరిచే వెసులుబాటు లేకపోవడం ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా స్టేషనరీ సమస్య ఇబ్బంది పెడుతోందని సిబ్బంది, న్యాయవాదులు చెబుతున్నారు. పెరుగుతున్న ఫిర్యాదుల సంఖ్యను గుర్తించి స్టేషనరీ బడ్జెట్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మోసాలు, కొలతలు, ఇబ్బందులు, సేవలు ఇలా ఏ అంశంలోనైనా వినియోగదారుడికి ఇబ్బంది కలిగితే వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా వారు సమస్య పరిష్కారంతోపాటు నష్టపరిహారం పొందవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్ధేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే దానివల్లకలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువులను తయారుచేసిన సంస్థ భరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తగాదాల పరిష్కారం కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ సంస్థలను ఏర్పాటు చేసి వినియోగదారుల హక్కులను కాపాడుతుంది.
వినియోగదారుల హక్కులు
వినియోగదారులుగా మనకు కొన్ని హక్కు లు ఉన్నాయి. ఆ హక్కులను నెరవేర్చుకోవటం మన బాధ్యత. మన హక్కుల ను కాపాడుకోవాలంటే ముందుగా ఆ హక్కులేమిటో మనకు తెలియాలి. ఆ హక్కులకు భంగం వాటిల్లినపుడు ప్రశ్నించి వాటిని సాధించుకోవాలి.
ప్రాధమిక హక్కులు
మానవ మనుగడకు ముఖ్యావసరాలైన వస్తువులు, సేవలను పొందే హక్కు అంటే ఆహారం, నివాసం, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం పొందే హక్కు ఇది. రక్షణ ఆరోగ్యానికీ, సంపత్తికి హాని కలిగించే వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు సమాచారం. నిజాయితీ లేని తప్పు దారి పట్టించే ప్రకటనలు, లేబుల్స్‌నుంచి రక్షణ పొందేందుకు వాస్తవ సమాచారం పొందే హక్కు సంతప్తికరమైన నాణ్యత, భద్రత ఉన్న వస్తువులు, సేవలను ఎంపిక చేసుకొనే హక్కు. ప్రాతినిధ్యం ప్రభుత్వ విధానాల నిర్ణయాల, అమలులో వినియోగదారుల శ్రేయస్సుకై ప్రాతినిధ్యం వహించే హక్కు. వీటిపై నాణ్యత లేని వస్తువులు, అసంత ప్తి కరమైన సేవల నుంచి నష్టపరిహారం పొందే హక్కు ఉంది. వినియోగదారులు కావలసిన విజ్ఞానం, నేర్పరితనం పొందే హక్కు ఆరోగ్యకరమైన పర్యావరణం. ఆరోగ్యానికి ఏ హాని కలిగించని పర్యావరణంలో నివసించే, పనిచేసే హక్కు. ఈ హక్కులలో ఆరింటిని వినియోగదారల రక్షణ చట్టం 1986లో పొందుపరిచారు.
ఎలా ఫిర్యాదు చేయవచ్చు
వినియోగదారుడిగా సేవలకు ఆటకం కలిగినా, నష్టం వాటిల్లినా సంబంధిత వ్యక్తులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రిజిస్టర్‌కాబడిన వినియోగదారుల సంఘాలు నుంచి కానీ సమాచార కేంద్రాల నుంచికాని వినియోగదారుడు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం మూడు సెట్ల దరఖాస్తులు చేయాలి. ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. రూ.50 లక్షలలోపు నష్టపరిహారం జరిగితే జిల్లా వినియోగదారుల ఫోరంలోను, కోటి రూపాయల లోపు అయితే రాష్ట్ర కమిషన్‌కు, కోటి రూపాయల పైబడి నష్టపరిహారం కోరితే జాతీయ కమిషన్‌కు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.%షబఅరబఎaతీ తీఱస్త్రష్ట్ర్‌ర
ఏయే సేవలు వర్తిస్తాయి
డబ్బులు చెల్లించి రశీదు పొందితే అన్ని సేవలు వినియోగదారుల చట్టంలోకే వస్తాయి. వినియోగదారుడు తూకాల్లో మోసపోయినా, సేవలు సక్రమంగా అందకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకింగ్, ఆసుపత్రి, రైల్వే, విమానయాన సేవలపై ఫిర్యాదుచేసి నష్టపరిహారం కోరవచ్చు. రైతులు విత్తనాలు, పురుగుమందులు వ్యవహారంలో ఫిర్యాదు అందించవచ్చు. వైద్య సేవలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇలా అన్ని విభాగాల నుంచి వ్యాపార సముదాయాల నుంచి వ్యవస్థల నుంచి వినియోగదారుల ఇబ్బందులపై ఫిర్యాదుచేసి నష్టపరిహారం కోవరచ్చు. ఇలా విజయాలు సాధించవచ్చు.