‘మోత’ లేని మోదీ బడ్జెట్‌

భారీ కేటాయింపులు లేని సాదాసీదా ‘నిర్మల’మైన చిట్టా పద్దు

-విద్యారంగానికి రూ.99,300 కోట్లు.
– ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు.
– జౌళిరంగానికి రూ.1,480 కోట్లు.
– ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400కోట్లు
– జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.11,500కోట్లు
– స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు
– పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు.
-నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌కు రూ.8వేల కోట్లు.
-భారత్‌ నెట్‌ పథకానికి రూ.6వేల కోట్లు.
-రవాణా, మౌలిక సదుపాయాల అభివ ద్ధికి రూ.1.7లక్షల కోట్లు.
– బెంగళురు నగరానికి రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం.
– నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు.
-మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు.
– గ్రామీణాభివద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83లక్షల కోట్లు.
-నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు.
– పర్యాటక రంగ అభివద్ధికి రూ.2వేల కోట్లు.
– సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు.
-ఎస్టీల కోసం రూ.53వేల కోట్లు.
-ఎస్సీలు, ఓబీసీలకు రూ.85వేల కోట్లు

కంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. కాకపోతే ఆదాయ పన్ను, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌, ఇతర పన్నుల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగానికి ప్రధానమైన ప్రకటనలు ఏమీ చేయలేదు. గ్రామీణ ప్రాంతాలపైనే దీనిలో దష్టి పెట్టారు. బంగారంపై సుంకాన్ని తగ్గించలేదు. వ్యవసాయ రంగానికి రూ.15లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.

న్యూఢిల్లీ
నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవీ.. 2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్‌ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్‌ ఉంటుందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆమె చెప్పారు. నూతన సాంకేతిక పద్దతులు అమలు చేస్తామని, మోదీ ఆర్థిక విధానాలకు విశ్వసనీయత పెరిగిందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివి…
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే లక్ష్యం, వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలి, వ్యవసాయరంగ అభివద్ధికి 16 సూత్రాల కార్యాచరణ,
కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత, నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలు, సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం, కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్‌ పంపులు, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు, సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌, దేశంలో 160 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం, గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం, స్వయ సహాయక బందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం,
ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్‌ సాయం, పాలు, చేపల రవాణాకు కిసాన్‌ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే, పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్‌ రైలు, కషి ఉడాన్‌ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు, ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరాయి.
2020-21లో అగ్రికల్చర్‌ రీఫైనాన్స్‌ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు, ఇప్పటికి 58లక్షల స్వయం సహాయక బ ందాలు పనిచేస్తున్నాయి, స్వయం సహాయక బందాలను మరింత విస్తరిస్తాం, వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు, వ్యవసాయానికి మాత్రం 1.60 లక్షల కోట్లు, గ్రామీణాభివద్ధికి 1.23 లక్షల కోట్లు, మత్స్యకారులకు సాగర్‌మిత్ర పథకం, పీపీపీ పథకం కింద మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు, ఆయుష్మాన్‌ భారత్‌ కింద 112 జిల్లాల్లోని ద్వితీయశ్రేణి పట్టణాలకు ప్రాధాన్యం, 2025 నాటికి టీబీని రూపుమాపడమే సర్కార్‌ ధ్యేయం, బహిరంగ మల విసర్జన రహిత భారత్‌ సాధన కోసం ఓడీఎస్‌ ప్లస్‌ పథకం. స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు, 2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు, త్వరలో కొత్త విద్యా విధానం, మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వత్తి విద్యాకోర్సులు, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్‌, వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు, పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విద్య, త్వరలో నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం.
జల్‌జీవన్‌ మిషన్‌కు 11,500 కోట్లు, ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్న కేంద్రం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు, కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీలు, రూ.1480 కోట్లతో నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌, ఎలక్ట్రానిక్‌ రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు
ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిర్విక్‌ స్కీమ్‌, ప్రతి జిల్లాను ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా తయారు చేస్తాం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు,
పారిశ్రామిక, వాణిజ్యరంగాల కోసం రూ.27,300 కోట్లు, త్వరలో నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్‌ రైళ్లు,
త్వరలో జాతీయ లాజిస్టిక్‌ పాలసీ, అన్ని రకాల ముడిసరుకులు ఒకే చోట దొరికేలా ప్రత్యేక విధానం, అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి ఇంటికి విద్యుత్‌ అందించడం మా ప్రభుత్వం సాధించిన ఘనత, రాబోయే మూడేళ్లలో ప్రీపెయిడ్‌ కరెంట్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం, స్మార్ట్‌ మీటర్లతో కరెంటు ఎవరి దగ్గరి నుంచి కొనాలో.. నిర్ణయించుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌ను 16 వేల కి.మీ. స్థాయి నుంచి 27 వేల కి.మీ స్థాయికి విస్తరింపు, కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు, భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌, లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌, మూలకణ వైద్యవిధానం అభివద్ధి కోసం డేటా బేస్‌ ఏర్పాటు, క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ కోసం రూ.8 వేల కోట్లు, బాలిక, మహిళల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు, షెడ్యూల్‌ కులాలు, వెనుకబడిన వర్గాల అభివద్ధి కోసం రూ. 85 వేల కోట్లు, షెడ్యూల్‌ తెగల కోసం రూ.53, 700 కోట్లు, దివ్యాంగులు, వద్ధుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లు.
రాఖీగడి, హస్తినాపూర్‌, శివసాగర్‌, డోలాబీరా, ఆదిత్యనల్లూర్‌ లాంటి.. చారిత్రక ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు, విశేష పురావస్తు కేంద్రాలుగా అభివద్ధి, రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు, లోధాల్‌లో మారిటైమ్‌ మ్యూజియం ఏర్పాటు, జాతీయ భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు, ఇక పన్ను చెల్లింపు దారుల చార్టర్‌, పన్ను ఎగవేత ఇక క్రిమినల్‌ నేరం కాదు..త్వరలో చట్ట సవరణ
పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో నాన్‌ గెజిటెట్‌ పోస్టుల భర్తీకి నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, జమ్మూకశ్మీర్‌ అభివ ద్ధికి రూ.30,757 కోట్లు, లద్దాక్‌ అభివద్ధికి రూ.5,958 కోట్లు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు 3.50 లక్షల కోట్లు, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు, బ్యాంకుల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగాలి.
కంపెనీల చట్టంలో మార్పులు తెస్తాం, ప్రభుత్వరంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలు, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.8శాతం,
ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల విక్రయం, 2021 నాటికి ద్రవ్యలోటు 3.5 శాతం, 2020-21లో జీడీపీ అంచనా 10 శాతం, కొత్త కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15 శాతం, పాత కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ 22 శాతం, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 2.12 లక్షల కోట్లు, రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను, రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను, 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను, రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను, రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం,
పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతి, పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమే, అమలులో ఉండనున్న పాత, కొత్త ట్యాక్స్‌ విధానాలు, కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్రం ఊరట, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు మరో ఏడాది పాటు పన్ను మినహాయింపు.