జాతరకు ప్రత్యేక రైళ్లు
మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్థం అదనంగా 20 రైళ్లు
హైదరాబాద్: ప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. హైదరాబాద్- సికింద్రాబాద్- వరంగల్ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయని, ఇవి మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే వివరించింది. సిర్పూర్ కాగజ్‌నగర్- వరంగల్- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య మరో 10 రైళ్లు నడవనున్నాయి. ఇవి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, జమ్మికుంట, కొత్తపల్లి, కొలనూర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.