ఉత్తరాదిదే..పెత్తనం

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం. అలాగని భిన్నత్వాన్ని చెరిపేసి ఏకత్వానికే పట్టం కట్టాలని ఆధునిక భారత నిర్మాతలు ఎన్నడూ తలపోయలేదు. ఒకే జాతి చట్రంలోనే భిన్నత్వాన్ని పరిరక్షించే విధంగా రాజ్యాంగాన్ని రూపుదిద్దారు. అందువల్లనే భారత్‌లో వైవిధ్యం వికసిస్తోంది. జాతి నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. భారత్‌ వంటి సువిశాల దేశంలో గ్రామస్థాయి వరకు రాజకీయ, ఆర్థిక అధికారాలను సంక్రమింపజేయడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడతామనే భరోసా కల్పించాలి. కానీ, ఇటీవల ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. రాష్ట్రాలకు, వ్యక్తులకు, సంస్థలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, అధికారాలను క్రమంగా కేంద్ర ప్రభుత్వం లాగేసుకొంటోంది. మిగతావాళ్లకన్నా తామే అధికులమని, దేశానికి ఏది మంచిదో తమకు మాత్రమే తెలుసునని కొంతమంది భావిస్తున్నందువల్ల ఈ అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 2014 నుంచి ఇది మరీ శ్రుతిమించింది. నేడు కేంద్ర ప్రభుత్వంలో హిందీ రాష్ట్రాలవారి ఆధిక్యం నెలకొని ఉండటం ఈ దుస్థితికి ప్రధాన కారణం. ప్రస్తుత ప్రధానమంత్రి హిందీ రాష్ట్రాలకు చెందినవారు కాకపోయినా, ఆయన రాజకీయ విశ్వాసాలు ఆ కుదురు నుంచే వచ్చాయి. దక్షిణ భారత రాష్ట్రాలపై విచక్షణ చూపుతున్నారనే వాస్తవాన్ని ఒప్పుకోకుండా ప్రస్తుత పాలక పక్షం ఇదంతా ఎన్నికల రాజకీయమని కొట్టేస్తోంది. మరిన్ని నిధులు, అధికారాల కోసం దక్షిణాది చేస్తున్న డిమాండ్లను కుట్ర అంటూ తోసిపుచ్చుతోంది. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలు దక్షిణ భారత రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించబోతున్నాయనే ఆందోళనను పెడచెవిన పెడుతోంది. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించుకుని, అభివ ద్ధి బాటలో వేగంగా పురోగమించడమే దక్షిణాది రాష్ట్రాలు చేసిన తప్పులా ఉంది. దీన్ని శిక్షించాలనే ధోరణి కేంద్రంలో కనిపిస్తోంది.

భిన్న ధోరణి
పూర్వ ఆర్థిక సంఘాలకు భిన్నంగా 15వ ఆర్థిక సంఘం మొదటి నుంచే దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంది. పూర్వ సంఘాలు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 15వ ఆర్థిక సంఘం 2011 జన గణనను లెక్కలోకి తీసుకుంటానంటోంది. కేంద్రమే దాన్ని ఈ విధంగా పురమాయించింది. పూర్వ ఆర్థిక సంఘాలు అనేక ఇతర గణాంకాలను పరిశీలించినా చివరకు తమ సిఫార్సులకు 1971 జనగణనను ప్రాతిపదికగా తీసుకునేవి. నిర్బంధ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆ తరువాతే అమలులోకి వచ్చినందువల్ల పూర్వ సంఘాలు 1971 జనగణనను ఆధారంగా తీసుకున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. అదీకాకుండా 1971నాటి సమాచారం ఆధారంగా లోక్‌సభా నియోజకవర్గాలను విభజించి 2026 సంవత్సరం వరకు అవి అమలులో ఉంటాయన్నారు. లోక్‌సభ సీట్లలో మార్పుచేర్పులు జరిగేది తిరిగి 2026లోనే. కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడటం కోసమే ఈ నియమం పాటించారు. అందుకు తగ్గట్టే దక్షిణ భారత రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో విజయం సాధించాయి. తక్కువమంది పిల్లలను కంటే వారి విద్య, ఆరోగ్యం, అభ్యున్నతులపట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవచ్చునని, కుటుంబ ఆదాయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చునని దక్షిణాది తల్లిదండ్రులు భావించారు. జీవన వ్యయం పెరిగిపోతున్న ద ష్ట్యా చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబమని గ్రహించారు. ఈ పరిస్థితి ఉత్తర భారతంలో, ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో కనిపించదు. అయినా కూడా 15వ ఆర్థిక సంఘ సిఫార్సులకు 2011 జనగణననే లెక్కలోకి తీసుకుంటామనడం చోద్యంగా ఉంది. దీనివల్ల దక్షిణాదికి నిధుల కేటాయింపు తగ్గిపోవడం మాత్రమే కాదు. 2026లో దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు పార్లమెంటు ఉభయ సభల్లో సీట్ల సంఖ్యా కోసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. అటు నిధులు, ఇటు పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గిపోతే దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం శ్రుతిమించడం ఖాయం.

దక్షిణ భారత రాష్ట్రాలపై విచక్షణ నిస్సందేహంగా 2014 నుంచి పెరిగిపోయింది. ప్రస్తుత పాలకపార్టీకి ఎక్కువ సీట్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి లభించినందువల్ల ఆ ప్రాంతానికి ఎక్కువ నిధులు వడ్డించాలన్న తాపత్రయం ఎక్కువైంది. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ దక్షిణాదిపై ఇంత పెద్దయెత్తున విచక్షణ కనబరచిన దాఖలా లేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చిన రాష్ట్రాలకు ఒక సూత్రం, గిట్టని రాష్ట్రాలకు వేరే సూత్రం అన్నట్లు వ్యవహరిస్తోంది. ఉదాహరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను అభివ ద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలంటున్న ఎన్‌హెచ్‌ఏఐ, అదే గుజరాత్‌లోని సోమనాథ్‌ చుట్టూ అభివ ద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతు లేమీ పెట్టలేదు.ఈ విధమైన పక్షపాత ధోరణి దక్షిణాదిలో అసంత ప్తి పెంచుతోంది. నిధుల పంపిణీలో విచక్షణ దక్షిణ భారత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) వచ్చినప్పటి నుంచి పన్నులు వేసే అధికారాన్నీ కేంద్రానికి వదులుకోవలసి వచ్చింది. ప్రధాన పన్ను రేట్లను తగ్గిస్తూనే వాటి మీద అదనపు సెస్సు విధించడం ద్వారా కేంద్రం తన బొక్కసాన్ని నింపుకొంటూ రాష్ట్రాల ఖజానాకు బొర్రె పెడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి సెస్సుల రూపంలో అదనపు ఆదాయం లభిస్తుండగా రాష్ట్రాలకు పంచాల్సిన ఆదాయనిధి తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వ స్థూలపన్ను ఆదాయం (జీటీఆర్‌)లో సెస్సుల ద్వారా లభించిన వాటా 2013-14లో 6.7 శాతం ఉండగా, అది 2016-17 నాటికి 10.8 శాతానికి పెరిగిందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. మరోవిధంగా చెప్పాలంటే వివిధ సెస్సుల రూపంలో కేంద్రానికి 2013-14లో రూ.72,000 కోట్ల ఆదాయం లభించగా, అది 2017-18 నాటికి రూ.1.90 లక్షల కోట్లకు పెరిగింది. కేంద్రం ఈ నిధుల్లో రాష్ట్రాలకు వాటా ఏమీ విదల్చదు. కేంద్రప్రభుత్వ సొంత బడ్జెట్‌ అంచనాల ప్రకారం చూసినా, పన్నుల ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘ సిఫార్సును బట్టి చూసినా 2017-18లో అదనపు సెస్సుల రూపంలో కేంద్రం బాగా సొమ్ము చేసుకుందని అర్థమవుతుంది. ఈ నిధుల్లో కనీసం రూ.80,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచి ఉండాల్సింది.

దక్షిణం, ఉత్తరం రెండూ నాలుగు దిక్కుల్లో ఉన్న రెండు దిక్కులు. కానీ ఓ దిక్కు ఉన్న వారిపై ఇంకో దిక్కు వారు ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తారనే విషయం అందరికీ తెలుసు. తెలియదనుకుంటే భారత్‌కు రావాల్సిందే. ఎందుకంటే నేటి భారతంలో ఆ పరిస్థితులు స్పష్టంగా కనిపి స్తాయి. ఈ విషయాన్ని అప్పుడే గుర్తించిన ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌ ఆనాడు దక్షిణ భారతీయులకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ చేశారు.

ఎందుకనే విషయం సిద్ధాంతీ కరించారు. ద్రవిడులు దక్షిణభారతీయులనీ, ఉత్తర భారతీయులు ఆర్యులని వారి వర్ణం. సంస్క తి తమది ఒకటి కాదని, కాబట్టి ఎప్పటికైనా ఉత్తరవాసులు, దక్షిణవాసులపై ఆధిపత్యం చెలా యించేందుకు అవకాశముందని పెరియార్‌ చెప్పారు.దక్షిణ భార తావనికి ప్రధాని, రాష్ట్రపతి ఉండాలని, ప్రత్యేక దేశంగా కొనసా గాలనే డిమాండ్లతో ఉద్యమించాలని నిర్ణయం కూడా తీసుకున్నా రు. అయితే నాడు భారతావని ఒక్కటిగా ఉండాలనీ, అప్పటికే ముస్లింలను పాకిస్థాన్‌ పేరుతో దేశం ఏర్పడటం వంటి పరిణా మాలు చూసిన అంబేద్కర్‌ పెరియార్‌తో మాట్లాడి ఒకే దేశంగా ఉంచేందుకు ఒప్పించారు.ఉత్తర, దక్షిణ భారతాలు అనికాకుండా ఒక్కటిగా ముందుకెళ్దామనే భావన తీసుకెళ్దామని సూచించారు.

దేశం ఒక్కటైనా భావనలు, వ త్తులు, ప్రవ త్తులు భిన్నంగా ఉంటాయి. మరి ముఖ్యంగా దక్షిణ, ఉత్తర భారతాల్లో పరస్పర విరుద్ధంగా ఉంటాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తర భారతీయులు దైవం, నమ్మకాలు బలంగా ఉన్నాయి. దక్షిణంలో నాస్తిక, ఆస్తిక భావనలు బలంగా ఉన్నాయి.ఉత్తరాదిలో భాష ప్రధానంగా హిందీ.దక్షిణాన ప్రధాన భాష అంటూ లేదు. తమి ళనాడులో తమిళం, కేరళలో మలయాలం, ఎపి, తెలంగాణాలో తెలుగు, కర్నాటకలో కన్నడం ఉన్నాయి. నేడు పాలకులు తమ హిందీ భాషను దక్షిణాన రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని బలంగా అడ్డుకున్నప్పటికీ ఇంకా బలమైన రూపంలో వివక్షకు దక్షిణ గురవ్ఞతుందని సునిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది.

నిధుల బదలాయింపు ఏమేరకు జరుగుతుంది? రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సినవి వస్తున్నాయా? తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా, దుగ్గరాజపట్నం ఎయిర్‌ పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, పెట్రోలియం అండ్‌ ఆయిల్‌ రిఫైనింగ్‌ క్రాకర్స్‌ పరిశ్రమ, రైల్వేజోన్‌లు, బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ, విద్యాసంస్థలకు నిధులు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయహోదా, ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు ఏం కాదూ. చట్టంలో ఉన్న అంశాలే. కాని ఇవేవీ అమలుకు నోచుకోలేదు.

ఉద్యోగాల్లోనూ వివక్షే. దేశానికి సంబంధించి ప్రభుత్వ అత్యున్నత ఉద్యోగాల్లో దక్షిణ భారతీ యులకు చోటు లేదు.నీట్‌,క్లాట్‌ అంటూ అన్నిపరీక్షలు జాతీయం చేశారు. రైల్వే ఉద్యోగాలు హిందీ భాషలో నిర్వహిస్తున్నారు. తద్వారా దక్షిణ భారతీయులు నష్టపోతున్నారు. దక్షిణాదికి రావా ల్సిన ఉద్యోగాలను బీహారీలు కొట్టుకుపోతున్నారు.యూపిఎస్‌సి, రైల్వే బోర్డులు, సుప్రీంకోర్టు బెంచ్‌లు దక్షిణభారతంలో ఉండా ల్సిన అవశ్యకతఉంది. కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగ నిర్దేశించిన ఓ సంస్థ. కేంద్ర,రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ ఆ సంస్థ నిధి. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆదాయ పంపిణీ జరుగుతోంది.

కాని ఇకపై 15వ ఆర్థికసంఘం సిఫార్సులతో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు 1971 జనాభా లెక్కల ప్రకారమే ఆదాయ వనరుల పంపిణీ జరిగింది. ఇప్పుడు 15వ ఆర్థికసంఘం గైడ్‌ లైన్స్‌ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం ఆదాయ పంపిణీ జరుగుతుంది. అప్పుడు మొదటగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే అప్పట్లో జనాభా నియంత్రణ విధానాలు పాటించి,గణనీయ క షి చేసి జనాభాను నియంత్రించారు. అదే ఇప్పుడు శాపంగామారింది.

ఉత్తరరాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించలేదు. ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెంచాయి. అది వారికి ఇప్పుడు మంచిదైంది. జనాభాను నియంత్రించినందుకు దక్షిణ రాష్ట్రాలను ప్రశంసించాల్సిన కేంద్రం నేడు శిక్షించేందుకు యోచిస్తుంది.ఎందుకంటే ఆదాయాల కేటాయింపు ఉత్తర రాష్ట్రా లకే ఎక్కువగా జరుగుతుంది. ఈ సందర్భంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే దక్షిణ రాష్ట్రాలు పోరుబాటపడతాయి. వెనుక ఉండ టానికి ఒక ముఖ్యమైన కారణం అని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగాచూస్తే యూకెలోని పిల్లలకు కనీసం ఐదు సంవత్సరాల వయస్సులోపు ఉండాలి. అదే యూఎస్‌లో అరు