అల..నావికాదళంలో స్వాతి ప్రయాణం
ఎవరికైనా సముద్రాన్ని చూస్తే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేం. ఎగిసిపడే అలలు, తీరాన్ని తాకే కెరటాలు.. హోరున వీచే వాయు తరంగాలు.. ఇలా సాగరతీరం అంతులేని ఆనందానికి ప్రతీక. కానీ నాలుగడుగులు సముద్రంలోకి వెయ్యాలంటేనే.. తెలియని భయం. ఎందుకంటే.. సముద్రపు గాంభీర్యం అలాంటిది. దిగితేగానీ సాగరుడిలో దాగున్న ప్రళయ తాండవ గుణమేంటో అర్థంకాదు. ఏటికి ఎదురీదినా ఈదొచ్చుగానీ.. సముద్రానికి ఎదురెళ్ళడం అంత సులభం కాదు. అలాంటిది సప్త సముద్రాలను చుట్టి వచ్చారు ఆరుగురు భారత నావికాదళ మహిళా బంద సభ్యులు. దేశంలో ప్రప్రథమంగా సముద్ర యానంతో ప్రపంచాన్ని చుట్టొచ్చిన వీర నారీమణులుగా కీర్తికెక్కారు. ఆ బందంలో తెలుగు మహిళ అయిన లెఫ్టినెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతి ఒకరు. ఎనిమిదన్నర నెలలు పాటు 48 వేల కిలోమీటర్లు తెరపడవ ఆసరాగా సముద్ర యానం చేసి, ప్రపంచాన్ని చుట్టి రావడం మాటలు కాదు. అలాంటి సాహసయాత్రలో తానొక సాక్షిగా నిలిచిన యువ లెఫ్టినెంట్ కమాండర్ స్వాతి సాగర ‘జీవన’యాత్ర విశేషాలు.. ఆమె మాటల్లోనే విందాం!
నాన్న పాతర్లపల్లి ఆదినారాయణ నేవీలో హెడ్ కుక్‌గా పనిచేస్తున్నారు. అమ్మ రాణి సెయిలింగ్ క్లబ్ క్లర్క్‌గా పని చేస్తుంది. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. నేనే ఆఖరిదాన్ని. విశాఖలోనే పుట్టి పెరిగాను. నా బాల్యం నేవీ బాల్వాడీలో గడిచింది. పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. సింధియాలోని గాంధీగ్రామ్ హైస్కూల్లో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివాను. షిప్‌యార్డ్ హైస్కూల్లో పదవ తరగతి పాసయ్యాను. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాను. నాన్న బలవంతంతోనే బిఎస్సీలో చేరాను. అలా.. 2010లో చైతన్య మహిళా కళాశాలలో బిఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాను.
మళ్ళీ ఆడపిల్లేనా.. అన్నారు!
నేను కడుపులో ఉండగా అమ్మకు నేవీలో ఉద్యోగం వచ్చింది. అందుకే నన్ను మా కుటుంబంలో లక్కీ గర్ల్ అంటుంటారు. అయినా మగ పిల్లాడు పుట్టలేదని, మూడో సంతానమూ ఆడపిల్లేనని మా వాళ్ళందరూ నేను పుట్టినప్పుడు బాధ పడ్డారు. కొన్నాళ్ళ తరువాత నేను బాగా చదువుతుండటం, నా గురించి మా టీచర్లంతా బాగా చెప్పడంతో వాళ్ళలో ఆ బాధ పోయింది. అమ్మకు నేవీ ఆఫీసర్ ఇంట్లో పని. అప్పుడప్పుడు నన్ను అమ్మతో పాటు తీసుకు వెళ్ళేది. అమ్మ పడే కష్టాన్ని కళ్ళారా చూసేదాన్ని. అమ్మతో పాటు నేనూ వెళ్ళి అమ్మకు పనిలో సాయం చేసేదాన్ని. ముగ్గురం ఆడపిల్లలమైనా మా అమ్మానాన్న.. మమ్మల్ని బాగా చదించారు. మా మేనమామ మాకు చాలా చేదోడువాదోడుగా ఉండేవారు.
స్కూల్‌కి నడిచి వెళ్ళా!
మా చదువులు బాగా సాగాలని, బయట వాతావరణం తెలియాలని మా అమ్మానాన్నలు నేవీ వాతావరణం నుంచి బయటకి తీసుకువచ్చారు. అక్కడ ఉన్న అన్ని సదుపాయాలు వదులుకొని, మల్కాపురానికి మకాం మార్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్‌కి ఇంటి నుంచి ఆరు కిలోమీటర్లు. స్కూల్‌కి నడిచే వెళ్ళేదాన్ని. నేవీ వాతావరణం నుంచి బయటపడబట్టే చాలా విషయాలు తెలుసుకోగలిగాను. బిఎస్సీ పాసైన తరువాత ఎమ్మెస్సీలో చేరాను. ఎమ్సెస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగానే నేవీ పరీక్షకు వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. కేరళలో ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్’గా 2011లో ఉద్యోగంలో చేరాను.
శిక్షణలో.. అమ్మకు అలా!
నేవీ ట్రైనింగ్ మూడు చోట్ల జరిగింది. కేరళలోని ఎడిమల, కొచ్చిన్, హైదరాబాద్‌లోని దిండిగల్‌లో ట్రైనింగ్ అయ్యా. ట్రైనింగ్‌లో ఉండగా అమ్మకు క్యాన్సర్ అనే వార్త తెలిసింది. పై అధికారులను సంప్రదించాను. వాళ్ళు నేవీ ఆసుపత్రిలో చేర్పించమన్నారు. ఇటు ట్రైనింగ్, అటు అమ్మ అనారోగ్యం.. దేన్నీ వదులుకోలేని పరిస్థితి. నేవీ ఆసుపత్రిలో చేరిస్తే.. దగ్గరగా ఉన్నాగానీ అమ్మను చూసుకోలేని పరిస్థితి. అందుకే, డబ్బు ఖర్చు అయినా ఫరవాలేదని విశాఖలోని ప్రయివేటు క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించాను. మా అక్కలు అమ్మను చూసుకున్నారు. అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది.
ధైర్యమే.. ఎంపిక చేసింది
దేశంలో ప్రప్రథమంగా ప్రభుత్వం మహిళా నావికులతో ”నావికా సాగర్ పరిక్రమ’ పేరిట ప్రపంచ యాత్రను చేయించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా ముంబయిలో 2014లో సెయిలింగ్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి సెయిలింగ్ ఆంటే ఇష్టం. సెలెక్షన్స్‌కి వెళతానంటే అమ్మ కూడా నన్ను ప్రోత్సహించింది. విశాఖలోని నేవీలో నాతో పాటు పనిచేస్తున్న వర్తికా జోషి సెలెక్షన్స్‌కి వచ్చింది. సెలెక్షన్స్‌లో మా ఇద్దరి జోడీని అరగంట పాటు సముద్రంలోకి వెళ్ళిరమ్మని బోటు ఇచ్చారు. మేము ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళాం. లోనికి వెళ్ళిన పది నిమిషాలకే మా బోటు తిరగబడింది. మాకు దెబ్బలు తగలి, రక్తాలు వచ్చాయి. బోటు తిరిగి సరిచేసి, ఒడ్డుకు వచ్చాం. మేం మరి వెళ్ళం అని చెప్పేశాం. కానీ సెలెక్షన్ అధికారులు మీరు సెలెక్ట్ అయ్యారని మాతో చెప్పారు. ఎందుకంటే మీరు ధైర్యం చేసి వెళ్ళారు. బోటు తిరగబడినా తిరిగి వచ్చారని చెప్పారు. తరువాత మరో టెస్ట్ పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు (పురుషులు) పాటు 37 మందికి 2015లో నాన్‌స్టాప్ సెయిలింగ్ టెస్ట్ పెట్టారు. కేప్‌టౌన్ నుంచి రియో వరకు సెయిలింగ్ చేశాం. అప్పటికి నేవీకి మాపై నమ్మకం కలిగింది. నన్ను, నా సహచరి వర్తికా జోషి, ప్రతిభా జామ్‌వాల్‌లను కోర్ సభ్యులుగా మరో ముగ్గురిని కలిపి ఆరుగురు సభ్యులను టూర్‌కి ఎంపిక చేశారు.
మా పర్యవేక్షణలోనే బోటు తయారు
గోవాలోని అక్వేరియస్ షిప్‌యార్డ్‌లో సెయిలింగ్‌కి ప్రత్యేకంగా బోటుని తయారుచేయడానికి ఏర్పాట్లు చేశారు. దానికి మా బ ందమే పర్యవేక్షణ చేసింది. 2017 ఏప్రిల్‌లో ‘తారిణి’ అనే బోటుని సిద్ధం చేశాం. అన్ని టెస్ట్‌లు పూర్తిచేసిన అనంతరం 2017 సెప్టెంబర్ 10వ తేదీన గోవా పోర్టు నుంచి మా సముద్రయానం మొదలైంది. టూర్‌ని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అలా యాద చ్ఛికంగా మహిళ చేతుల మీదుగానే సాహసయాత్ర మొదలైంది. ఎనిమిదిన్నర నెలల పాటు 48 వేల కిలోమీటర్లు సముద్రయానం చేసి, ప్రపంచ దేశాలు తిరిగి 2018 మే 21వ తేదీన గోవా పోర్టుకి చేరుకున్నాం. చివరిగా మాకు స్వాగతం పలికింది కూడా నిర్మలా సీతారామన్ గారే.
సాగరంలో.. సాహసయాత్ర
మా బందం గోవాలో తారణి (తెరపడవ)లో బయలుదేరి 43 రోజులు ప్రయాణం చేసి ఆస్ట్రేలియా చేరాం. అక్కడ నుంచి న్యూజిలాండ్ 25 రోజుల్లో చేరుకున్నాం. అక్కడ నుంచి దక్షిణ అమెరికా వెళ్ళడానికి 45 రోజులు పట్టింది. అక్కడ నుంచి దక్షిణాఫ్రికాకు 30 రోజులు ప్రయాణం చేశాం. మధ్యలో మా బోట్ స్టీరింగ్ పాడవ్వడంతో మారిషస్‌కి వెళ్ళాం. అందుకోసం 35 రోజులపాటు ప్రయాణం చేశాం. మారిషస్ నుంచి మరో 35 రోజులు ప్రయాణం చేసి, గోవా చేరుకున్నాం.
ప్రయాణంలో.. ప్రయాసలు
సముద్ర ప్రయాణం గురించి.. బాగా తెలుసుకున్నాకనే, అన్నిటికీ సిద్ధపడే వెళ్ళాం. కానీ నెలలు తరబడి ప్రయాణం చేయడంతో చాలా ప్రయాసలు పడాల్సి వచ్చింది. సముద్రంలో ప్రశాంతంగా ఉన్నపుడు మాత్రమే నిద్ర. ఒక్కోసారి రోజంతా నిద్ర ఉండేది కాదు. పసిఫిక్, అంట్లాంటిక్ సముద్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుండేవి. సమయం దొరికితే స్లీపింగ్ బ్యాగ్స్‌లో పడుకునే వాళ్ళం. ఒక్కోసారి భయంకరమైన గాలులు వీచేవి. రైస్, పప్పు, చెనా వంటివి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. డ్రై ఫ్రూట్స్, పాలు, ఎనర్జీ డ్రింక్స్ తాగి ఉండేవాళ్ళం.
అసలు.. ఈ పడవ ప్రయాణం వెనుకగల ముఖ్య కారణం ఏమంటే.. దేశంలోని మహిళాశక్తిని లోకానికి చాటి చెప్పడం. అలాగే మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేయడం, సెయిలింగ్ ప్రాముఖ్యతను ప్రచారం చేయడం, వివిధ సముద్రాల మెట్రలాజికల్ డేటా తయారుచేయడం.. మెరైన్ పొల్యూషన్ ఏరియాలను గుర్తించడం వంటివి ఈ యాత్ర ప్రధాన ఉద్దేశాలు. మేము ప్రయాణానికి వెళ్ళే ముందు ప్రధాని నరేంద్ర మోదీని కలిశాం. మాకు ఎంతో ధైర్యం చెప్పారు. తిరిగి వచ్చిన తరువాత ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవిందులను కలిశాం. వారు మా అనుభవాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
కుటుంబం
భర్త సంతోష్ జైశ్వాల్. ఐఎన్‌ఎస్ కళింగలో లెఫ్ట్‌నెంట్ కమాండర్. అక్కలు లావణ్య, సువర్ణ. ఈ సాహసయాత్ర ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది. ఇది భారత నావికాదళ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం.”మళ్ళీ ఆడపిల్లేనా.. అన్నారు! నేను కడుపులో ఉండగా అమ్మకు నేవీలో ఉద్యోగం వచ్చింది. అందుకే నన్ను మా కుటుంబంలో లక్కీ గర్ల్ అంటుంటారు. అయినా మగ పిల్లాడు పుట్టలేదని, మూడో సంతానమూ ఆడపిల్లేనని మా వాళ్ళందరూ నేను పుట్టినప్పుడు బాధ పడ్డారు. కొన్నాళ్ళ తరువాత నేను బాగా చదువుతుండటం, నా గురించి మా టీచర్లంతా బాగా చెప్పడంతో వాళ్ళలో ఆ బాధ పోయింది. అమ్మకు నేవీ ఆఫీసర్ ఇంట్లో పని. అప్పుడప్పుడు నన్ను అమ్మతో పాటు తీసుకు వెళ్ళేది. అమ్మ పడే కష్టాన్ని కళ్ళారా చూసేదాన్ని. అమ్మతో పాటు నేనూ వెళ్ళి అమ్మకు పనిలో సాయం చేసేదాన్ని. ముగ్గురం ఆడపిల్లలమైనా మా అమ్మానాన్న.. మమ్మల్ని బాగా చదించారు. ” …
ఇలా తన గురించి చెప్పడం మొదలు పెట్టింది, వైజాగ్‌కు చెందిన నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్ ఆఫీసర్ స్వాతి పాతర్లపల్లి,
ఆమె జీవితమే ఒక పాఠం,
హాలీవుడ్‌లో ఛాన్స్ రావడానికి వెనుక అమె సప్త సముద్రాల మీద చేసిన సాహసం ఉంది. దేశంలో ప్రప్రథమంగా సముద్ర యానంతో ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహస వనితలుగా కీర్తికెక్కిన టీమ్‌లో తెలుగు మహిళ లెఫ్టినెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతి ఒకరు. ఎనిమిదన్నర నెలలు పాటు 48 వేల కిలోమీటర్లు తెరపడవ ఆసరాగా సముద్ర యానం చేసి, ప్రపంచాన్ని చుట్టి రావడం మాటలు కాదు.
ఇటీవల విజయనగరంలో కలిసినపుడు ఆమె చెప్పిన కథనం ….
” విశాఖలోనే పుట్టి పెరిగాను. నా బాల్యం నేవీ బాల్వాడీలో గడిచింది. పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. 2010లో, బిఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి, ఎమ్సెస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగానే నేవీ పరీక్షకు వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. దేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం మహిళా నావికులతో ”నావికా సాగర్ పరిక్రమ’ పేరిట ప్రపంచ యాత్రను చేయించాలని నిర్ణయించింది. దుకోసం ప్రత్యేకంగా ముంబయిలో సెయిలింగ్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. అనంతరం 2017 సెప్టెంబర్ 10వ తేదీన గోవా పోర్టు నుంచి మా సముద్రయానం మొదలైంది. ఎనిమిదిన్నర నెలల పాటు 48 వేల కిలోమీటర్లు సముద్రయానం చేసి, ప్రపంచ దేశాలు తిరిగి 2018 మే 21వ తేదీన గోవా పోర్టుకి చేరుకున్నాం. 43 రోజులు ప్రయాణంలో, ఆస్ట్రేలియా చేరాం. అక్కడ నుంచి న్యూజిలాండ్ 25 రోజుల్లో చేరుకున్నాం. అక్కడ నుంచి దక్షిణ అమెరికా వెళ్ళడానికి 45 రోజులు పట్టింది. అక్కడ నుంచి దక్షిణాఫ్రికాకు 30 రోజులు ప్రయాణం చేశాం. మధ్యలో మా బోట్ స్టీరింగ్ పాడవ్వడంతో మారిషస్‌కి వెళ్ళాం. అందుకోసం 35 రోజులపాటు ప్రయాణం చేశాం. మారిషస్ నుంచి మరో 35 రోజులు ప్రయాణం చేసి, గోవా చేరుకున్నాం. ఈ సాహసయాత్ర ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది. ఇది భారత నావికాదళ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. నా పై జాతీయ స్ధాయిలో మీడియాలో కథనాలు రావడంతో ఇటీవల హాలీవుడ్ నుండి కొన్ని సినిమా ప్రతిపాదనలు వచ్చాయి. చర్చలు జరుగుతున్నాయి…” అని ముగించారు స్వాతి.