అజీర్ణానికి ఇక స్వస్తి
జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఉదర సంబంధిత సమస్యలు నానాటికీ అధికమవుతున్నాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపులో అసౌకర్యం వంటివి. పేరేదైనా గ్యాస్ సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవం. ఇలా ప్రారంభమైన సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మార్పు చెందుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత క్లిష్టతరమవుతోంది. అయితే గ్యాస్ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే స్పందిస్తే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. దీనితో పాటు పలు సూచనలు పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వీలుంటుంది. మోతాదుకు మించకుండా చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడ్తాయి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా గ్యాస్ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా ఎదురయ్యే గ్యాస్ సమస్య నెమ్మదిస్తుంది. ఉదయాన్నే ఏమీ తినకుండా తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగుతుంటే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. రీరాంతర అవయవాలలో గుండె ఎంత ముఖ్యమో ఉదరమూ అంతే ప్రధానం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వైద్యశాస్త్ర సాంకేతికవేత్తలు హదయం పనితనంలోని లోటుపాట్లను తెలుసుకోగలుగుతున్నంత తేలిగ్గా, సౌలభ్యంగా కడుపు కనికట్లను గ్రహించలేకపోతున్నారు. దీనికి, కారణం.. అందుకు సరైన, దీటైన సాంకేతికత, పరికర వ్యవస్థ లేకపోవడమే. మనిషి పొట్ట లోపల ఏం జరుగుతున్నదీ, ఎక్కడ ఏ విధమైన అజీర్తి కారకాలు, నొప్పి, పైత్యం, వికారం వంటి అనారోగ్య లక్షణాలు తలెత్తుతున్నవీ తెలుసుకోవడానికి ఇప్పుడు వైద్యులకున్న ఏకైక శాస్త్రీయ విధానం నాసాంత్ర నాళపరీక్ష. అంటే, ముక్కు రంధ్రాలలోంచి గొంతుద్వారా గొట్టాన్ని కడుపులోకి జొప్పించి నిర్ధారించడం. ఇక మున్ముందు, ఇంతటి ఇబ్బందికరమైన పరీక్షలకు తావు లేకుండా ఇసిజితో గుండెను ఎలా పరీక్షిస్తున్నారో అంత తేలికైన ఇజిజి విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీవశక్తి ఉత్పాదనా కేంద్రమైన ఉదరంలో అణువణువునా తలెత్తే అజీర్తి సంకేతాలను, ఆరోగ్య కారకాలను, ఆహార పదార్థ పనితనాలను పర్యవేక్షించడానికి జీవశాస్త్రవేత్తలు తాజాగా ఒక సమర్థవంతమైన బాహ్యపరికరాన్ని అభివ ద్ధి పరిచారు. దీనిని కడుపు పైన ధరించి, ఎలక్ట్రోడ్స్ను పనిచేయించడమే తరువాయి.. లోపలి ద శ్యం ఆవిష్క తమవుతుంది. జీర్ణాశయాంత్ర వైద్యశాస్త్రంలో దీనినొక కీలకమైన ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ ఉదర పర్యవేక్షణా పరికరం దేహానికి ఎలాంటి హానీ చేయదు. పొట్టలోని వివిధ జీర్ణ సంబంధ క్రియలను, అనారోగ్య లక్షణాలను పర్యవేక్షిస్తుంది. అది కూడా అత్యంత కచ్చితమైన ప్రామాణికతలతో పసిగడుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. కడుపునకు చెందిన ఇజిజి వైద్యపరీక్ష భవిష్యత్తుకు మంచి భరోసానిచ్చే కొత్త సాంకేతికతగా దీనిని వారు పేర్కొన్నారు. ఇసిజి పరీక్ష గుండె పనితనం, అందులోని లోటుపాట్లను ఎలా గుర్తిస్తుందో ఇజిజి కూడా ఉదర సమస్యలను అలాగే పసిగడుతుంది. కానీ, ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో అభివద్ధి కాకపోవడంతో వినియోగంలో ఒకింత వెనకబడిపోతున్నది. కారణం, ఇది ఇసిజి అంత కచ్చితత్వపు కార్యశీలతను సాధించకపోవడమే. ఇందుకు అసలైన అడ్డంకిగా మన అన్నకోశ వ్యవస్థ నిర్మాణమేనని నిపుణులు చెబుతున్నారు. హదయం తన క్రియాశీల సంకేతాలను పైపరీక్షలో ఇచ్చినంత వేగంగా, కచ్చితంగా, ఉదర సంకేతాలు ఉండకపోవడానికి అన్నకోశ వ్యవస్థ తీరుతెన్నులే మూలమని వారంటున్నారు. కాబట్టే, ఇజిజి వినియోగంపైన గత చాలాకాలంగా వైద్యులలో అసంత ప్తి, పలు అనుమానాలు ఏర్పడ్డాయి. దీంతో ఇజిజి సాంకేతికత కాస్తా వివాదాస్పదమైంది కూడా. అయినా, ప్రపంచస్థాయిలో కొందరు జీర్ణాశయాంత్ర వైద్యులు ఇజిజిని క్రమబద్ధంగా వినియోగిస్తున్నారు. వారిలోని కొందరే ప్రస్తుతం పై పరికరం అభివద్ధితో చారిత్రాత్మక పరిశోధనను సాధించారు. ఈ కొత్త సాంకేతికత నిజానికి 1990లలోనే క్లినికల్‌గా విజయవంతమైంది. తొలుత ప్రపంచ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు దీనిపట్ల పెద్ద ఆసక్తిని చూపలేదు. 3సిపిఎం అనే ఒకే ఒక కంపెనీ ఇప్పటికీ ఇజిజి వ్యవస్థలను మార్కెటింగ్ చేస్తుండగా, 2000 సంవత్సరంలో కేవలం 10 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కానీ, పై పరిశోధన ఫలితంగా ఇవాళ్టికి అమ్మకాలలో ఒకింత వేగం పుంజుకున్నట్టు చెబుతున్నారు. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 45 యూనిట్ల ఇజిజి యంత్రాలు అమ్ముడైనట్లు అంచనా.