ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం

అతి చిన్న వయస్సులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన

స్వాతి భవాని పోట్ల

పట్టుదల, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం ఈ మూడు ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు. సోషల్‌ మీడియా, సినిమాలు, షికార్లు, సరదాలు ఇవన్నీ ముఖ్యమే… కేటాయించే సమయాన్ని సమర్థంగా వినియోగించుకున్నప్పుడే లక్ష్యానికి చేరువవుతాం అని చెబుతున్నారు అతి పిన్న వయస్సులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన స్వాతి భవాని పోట్ల(23). ఇటీవల తెలంగాణ హైకోర్టు 67 పోస్టులకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ద్వితీయ ర్యాంకు సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.

కలెక్టర్‌ అవుదామనుకున్నా…

‘చిన్నప్పటి నుంచి సోషల్‌సైన్సెస్‌ సబ్జెక్టులంటే ఇష్టం. అప్పటి నుంచే సామాజికాంశాలపై అవగాహన పెంచుకున్నా. సైనిక్‌పురిలోని భవన్స్‌లో పాఠశాల, ఇంటర్‌(సీఈ) విద్య పూర్తి చేశాను. సివిల్స్‌పై దష్టిపెట్టా. లా ఆప్షన్‌గా ఎంచుకున్నా. 2018లో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నా. 2018లో లాసెట్‌లో రాష్ట్రస్థాయిలో నాల్గో ర్యాంకు సాధించా. 2019లో నిర్వహించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి మౌఖిక పరీక్షలో ద్వితీయ ర్యాంకు సాధించా.

లక్ష్యం పూర్తయ్యాకే ఆహారం

లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే పూర్తి చేసే వరకు ఊరుకోను. మొదటి ర్యాంకు రావాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమించా. నా గదిలో మొదటి ర్యాంకు అని బోర్డుపై రాసుకున్నా. రోజూ కొంత సిలబస్‌ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. పూర్తయ్యాకే మంచినీరు, ఆహారం తీసుకునేదాన్ని.

సామాజిక మాధ్యమాల్లోనూ చురుకే..

చదువు వినోదానికి ఏ మాత్రం అడ్డంకి కాదని నమ్ముతా. రోజంతా సామాజిక మాధ్యమాల్లో, సినిమాల్లో, ఇతర వ్యాపకాల్లో గడిపినా చదివేందుకు కేటాయించిన సమయాన్ని పక్కాగా వినియోగించుకుంటే చాలు. సోషల్‌ మీడియాలో 2,500 మంది నన్ను అనుసరిస్తున్నారు.

కుటుంబంలో మొదటిదాన్ని…

మా కుటుంబంలో న్యాయవాద వత్తిలో ఎవరూ లేరు. మొదటి వ్యక్తిగా, అదీ న్యాయమూర్తిగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. నాన్న సత్యనారాయణ కంప్యూటర్స్‌ వ్యాపారి. అమ్మ రైల్వే ఉద్యోగిని. చెల్లి స్వాతి శివాని నన్నెప్పుడూ ప్రోత్సహిస్తుంటుంది.

స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు..

స్త్రీ, పురుషులిద్దరూ సమానమే. మహిళలపై అకత్యాలు పెరగడానికి స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అని వాదిస్తున్నారు. ఇది మంచి అభిప్రాయం కాదు. స్వేచ్ఛ అనేది ఎవరో ఇచ్చేది కాదు. అది అందరి హక్కు. ఆడవాళ్లకు ఆత్మరక్షణపై శిక్షణ ఇవ్వాలి. భావోద్వేగాలు వ్యక్తపరిచేలా, సమయస్ఫూర్తితో మెలిగేలా తయారు చేయాలి.

వారి స్ఫూర్తే మార్చింది…

ఇంటర్న్‌షిప్‌ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ కె.ఎస్‌.రాధాక ష్ణన్‌, ప్రస్తుత అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌లకు నా సీవీ పంపాను. పంపిన వెంటనే అనుమతి ఇవ్వడంతో ఇంటర్న్‌షిప్‌ వారి వద్ద పూర్తి చేశాను. వారి నుంచి చాలా అంశాలను నేర్చుకున్నా. పేదల పక్షపాతి అని న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడకు మంచి పేరుంది. వీరి స్ఫూర్తే నన్ను ఈ స్థానానికి చేర్చిందని నమ్ముతా.

ఇదీ ప్రస్థానం…

మాది మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ప్రాంతం. కుటుంబం 30 ఏళ్ల క్రితమే నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఆర్కేపురంలోని శక్తినగర్‌లో స్థిరపడింది. ప్రాథమిక, ఉన్నత, ఇంటర్‌ విద్యాభ్యాసం భవన్స్‌లో పూర్తి చేశా.

చదువు రెండుమూడు గంటలే..

ఇంతటి ప్రాముఖ్యమైన పరీక్షకు స్వాతి పోట్ల కేటాయించింది కేవలం రెండు నుంచి మూడు గంటల సమయమే. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టకుండా.. చదివిన సబ్జెక్టులను ఎక్కువగా రివిజన్‌ చేసుకునేవారు. తనకు ఎప్పుడు చదువాలనిపిస్తే.. అప్పుడే చదివేవారు. మిగతా సమయం కుటుంబానికి, స్నేహితులకు, సోషల్‌ మీడియాకు కేటాయించేవారు. స్కూల్‌, కాలేజ్‌లోనూ ఎప్పుడూ టాపర్‌గాను నిలువలేదు. బట్టిపట్టి చదివే విధానానికి తాను పూర్తిగా వ్యతిరేకమని అంటున్నారు స్వాతి. ఇంట్లో బోర్డుపై ఫస్ట్‌ ర్యాంక్‌ అని రాసుకున్నారు. దాన్ని ఎలాగైనా సాధించాలని రోజులో తానేం చదువాలో నిర్ణయించుకొని.. ఆ సిలబస్‌ను పూర్తి చేసేవారు. సోషల్‌మీడియాలో మనోధైర్యం నింపే ఆధ్యాత్మిక, పాజిటివ్‌నెస్‌ పోస్టులు పెడుతుంటారు. చదువుతోపాటుగా ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. చిన్నప్పటి నుంచి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి అయిన స్వాతి.. సౌత్‌జోన్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. వీటితోపాటుగా ఒంటరి ప్రయాణాలంటే చాలా ఇష్టం. దేశంలోని ప్రముఖ ప్రాంతాలన్నింటినీ చుట్టేశారు.

చిత్తశుద్ధితో వ్యవహరిస్తా

నా వత్తిలో ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా.. చిత్తశుద్ధితో నా విధులు నిర్వర్తిస్తా. నాకు ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చినా.. సంతోషంగా వెళ్లి నా దేశ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా కతజ్ఞతలు. ఫ్యామిలీ నా కోసం చాలా కష్టపడింది. ఇంట్లో చిన్నప్పుడే కంప్యూటర్‌ ఉండడం బాగా కలిసొచ్చింది. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా నాన్న చాలా ఓపికతో సమాధానం చెప్పేవారు. తర్వాత నాన్నను విసిగించకుండా కంప్యూటర్‌తో కుస్తీపట్టా. ఎన్నో విషయాలు తెలుసుకున్నా, చాలా కేసుల గురించి ఆరా తీశా. అమ్మానాన్న ఇచ్చిన స్వేచ్ఛను మేం సద్వినియోగం చేసుకున్నాం. అదే నాకు గర్వంగా అనిపిస్తుంది అంటారు స్వాతి భవాని.

వారిచ్చిన ధైర్యమే..

స్వాతి భవానికి ప్రతి విజయంలోనూ ఆమె కుటుంబం అండగా నిలిచింది. ఆడపిల్ల కదా అని.. నిబంధనలు పెట్టకుండా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. వారి తర్వాత అంతటి ప్రోత్సాహాన్ని అందించిన వారు సాధ్యం ఇనిస్టిట్యూట్‌ టీచర్‌ సతీష్‌. జడ్జిల పరీక్షకు కోచింగ్‌ తీసుకునేటప్పుడు.. ఆమెలోని ప్రతిభను గుర్తించి ఖచ్చితంగా జడ్జిగా ఎంపికవుతావు అని స్వాతికి చెప్పారట సతీష్‌. స్వాతిపై ప్రత్యేక దష్టిపెట్టి.. ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. తల్లిదండ్రులది మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌. వారి కుటుంబం 30 ఏండ్ల క్రితమే నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఆర్కేపురంలోని శక్తినగర్‌లో స్థిరపడింది. అమ్మ పద్మప్రియ రైల్వే ఉద్యోగి, చెల్లి స్వాతి శివాని బీబీఏ చదువుతున్నది. నాన్న కంప్యూటర్స్‌ వ్యాపారం చేస్తుంటారు. మా కుటుంబంలో న్యాయవాద వ త్తిలో ఎవరూ లేరు. నా కూతురు న్యాయమూర్తిగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ఎంతోమంది ఫోన్లు చేసి అభినందలు తెలుపుతున్నారు అని స్వాతి తండ్రి సత్యనారాయణ చెబుతున్నారు.