ముషారఫ్‌కు మరణశిక్ష
తీవ్రమైన దేశద్రోహం కేసులో దోషిగా తేల్చిన పెషావర్ ప్రత్యేక కోర్టు
- -కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు
- -1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా
- -అమ్కెలాయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న మాజీ అధ్యక్షుడు
- -2013లో నవాజ్ షరీఫ్ నేతత్వంలో రాజద్రోహం కేసు నమోదు
- -2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించిన ముషారఫ్
- -మరణశిక్షకు గురైన రెండో అధ్యక్షుడు ముషారఫ్
- -గతంలో మరణశిక్షకు గురైన మరో అధ్యక్షుడు భుట్టో
- -2016 మార్చిలో పాక్ విడిచి వెళ్లిపోయిన ముషారఫ్
- – అనారోగ్య కారణాల రీత్యా దుబాయిలో చికిత్స పొందుతున్న ముషారఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తీవ్రమైన రాజద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్ ప్రత్యేక కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు చెప్పింది. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ నేత త్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. డిసెంబర్ 17 నాటికి ఇరు వైపులా వాదనలు పూర్తైనా, కాకపోయినా తుది తీర్పు వెలువరిస్తామని ప్రత్యేక కోర్టు ఇంతకు ముందే స్పష్టం చేసింది. 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌లో పాలన సాగించిన ముషారఫ్.. ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచు కుంటున్నారు. అరుదైన అమ్కెలాయిడోసిస్ వ్యాధి కారణంగా ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నారు.
2013లో నవాజ్ షరీఫ్ నేతత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది న్యాయమూర్తులను ఆయన ఇళ్లలలోనే నిర్బంధించారు. దాదాపు 100 మందికి పైగా న్యాయమూర్తులను తొలగించి పాలన సాగించారు. కాగా రాజద్రోహం కేసులో ఓ మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. అంతకుముందు మాజీ అధ్యక్షుడు భుట్టోని కూడా ఉరితీశారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు ఈ మరణశిక్ష విధించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్థాన్‌లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గ హ నిర్బంధం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో 2013 డిసెంబరులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ జరుగుతుండగానే 2016 మార్చిలో ముషారఫ్ పాక్ విడిచి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. ముషారఫ్ న్యాయస్థానానికి రాలేదు. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ముషారఫ్‌కు మరణశిక్ష విధించడాన్ని ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించగా.. ఒక న్యాయమూర్తి వ్యతిరేకించారు. ప్రస్తుతం ముషారఫ్ అనారోగ్య కారణాల రీత్యా దుబాయిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఓ దేశాధ్యక్షుడికి మరణశిక్ష విధించింది పాక్ ప్రభుత్వం. 1999 నుంచి 2008 వరకు పాక్ కు అధ్యక్షుడిగా వ్యవహరించిన ముషారఫ్ కు లాహోర్ కోర్టు మరణ దండన విధించింది.తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు.. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారనే అభియోగాలు ముషారఫ్ పై ఉన్నాయి.
సుదీర్ఘంగా ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయవాదుల బెంచ్.. ఎట్టకేలకు అతడ్ని నిందితుడిగా ప్రకటించింది.దీంతో లాహోర్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.ఒక దేశాధ్యక్షుడికి మరణశిక్ష విధించడం పాక్‌లో ఇదే రెండోసారి.గతంలో పాక్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే.
2007 నవంబర్ 3న ఎమర్జెన్సీ విధించారు ముషారఫ్. ఆ టైమ్ లో ఆయన నిరంకుశ పాలన చేశారనేది ప్రధాన అభియోగం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అరెస్టులు చేశారని.. విపక్ష నేతలతో పాటు లాయర్లను జైళ్లో పెట్టారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.2013లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముషారఫ్ పై విచారణ చేపట్టింది.
అదే ఏడాది తొలిసారిగా ఆయనదై తీవ్రమైన దేశద్రోహం కేసు నమోదైంది. తనపై కేసు నమోదైన తర్వాత కేవలం ఒకే ఒక్కసారి ముషారఫ్ కోర్టుకు హాజరయ్యారు.ఆ తర్వాత ఏ ఒక్క విచారణకు ఆయన హాజరుకాలేదు. పైగా, అనారోగ్య కారణాలతో 2016 మార్చిలో ఆయన దేశం విడిచి వెళ్లారు.
ఆ టైమ్ లో ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ నుంచి ఆయన పేరును తొలిగించడం పెద్ద వివాదానికి దారితీసింది. దేశద్రోహం కేసు నమోదైన వ్యక్తిని ఎలా దేశం నుంచి బయటకు వెళ్లడానికి సహకరిస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి.దేశం విడిచి వెళ్లిన ముషారఫ్ అప్పట్నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు.
తాజాగా కూడా ఆయనకు నోటీసులు ఇవ్వగా.. ఓసారి దుబాయ్ వచ్చి తన ఆరోగ్య పరిస్థితిని చూడాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు ముషారఫ్. పాకిస్థాన్ కు తను చేసిన సేవల్ని గుర్తించాలని, పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇది జరిగిన కొన్నాళ్లకే ముషారఫ్ కు మరణశిక్ష ఖరారుచేస్తూ లాహోర్ కోర్టు తీర్పునిచ్చింది.అంతా బాగానే ఉంది కానీ, ముషారఫ్ ను దుబాయ్ నుంచి పాక్ కు తీసుకురావడం చాలా కష్టం.
ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం అది అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. ఓ వ్యక్తిని విచారణ కోసం అప్పగించమని అడిగితేనే దుబాయ్ చట్టాలు ఒప్పుకోవు. అలాంటిది మరణశిక్ష విధిస్తాం అప్పగించమంటే ఆ ప్రభుత్వం అస్సలు అంగీకరించదు.
ముషారఫ్ కు దుబాయ్ పౌరసత్వం కూడా లభించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే అవి నిర్థారణ కాలేదు.1965లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఇండోపాక్ వార్ లో కూడా సైనిక జనరల్ గా ముషారఫ్ దే కీలక పాత్ర. సియాచిన్ వివాదం, కార్గిల్ వార్ కు ప్రధాన కారకుడు ఇతడే. 1996-2001 మధ్య ఆఫ్ఘనిస్థాన్ లో తలెత్తిన ప్రచ్ఛన్న యుద్ధం వెనక ముషారఫ్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం.ప్రస్తుతం ముషారఫ్ వయసు 76 సంవత్సరాలు.
సొంత దేశంపై కుట్ర పన్నారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది పాకిస్థాన్ స్పెషల్ కోర్టు. 2007లో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎమర్జెన్సీ విధించినట్లుగా కోర్టు నిర్ధారించింది. దీన్ని దేశద్రోహంగా భావిస్తూ మరణశిక్ష విధించింది. సైనికాధికారిగా ఉన్న ముషారఫ్ దేశాన్ని తన పాలనలో సుదీర్ఘ కాలం ఉంచుకున్నారు. 2001 నుండి 2008 వరకూ పాకిస్థాన్‌ను పరిపాలించారు. మొదట సైనిక పాలకుడిగా ఉన్నా తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. తర్వాత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో దేశం విడిచి వెళ్లిపోయారు. దేశద్రోహానికి పాల్పడ్డారని.. 2013లో ముషారఫ్‌పై కేసు నమోదయింది. అప్పటి నుండి జరుగుతోన్న విచారణలో ఆయనకు దేశద్రోహం కేసులో శిక్ష పడుతుందన్న క్లారిటీ రావడంతో అనారోగ్య కారణాలతో చికిత్స కోసం 2016లో దుబాయ్ చేరారు.
తర్వాత కోర్టు ముందు హాజరు కాలేదు. దాంతో ఆయనను పరారీలో ఉన్నట్లుగా పాకిస్థాన్ కోర్టు ప్రకటించి ఇప్పుడు ఏకంగా మారణ శిక్ష విధించింది. దుబాయ్‌లో ఉన్న ముషారఫ్ తన ఆసుపత్రి మంచం నుండి ఒక వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు, ఈ కేసులో తన వాదన వినిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ”ఒక జ్యుడీషియల్ కమిషన్ ఇక్కడకు వచ్చి తనను వినాలి అని కోరారు. నా ఆరోగ్య పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకోవాలి అన్నారు. తన జీవితాంతం పాకిస్థాన్‌కు సేవ చేశానని పాకిస్తాన్ బాగు కోసమే పని చేశానని వీడియో సందేశంలో చెప్పారు. ముషారఫ్ ఆరోగ్యం క్షీణించడం, ప్రాణాంతక వ్యాధులు ఉండటం వల్ల అతని వద్ధ తల్లి కారణంగా, అతను పాకిస్తాన్‌కు తిరిగి రాలేను అని చెబుతున్నాడు. మరి దీనికి పాక్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.