కమలంతో ఇక సమరమే..!!
నిధుల కోసం కేంద్రాన్ని నిలదీస్తున్న టీఆర్‌ఎస్: కీలక బిల్లులకు మోకాలడ్డు
- -గతంలో కీలక బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు
- -పార్లమెంటులో క్యాబ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్
- -తెలంగాణకు రావలసిన నిధులపై ఆగ్రహం
- -వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు
- -కాళేశ్వరం, మిషన్ భగీరధలకు నిధులు ఇవ్వని కేంద్రం
- -జీఎస్టీ కింద రాష్ట్రానికి రావలసినది రూ.4,531 కోట్లు
- – పట్టణ స్థానిక సంస్థలకు రావలసినవి రూ.393 కోట్లు
- -కేంద్ర మంత్రులను కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
- -రావలసిన నిధులపై స్వరం పెంచిన ప్రజాప్రతినిధులు
మోడీ ప్రభుత్వానికి అన్ని అంశాల్లో దోస్తీ అంటూ ముందుకొచ్చిన టీఆర్‌ఎస్ స్టాండ్ మారింది. పౌరసత్వ బిల్లు విషయంలోనూ ఎన్డీయేకి వ్యతిరేకంగా ఓటు వేసింది టీఆర్‌ఎస్. దీనిక్కారణం తెలంగాణకు రావాల్సిన నిధుల జాప్యమే. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు 40వేల కోట్లు రూపాయలు వెళ్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చి నట్టే పన్నుల ఆదాయంలో 50శాతం వాటా నిధులు తెలంగాణకు ఇవ్వాలి. కానీ, సగం కూడా ఇవ్వడం లేదన్నది టీఆర్‌ఎస్ వాదన. పైగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయా హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా కేంద్రం అసలు పట్టించుకోలేదు. ఇక ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మిషన్ భగీరధకు 9 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారస్ చేసినా..కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు.
హైదరాబాద్:
స్టేట్‌లో పార్టీ టు పార్టీ లైన్. కేంద్రంతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ లైన్. బీజేపీతో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహమిది. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంగానే భావిస్తూ వచ్చింది టీఆర్‌ఎస్. అటు బీజేపీ కూడా అంశాల వారీగా ప్రభుత్వంతో లడాయి కొనసాగిస్తూనే వస్తోంది. అయితే..కేంద్రంతో మాత్రం సానుకూల ధోరణితో ఉండేది. అక్కడ సెంటర్ గవర్నమెంట్..ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. రెండు ప్రభుత్వాలు ప్రజోపయోగంగా ఉండాలన్ని కేసీఆర్ స్టాండ్. కేంద్రంతో సానుకూలంగా ఉంటూనే నిధులు రాబట్టుకోవాలనే నిరీక్షణ అయనది. అందుకే కేంద్రంలో బీజేపీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా టిఆరెస్ మద్దతు తెలుపుతూ వచ్చింది. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ఆర్టీకల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ ఇలా కీలకమైన బిల్లులకు మద్దతివ్వటంతో ఎన్డీయే పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. బీజేపీతో రహస్య స్నేహమంటూ విమర్శలు వచ్చిన లెక్కచేయలేదు టీఆర్‌ఎస్.
మోడీ ప్రభుత్వానికి అన్ని అంశాల్లో దోస్తీ అంటూ ముందుకొచ్చిన టీఆర్‌ఎస్ స్టాండ్ మారింది. పౌరసత్వ బిల్లు విషయంలోనూ ఎన్డీయేకి వ్యతిరేకంగా ఓటు వేసింది టీఆర్‌ఎస్. దీనిక్కారణం తెలంగాణకు రావాల్సిన నిధుల జాప్యమే. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు 40వేల కోట్లు రూపాయలు వెళ్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చి నట్టే పన్నుల ఆదాయంలో 50శాతం వాటా నిధులు తెలంగాణకు ఇవ్వాలి. కానీ, సగం కూడా ఇవ్వడం లేదన్నది టీఆర్‌ఎస్ వాదన. పైగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయా హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా కేంద్రం అసలు పట్టించుకోలేదు. ఇక ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మిషన్ భగీరధకు 9 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారస్ చేసినా..కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు.
ఎకానమీ అంశాలే కాదు..పొలిటికల్ గా కూడా బీజేపీతో టీఆర్‌ఎస్ కు కొన్నాళ్లుగా పొసగటం లేదు. ముందస్తు ఎన్నికల నాటి నుంచే టీఆర్‌ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. అప్పట్లో కమలానికి మైలేజి రాకపోయినా లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో సీన్ మారింది. నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన నాటి నుంచి అధికార టిఆరెస్ ను బిజేపి టార్గెట్ చేసింది. రాబోయే ఎన్నికల్లోగా రాష్ట్రంలో పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇదే క్రమంలో కేంద్రం నుంచి అడపా దడపా వస్తున్న బీజేపీ పెద్దలు..కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అభివ ద్ధి చేయట్లేదంటూ ఆరోపలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు ఈ ఐదేళ్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని..ఇప్పటివరకు విడులైన నిధులెన్నో లెక్క తేల్చే పనిలో ఉంది టీఆర్‌ఎస్. బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని చెప్పేందుకు కేసిఆర్ సిద్దమైయ్యారు. అవసరమైతే అసెంబ్లీని ప్రత్యేక సమావేశం పెట్టి కేంద్రం తీరును ఎండగట్టాలనే యోచనలో ఉన్నారు. ఇప్పుడే సీన్ ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కమలంతో గులాబీ కయ్యం రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రప్రభుత్వంపై వత్తిడి పెంచి మరిన్ని నిధులు తెచ్చుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు వివిధశాఖల కింద రావాల్సిన నిధులను వెంటనే విడుదలచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు.
జీఎస్టీ కింద రాష్ట్రానికి రూ.4,531 కోట్లు విడుదల కావాలని, రాష్ట్ర విభజన చట్టం కింద వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు, స్థానిక సంస్థలకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.135 కోట్లు, 2019-20కి సంబంధించి రూ.177 కోట్లు విడుదలకావాలని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలకు రూ.393 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ప్రకారం.. రూ.24,205 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం రాష్ట్రం పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు. కేంద్రం నిధుల విడుదల జాప్యం ప్రభావం రాష్ట్ర అభివద్ధి పనులపై పడుతుందని నామా తెలిపారు. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రాలపై పడుతుందని, కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని.. నిధుల విడుదలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు. కోదాడ- ఖమ్మం రహదారిని భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చాలని, నాలుగు లైన్లుగా విస్తరించాలని ఆయన కోరారు.
కేంద్రం తెలంగాణ వినతులకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రప్రభుత్వం పొదుపు చర్యలను చేపడుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రిత్వ శాఖలకు సీఎం కేసీయార్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమతి.. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికి దిగిందా? కేంద్రం నుంచి తెలంగాణకు అందాల్సిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలను దీనికి కేంద్ర బిందువుగా మారిందా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. జీఎస్టీ వాటాల రూపంలో తెలంగాణకు వేల కోట్ల రూపాయల మేర బకాయిలు అందాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఆ నిధులను కేటాయించట్లేదనేది టీఆర్‌ఎస్ వాదన. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు రావాలి? దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత ఆయా నిధులన్నీనేరుగా కేంద్రప్రభుత్వానికే చేరుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కేంద్రమే ఆ నిధులను రాష్ట్రాలకు మళ్లిస్తుంది. జీఎస్టీ వాటా కింద తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతం 4,531 కోట్ల రూపాయలు అందాల్సి ఉంది. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినంత రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధుల కోటా మాత్రమే. కేంద్రానికి కేసీఆర్ లేఖ రాసినా.. ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మొత్తం 19,719 కోట్ల రూపాయలను కేంద్రం ఇప్పటికిప్పుడు తెలంగాణకు మంజూరు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నవంబర్ వరకు కేంద్రం నుంచి తెలంగాణకు విడుదలైన జీఎస్టీ వాటా 10,558 కోట్ల రూపాయలు మాత్రమేనని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాలుగు రోజుల కిందటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ సైతం రాశారు.
బదులివ్వని కేంద్రం..
స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే చొరవ తీసుకుని నిధుల వాటాను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసినప్పటికీ.. పట్టించుకోలేదనేది టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యుల ఆరోపణ. నిధులను కేటాయించలేకపోతే.. ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయంపై పార్లమెంట్ సాక్షిగా వివరణ ఇవ్వాలనేది వారి డిమాండ్. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు.