బాల ప్రతిభా గ’ఘన్‌’ హరిహర నందన్‌

27 అంశాలలో అనర్గళ ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న బాల మేధావి

చిన్నారులలో చిరుత అతడు..అతడు సాధించిన రికార్డులను చూస్తే గిన్నిస్‌ బుక్‌ సైతం అవాక్కవ్వాల్సిందే..పెద్దగా ప్రచారానికి ఒప్పుకోని ఈ బుడతడిని జ్యోతి ప్రత్యేక ప్రతినిధి కలిసి అతడి తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి అతనికి వచ్చిన రికార్డులను రాసుకోవడానికే కనీసం ఐదారు గంటలు పట్టిందంటే అతగాడి ప్రతిభాపాటవాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ప్రపంచ మేధావిగా పరిచయమవుతాడంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. 11 సంవత్సరాలకే 27 అంశాలలో అనర్గళంగా పేరు తెచ్చుకున్న ఈ చిరంజీవికి 27 నక్షత్రాల గురించి…రాశిఫలాల గురించి…జ్యోతిష్య, పురాణ వేద విజ్ఞానాలను పుక్కిటపట్టిన బాల శౌనక మునిలా కనిపించడం విశేషం. చూడగానే ముఖంలో ఓ దైవిక శక్తి, ఆధ్యాత్మిక కళ సంతరించుకున్న ఓ బాల వివేకానందుని తేజస్సు కనిపిస్తుంది. డిసెంబర్‌ 9న ఈ బుడతడు తన జన్మదినం జరుపుకుంటున్నాడు. ఇంతకీ ఆ సకలకళా సారస్వత బాల మేధావి ఎవరంటే ఈడ్పుగంటి హరిహరనందన్‌. మరి అతని గురించి తెలుసుకుందామా…


2008 తెలంగాణలో 2008 డిసెంబర్‌ 9న జన్మించిన ఈడ్పుగంటి హరిహర నందన్‌..
తల్లిదండ్రులు ఈడ్పుగంటి నందకిషోర్‌, డా. పద్మజారాణి. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన హరిహర నందన్‌ తల్లి బహుముఖ ప్రజ్ఞాశాలి, జ్యోతిష్య శాస్త్రాన్ని ఔపాసన పట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఎంఏ పట్టభద్రురాలయిన తొలి తెలంగాణ మహిళా జ్యోతిష్యురాలు. ప్రతిభ, మేధస్సు కలబోసిన మహిళారత్నం. నందన్‌ తండ్రి నందకిషోర్‌ బ్యాంకు ఉద్యోగి. ఇలాంటి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన బుడతడు తనకంటూ ఓ ఇమేజ్‌ని తనచుట్టూ ఏర్పరుచుకుని…తన అసమాన ప్రతిభతో అవాక్కయ్యేలా చేస్తున్నాడు.
హైదరాబాద్‌ బచ్‌పన్‌ ప్లే స్కూలులో ప్రాథమిక విద్య, ముంబై పోవాయి ఐఐటీ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతివరకూ అభ్యసించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుకుంటున్న ఈ బుడతడు ఎల్‌కేజీ నుండి ఇప్పటిదాకా పరీక్షలలో అగ్రగామిగా నిలుస్తూ వచ్చాడు.
సాధారణంగా భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. రూపురేఖలిస్తే ధనసంపదలనివ్వడు. ఒక్కోసారి సరస్వతీ కటాక్షం కూడా ఉండదు. లేకపోతే ఏదో ఒక లోటు కూడా ఉంటుంటుంది. కానీ హరిహర నందన్‌కు అందం, చదువు, సంస్కారం, ఎన్నో రంగాలలో ప్రవేశం అన్నీ పూర్వజన్మ సుకృతం. తల్లిదండ్రుల పుణ్యఫలంగా పుట్టాడు. నాలుగయిదేళ్ల వయసులో పిల్లలు సాధారణంగా ఆటలపై మనసుపెడతారు. పిల్లవాడికి సరస్వతీదేవి కటాక్షం ఏమోగానీ జ్యోతిష్య శాస్త్రంపై ఇష్టం ఏర్పడి అందులోకి ప్రవేశించాడు. కేవలం జ్యోతిష్యం, పుస్తక పఠనం అందులోనే ఆగలేదు. మార్షల్‌ ఆర్ట్స్‌లో కరాటే పట్ల తనకు ఆసక్తి ఉందని తల్లిదండ్రులకు చెప్పి చిన్న వయసులోనే బ్లాక్‌బెల్ట్‌ వరకూ వెళ్లిపోయాడు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అలాగే పదేళ్ల పిల్లలు అంటే పంచాంగం అంటే తెలియని వయసు. మనం ఎన్నిసార్లు నేర్పినా తిథి ఏమిటో చెప్పలేని స్థితి. అలాంటిది ఆ వయసులో పంచాంగ శ్రవణం చేయడం అంటే ఆషామాషీ కాదు. అదికూడా ఇంట్లోవారి ముందు, స్నేహితుల వద్ద కాదు. ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు తడబడకుండా పంచాంగ శ్రవణంన చేసిన ఘనత మాస్టర్‌ హరిహర నందన్‌దే. పదేళ్లు నిండకుండానే ఘనతలు అమోఘం.

27 రంగాలలో రాణించిన నందన్‌

1. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ హోల్డర్‌ చిన్నవయసులోనే..ముంబై-2018
2. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి ‘మల్టీ టాలెంటెడ్‌ కిడ్‌’ (మార్షల్‌, స్పిరిట్యుయల్‌) 2018
3.సంఖ్యాశాస్త్రంలో ‘పిక్‌ యువర్‌ సన్‌షైన్‌’ ఆంగ్ల పుస్తకం రాశాడు (2018).
4.ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి రామాయణంపై అన్ని కాండాలు, ఆంగ్లంలో కూడా అనర్గళంగా చెప్పి రికార్డు సాధన 2019
5. మహాత్మా జ్యోతిరావు పూలే నేషనల్‌ అవార్డ్‌ (చైల్డ్‌ కేటగిరి) (పీపుల్‌ సోషల్‌ సర్వీస్‌ ..ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ప్రభుత్వ గుర్తింపు కలిగిన సంస్థ)
6.నాలుగు సంవత్సరాల వయసునుంచే తల్లితో కలిసి పంచాంగ శ్రవణం టీవీలలో)
7.చిన్నబాలుడు వ్యక్తిగతంగా పంచాంగ శ్రవణం చేయడంలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-2020
8.తల్లీతనయుల జోడియాక్‌ బంధంపై ఆంగ్ల పుస్తకం రచన. (సంఖ్యాశాస్త్రం)
9.థర్డ్‌ ఇండో శ్రీలంక ఇంటర్నేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ 2017, ఖాతా, కుమితి గోల్డ్‌ మెడల్స్‌.
10.రెండుసార్లు కరాటేలో వరుసగా బెస్ట్‌ మేల్‌ క్రెడిట్‌ అవార్డ్‌ (ఐఐకెఎఫ్‌) ముంబై నుంచి 2017, 2018
11. కరాటేలో గ్రాండ్‌ ఛాంపియన్‌ షిప్‌ అండర్‌ 13 బాలుర ట్రోఫీ
12. కాటా మరియు కుమిటేలో బంగారు పతకాలు (ఛాంపియన్‌షిప్‌, టోర్నమెంట్‌) ముంబాయ్‌ 2019
13 తెలంగాణ నుంచి పాల్గొని ట్రోఫీ అందుకున్న అతి పిన్న వయస్కుడు (అవుట్‌ స్టేట్‌ పార్టిసిపేట్‌) స్వాభిమాన్‌ భారత కప్‌ 13వ ఐఐకెఎఫ్‌ (అంతర్జాతీయ ఇండో -రియో కరాటే డో ఫెడరేసన్‌ ముంబై) 2019
14.ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ (యుకె) ఆఫ్‌ రికార్డుల్లో 9 విభిన్న రంగాలలో తొలి వండర్‌ కిడ్‌గా నమోదు 2019.
15.ఆదిత్య హృదయం నిమిషంలో అతి ఎక్కువసార్లు పఠించిన బాలుడుగా రికార్డ్‌ నమోదు ఇండియా బుక్‌ ఆఫ్రికార్డ్స్‌ 2020
16. జ్యోతిష్యపరమైన వివిధ రకాలైన రెమిడియల్‌ శ్లోకాలను ఆంగ్ల భాషలో వివరణ ఇచ్చిన చిన్న బాలుడిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ 2020
17. మొదటి మల్టీ టాలెంటెడ్‌ కిడ్‌ జోడియాక్‌ రైటర్‌గా ఇండియా బుక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు 2020.
18. తల్లితో కలిసి పంచాంగ శ్రవణం చేసిన చిన్న బాలుడిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు 2020
19. చిరుప్రాయంలోనే మల్టీ టాలెండెడ్‌గా ‘రజిత గండపేరుండం’ గ్రహీత 2019
20. ఇండియా స్టార్‌ ప్రౌడ్‌ అవార్డ్‌ (లిటిల్‌ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌-షోధన్‌ ఇన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) ఇండియా స్టార్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌
21. కలాంబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ (మల్టీ టాలెంటెడ్‌ మదర్‌ అండ్‌ మల్టీ టాలెంటెడ్‌ సన్‌) కలాం బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ (చెన్నై).
22. యూనిక్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ (ట్రీ ప్లాంటేషన్‌) 2014
23.ఇండియా స్టార్‌ ఫ్యాషన్‌ అవార్డ్‌ (లిటిల్‌ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌-షోదన్‌ ఇన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌
24. కవర్‌ పేజీ మోడలింగ్‌ (తెలుగు, హిందీ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ)
25. సన్‌ అండ్‌ మదర్‌ ర్యాంప్‌ వాక్‌ షో (ఫస్ట్‌ రన్నరప్‌ తెలంగాణ వండర్‌ కిడ్‌ ఫ్యాషన్‌ షో) హైదరాబాద్‌
26.మదర్‌ విత్‌ సన్‌ సేమ్‌ స్టేజీ అవార్డ్స్‌ (నాన్‌ స్టాప్‌ అవార్డ్స్‌ రిసీవింగ్‌ ఎలాంగ్‌ మదర్‌)
27. ఎక్స్‌ట్రార్డనరీ టాలెంట్‌ అవార్డ్‌ (మార్షల్‌ ఆర్ట్స్‌-స్పిరిట్యుయాలిటీ) జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌ 2019
ఇంతేకాకుండా నెంబర్లపై న్యూమరాలజీలో బుద్దునిపై, కృష్ణుడిపై పుస్తక రచన, రామాయణం, భారతం, భాగవతం మొదలైన వాటిపై జ్యోతిష్య వాస్తు సంఖ్యా ఆధ్యాత్మిక శాస్త్ర రచనలలో గట్టిపట్టు. కరాటేలో భారత స్వాభిమాన గోల్డ్‌ మెడల్‌ మరియు సిల్వర్‌ మెడల్‌.
బాలజ్యోతి, బాల జ్యోతిష్య భాస్కర, క్యూట్‌ కిడ్‌, బాలరత్న, లిటిల్‌ కృష్ణ అవార్డు, టంగులూరి ప్రకాశం పంతులు అవార్డ్‌, స్మార్ట్‌ కిడ్స్‌ 2010 నుండి 2019 దాకా సత్కారాలు అవార్డులు 100కు పైగా.
కళానిలయం వార్షికోత్సవం సందర్భంగా రైసింగ్‌ స్టార& ఆఫ్‌ ఇండియా, మరియు శోభన్‌బాబు-లిటిల్‌ హ్యాండ్సమ్‌ అవార్డ్‌ 2019
శ్రీ లలితా కల్చరల్‌ అసోసియేషన్‌ వారి నుంచి ఉగాది సందర్భంగా ఉగాది నంది పురస్కారం మరియు లిటిల&-కిరో అవార్డు, సంఖ్యా శాస్త్ర పుస్తకావిష్కరణ-2019
అరిగెపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్‌ వారి ఉగాది రాష్ట్ర స్థాయి పంచరత్నాలు-సేవారత్న పురస్కారం, హైదరాబాద్‌ 2019.
చిత్రపురి హిల్స్‌ వారు నిర్వహించిన శ్రీరామనవమి కళ్యాణోత్సవాల సందర్భంగా శ్రీరాముని బాలకాండ నుంచి ఉత్తరకాండం ప్రవచనములు గౌరవ సత్కారం.