భారత్‌పై ఉగ్ర నేత్రం

అయితే కీలక నేతలు కాకుంటే చారిత్రక, పుణ్య ప్రదేశాలు టార్గెట్‌
  • -మోదీ, అజిత్‌దోవల్‌లు లక్ష్యంగా ఉగ్రసన్నాహాలు
  • -పీఓకే సరిహద్దుల్లో మాటువేసిన టెర్రరిస్టులు
  • – భారతదేశంపై కన్నేసిన తీవ్రవాదులు
  • -పావులు కదుపుతున్న పాక్‌ ముష్కరులు
  • -వారణాసిపై ఉగ్ర పంజా, నిఘావర్గాల సూచన
  • -మైసూరు దసరా ఉత్సవాలపై పోలీసు నిఘా
  • -ఉగ్రమూకల టార్గెట్‌ సౌత్‌ ఇండియాపై..
  • -తిరుపతి, శ్రీహరికోట, కోస్తాపై ఫోకస్‌
  • -పడవలపై గుజరాత్‌ తీరం నుండి ఎంట్రీ
  • -కలియుగ వైకుంఠంపై కన్నేశారా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ,జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ లు లక్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు పాకిస్థాన్‌ గూఢాచారి సంస్థ ఐఎస్‌ఐ, జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో స్పెషల్‌ స్క్వాడ్‌ ను ఏర్పాటు చేసినట్లు విదేశీ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఆర్టికల్‌ 370 ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రతీకార చర్యలో భాగంగా ప్రధాని, దోవల్‌ పై సంచలన దాడి చేయాలని పాక్‌ ప్రేరేపిత జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు వ్యూహం రూపొందించారని భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ దాడి గురించి జైషే మహ్మద్‌ కు చెందిన కరడుకట్టిన ఉగ్రవాది షంషేర్‌ వనీ చేతిరాతతో రాసిన ప్రతి ఇంటలిజెన్స్‌ వర్గాలకు లభించింది.సెప్టెంబరు నెలలో పెద్ద ఉగ్ర దాడికి పాక్‌ ప్రేరేపిత జైషే మహ్మద్‌ కుట్ర పన్నిన నేపథ్యంలో పోలీసులు దేశంలోని 30 నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. జమ్మూ, అమ త్‌సర్‌, పఠాన్‌కోట్‌, జైపూర్‌, గాంధీనగర్‌, కాన్పూర్‌, లక్నో నగరాలతోపాటు 30 నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలాకోట్‌ లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడిలో కీలక పాత్ర పోషించిన అజిత్‌ దోవల్‌ ను పాక్‌ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఆయనకున్న జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 5వతేదీ తర్వాత భారతదేశంలో పుల్వామా తరహా దాడులకు పాక్‌ ప్రేరేపిత జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఫిదాయిన్‌ లను పంపించి వ్యూహరచన చేశారని తేలడంతో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.
ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్‌ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్‌ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోమ్‌ శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్‌ షా ,సెక్యూరిటీ సలహాదారు అజిత్‌ దోవల్‌ లను మట్టుపెట్టేందుకు జైష్‌-ఏ-మహమ్మద్‌ సంస్థ కుట్ర చేస్తోందని ఐబీ వెల్లడించింది. ముఖ్యులను మట్టుబెట్టడంతోపాటు కాశ్మీర్‌ లోని పది చోట్ల భారీ ఉగ్ర దాడికి వ్యూహ రచన చేస్తోందని ఐబీ వెల్లడించింది.
అమెరికా మాదిరే భారత్‌లో కూడా 9/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోమ్‌ శాఖా దేశంలోని అన్ని ఎయిర్‌ పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశించింది. టూరిస్ట్‌ స్పాట్లలో భద్రత రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్‌ శాఖా సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత బలగాలు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పంజాబ్‌, హర్యానా, కాశ్మీర్‌ నుండి ఢిల్లీకి చేరే రహదారులతో పాటు కీలక మార్గాలలో పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. పఠాన్‌ కోట ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ తోపాటు దేశంలోని మరో మూడు ఎయిర్‌ బేస్‌ లకు భద్రతను పెంచారు. తాజా హెచ్చరిక గతంలో ఎన్నడూ లేనంత కీలక సమాచారం ఆధారంగా రావడంతో దేశవ్యాప్తంగా హై
దేశవ్యాప్తంగా ఉగ్రమూకల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిపై వారు కన్నేశారని తెలియడంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. సదరన్‌ కమాండ్‌ జీవోసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ ఇదే విషయాన్ని ధ వీకరించారు. ముఖ్యంగా భారతదేశానికి తలమానికం అయిన శ్రీహరికోట వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే ఏపీ తీరం వెంట గస్తీ ముమ్మరం చేశామని అదనపు డీజీపీ లా అండ్‌ ఆర్డర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ చెబుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ చెబుతున్నారు. పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో సరిహద్దుల్లోని సర్‌ క్రీక్‌ లేన్‌ వద్ద ఇటీవల గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నామని, దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న తీరప్రాంతాలు తీవ్రవాదుల టార్గెట్‌ అని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఆర్మీ సదరన్‌ కమాండ్‌ పరిధిలోకి గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయని, ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతోపాటు గుజరాత్‌ లోని కొన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తాయని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నిఘా వర్గాల సూచనలతో ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్లు ఏపీ అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ పేర్కొన్నారు.
అవసరమయిన చోట ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏపీలోని కేంద్రప్రభుత్వ రక్షణ సంస్థలు, వ్యవస్థ లున్న చోట పరిస్థితులపై తీరప్రాంత పోలీస్‌ స్టేషన్లతోపాటు ఎస్‌పీఎఫ్‌ విభాగాన్ని కంట్రోల్‌ రూం అప్రమత్తం చేసింది.
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల ఆలయం, శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అలాగే అత్యంత జనసమ్మర్థం ఉన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానా శ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని రవిశంకర్‌ వెల్లడించారు.
సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అనుమానాస్పదంగా తిరిగే పడవలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు, నేవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తం మీద ఉగ్రమూకలు తమ దాడులకు దక్షిణాది ప్రాంతాలు కీలకమని భావిస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్టికల్‌ 370 రద్దుని జీర్ణించుకోలేని పాకిస్తాన్‌..భారత్‌ను రెచ్చగొడుతోంది. మిలటరీ, దౌత్య పరంగా ఎదుర్కోవడం చేతగాక..ఇప్పుడు ఉగ్రవాదులనే నమ్మకుంది. టెర్రరిస్టులకు ట్రైనింగ్‌ ఇచ్చి భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు చేస్తోంది. అందుకోసం పీవోకే (పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌)లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, లష్కరో తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు ఆగస్టు నుంచి శిక్షణ ఇస్తున్నారని…దీనికి జమాత్‌ ఏ ఇస్లామీ నేత త్వం వహిస్తోందని వెల్లండించారు. దానికి సంబధించి పలు ఫొటోలను సైతం బయటపెట్టారు.
పీవోకేలో టెర్రర్‌ క్యాంప్‌

జమాత్‌ ఏ ఇస్లామీ మాజీ అధ్యక్షుడు ఇజాజ్‌ అఫ్జల్‌తో పాటు రావల్‌కోట్‌కు చెందిన జమాత్‌ ఏ ఇస్లామీ నేత అద్నాన్‌ రజాక్‌ ఆ ఫొటల్లో కనిపించారు. వీరు జైషే, హిజ్బుల్‌ టెర్రరిస్టులకు ఉగ్ర పాఠాలు బోధిస్తున్నారు. పోతి బాలా, తర్నూతి ప్రాంతాల్లోని రావల్‌కోట్‌ అడవుల్లో వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ క్యాంప్‌లను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండకుండా…ప్రాంతాలను మార్చిమార్చి శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నారు.
పీవోకేలో టెర్రర్‌ క్యాంప్‌
అక్కడ పెద్ద మొత్తంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌లోకి చొరబడేందుకు కుట్రలు చేస్తున్నారు. చొరబాటు ప్రయత్నాలకు హిజ్బుల్‌ కమాండర్‌ శంషేర్‌ ఖాన్‌ నేత త్వం వహిస్తున్నాడు. ఉగ్రచొరబాట్లకు పాకిస్తాన్‌ ఆర్మీతో పాటు ఐఎస్‌ఐ కూడా సహకరిస్తోంది. అంతేకాదు వజీరిస్తాన్‌ ప్రాంతం నుంచి పదివేల మంది యువ ఉగ్రవాదులను రిక్రూట్‌ చేసుకోవాలని ఐఎస్‌ఐ టార్గెట్‌ పెట్టింది. జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు వీరందరికీ శిక్షణ ఇస్తున్నారు. భారత సాయుధ బలగాలతో పాటు కశ్మీర్‌లోని పుణ్యకేత్రాలపై దాడులకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీతో పాటు ఇతర సాయుధ దళాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
పాకిస్తాన్‌లో భారత్‌ జరిపిన బాలకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఉగ్రవాదులు తిరిగి పుంజుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ఆర్మీ ఛీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు.పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జైష్‌-ఎ-మొహమ్మద్‌ నడుపుతున్న ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం ధ్వంసంచేసిందన్నారు. ఈ దాడులు జరిగిన దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్‌ బాలకోట్‌లోని టెర్రర్‌ క్యాంప్‌లు మళ్లీ చురుకుగా ఉన్నాయని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సోమవారం తెలిపారు. ఇటీవల బాలకోట్‌ రీ యాక్టివ్‌ అయ్యిందన్నారు.
భద్రతా బలగాల కళ్లు కప్పి తప్పించుకోవడానికి టెర్రరిస్టులు కొత్త పేరుతో తిరిగి చర్యలు ప్రారంభింస్తున్నారని రావత్‌ పేర్కొన్నారు.