ఖాళీల భర్తీకి కసరత్తు

త్వరలో 31,668 ఉద్యోగాలు: ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దసంఖ్యలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియచేపట్టిందని అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగాలకుసంబంధించి ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వరకూ 1,17,714 ఖాళీలు భర్తీ అయ్యాయని అన్నారు. మరో 31,668 ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌కమిషన్‌ 101 ప్రకటలను, ఇతర నియామక ఏజెన్సీలు 41 ప్రకటనలను జారీచేశారని అన్నారు.