యూరియా..ఏదయా?!

ఎరువుల కొరతతో రోడ్డెక్కుతున్న అన్నదాతలు 
  • ఎరువుల దుకాణాల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలు 
  • పంట అవసరాలకు సిద్ధంగా లేని యూరియా 
  • సకాలంలో యూరియా అందించడంలో సర్కారు విఫలం 
  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు 
  • పట్టించుకోని విజిలెన్స్‌ అధికారులు 
  • ఆలస్యంగా ప్రారంభమైన వర్షాలు 
  • అయినా స్పందించని సర్కారు 
  • పెరిగిన సాగు విస్తీర్ణం.. తగ్గిన ఎరువుల సరఫరా 

హైదరాబాద్‌: 
తెలంగాణ రాష్ట్రంలో చాలాకాలం తరువాత.. యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన ద శ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలను ప్రభుత్వం ముందస్తుగా సిద్ధంగా ఉంచగా.. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వర్షాలు కురవడంతో కాస్త ఆలస్యంగానైనా పంటలు సాగు చేస్తున్న రైతులు.. యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 
కొన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు సమద్ధిగానే ఉన్నా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం తీవ్ర కొరత నెలకొంది. రైతులు ఎరువుల దుకాణాల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలు కడుతున్నారు. సరఫరా తక్కువగా ఉండటం, అందరు రైతులకు అందకపోవడంతో వారు నిరసనకు దిగుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని అధికార యంత్రాంగం చెబుతున్నా.. కొన్నిచోట్ల వ్యాపారులు కత్రిమ కొరత సష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
మరికొన్ని చోట్ల కొందరు రైతులకు ఎక్కువగా యూరియా ఇస్తున్నట్లు, దాంతో తమకు అందడంలేదని మిగిలిన రైతులు ఆరోపిస్తున్నారు. పంటల సాగుపై ప్రణాళిక/అంచనాల లోపం కూడా యూరియా కొరతకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధర పెంచేసి రైతుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. గత సోమవారం నిర్మల్‌ జిల్లా మామడ మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక తహసీల్దార్‌ వచ్చి. యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అయితే సన్నరకం యూరియాను ఉత్పత్తి చేసే ఒక ప్లాంటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారం రోజులుగా సరఫరా నిలిచిపోయిందని, దీని ఫలితంగానే కొరత ఏర్పడిందని చెబుతున్నారు. 
లావు రకం యూరియా అందుబాటులో ఉన్నా.. దానిని కొనుగోలు చేసేందుకు రైతులు ఇష్టపడటం లేదు. కాగా నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడం, సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో యూరియా కొరత తలెత్తుతోందని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్‌లో మొక్కజొన్న, సోయా, పత్తి, వరి పంటలను విస్తారంగా సాగు చేయడం, అవసరాలకు అనుగుణంగా యూరియా నిల్వలు లేకపోవడంతో కొన్ని మండలాల్లో వారం రోజులుగా కొరత ఏర్పడింది. యూరియా కోసం సొసైటీ అధికారులను రైతులు నిర్బంధించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో కొందరు ప్రైవేటు డీలర్లు పురుగు మందులు కొంటేనే యూరియా ఇస్తామంటూ షరతు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, ఖమ్మం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి వంటి జిల్లాల్లో మాత్రం యూరియా నిల్వలు తగినంతగా ఉన్నట్లు ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. 
ఎరువుల కొరతతో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రైతులు ఎరువు బస్తాల టోకెన్ల కోసం క్యూ కట్టి గంటల తరబడి లైన్‌లో నిలబడ్డారు. కొన్ని చోట్ల గడ్డలు కట్టిన బఫర్‌ స్టాక్‌ ఎరువులను ఇస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లాకు 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 42వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చింది. వర్షాలు పడుతుండటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఎరువుల కొరతతో సాగు కానిచ్చేదెలా అని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆగస్టు నాటికే 54 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువు అవసరం ఉంది. ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 2,30,000 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇది సాధారణం కన్నా 112 శాతం అధికం. సరైన సమయంలో ఎరువులు అందకుంటే పంట నష్టపోయే ప్రమాదమున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 
పెరిగిన సాగు విస్తీర్ణం.. తగ్గిన సరఫరా 
జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర?ం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అదనంగా 30 వేల (15శాతం) ఎకరాల వరకు అదనంగా సాగైంది. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఆగస్ట్‌ 15 వరకూ వరి నాట్లు వేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాకు 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 38 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక పంపించగా, సుమారు 16 వేల మెట్రిక్‌ టన్నులు తక్కువగా వచ్చింది. సాగు విస్తీర?ం పెరిగి, వినియోగం పెరగడంతో యూరియా కొరత ఏర్పడింది. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం 2014-15 సంవత్సరం నాటి బఫర్‌ స్టాక్‌ను సర్దుబాటు చేసింది. ప్రస్తుతం ఆ బఫర్‌ స్టాక్‌ నిల్వలు కూడా నిండుకున్నాయి. 
1740 మెట్రిక్‌ టన్నులు మాత్రమే.. 
యూరియా కొరత విపరీతంగా ఉన్నప్పటికీ జిల్లాకు పెద్దగా సరఫరా కావడం లేదు. బుధవారం 1740 మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చింది. ఈ యూరియా ప్రస్తుతమున్న డిమాండ్‌కు ఏ మాత్రమూ సరిపోదు. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వరి నాట్లు ఆలస్యంగా వేయడంతో ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్‌ నెలలోనే యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 
వాడకపోవడం వల్లే.. 
యూరియా వినియోగం విపరీతంగా పెరగడంతో కేంద్రం గతంలో పీవోఎస్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌ఫుట్‌ డీలర్లు, సొసైటీలకు మిషన్లను అందజేసి, వాటిపై శిక్షణ కూడా ఇప్పించింది. యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, వేలిముద్రలు పెట్టి తీసుకెళ్లాలి. తద్వారా యూరియా ఎంత వినియోగమవుతోంది.. ఒక రైతు ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నాడు.. అనే వివరాలు కేంద్రం ద ష్టికి వెళ్తాయి. కానీ పీవోఎస్‌ మిషన్లను వాడక పోవడంతో కేంద్ర వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్రంలో ఎరువుల వినియోగంపై స్పష్టత రావడం లేదు. దీన్ని దష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం.