మాజీ ఎంపీపై చీటింగ్ కేసు
రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ
ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. నాలుగేళ్ల క్రితం నాటి చీటింగ్ (మోసం) కేసులో ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ సమన్లు జారీ చేసింది.
2014 ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని తన భర్త రాంజీ నాయక్ నుంచి ఒక కోటి 30 లక్షల రూపాయలు రేణుకా తీసుకున్నారని కళావతి బాయి అనే మహిళ అప్పట్లో ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో రేణుకపై 420, 417 కింద కేసు నమోదైంది. విచారణలో భాగంగా కోర్టు ఇచ్చిన నోటీసులను రేణుకౌ చౌదరి తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. రేణుకా చౌదరిపై అప్పట్లో వచ్చిన ఈ ఆరోపణలు సంచలనమయ్యాయి.