నీటి కేటాయింపులు

కష్ణానదీ జలాల పంపిణీపై బోర్డు ఉత్తర్వులు జారీ… 

హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కష్ణానదీ జలాల పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశాలు ఇచ్చింది. 
సెప్టెంబర్‌ వరకు తెలంగాణ రాష్ట్రానికి 59 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 152 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 44.5 టీఎంసీలు కేటాయిచింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.50 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాలువ నుంచి 26.06 టీఎంసీలు, ఎలిమనేటి మాదవరెడ్డి ప్రాజెక్టు నుంచి 10.47 టీఎంసీలు. 
హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 5.90 టీఎంసీలు, మిషన్‌ భగీరథ పథకానికి 2.08 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 52 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు నుంచి 88 టీఎంసీలు, హంద్రీనీవా, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకానికి 12 టీఎంసీలు, కష్ణా డేల్టాకు 10 టీఎంసీలు కేటాయించారు.