థాంక్యూ టూ ఆమిర్: మోదీ
ప్లాస్టిక్ నిషేదంపై స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు ట్విటర్ ద్వారా కతజ్ఞతలు తెలిపారు. పర్యవరణ పరిరక్షణకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిలిపివేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆల్‌ఇండియా రేడియోలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిద్దాం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ట్విటర్ ద్వారా మోదీకి మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అభివర్ణించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తాం అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆమీర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు ఆమిర్’ అంటూ ట్వీట్ చేశారు.