రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆర్టికల్ 370’
పిటిషన్లపై అక్టోబరులో విచారణ చేపడుతుందన్న సీజేఐ
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ అంశాలకు సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలవగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేత త్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. అక్టోబరు మొదటివారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనాయంత్రాంగానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
మీడియా ఆంక్షలపై వివరణ ఇవ్వండి…
కశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బేసిన్ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు విచారించింది. ఈ వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల గడువు విధించింది. అధికరణ 370 రద్దు నేపథ్యంలో మీడియా, ఇంటర్నెట్, మొబైల్ సేవలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయినా ఇంకా కొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతుండడంపై ప్రభుత్వాన్ని కోర్టు తాజాగా వివరణ కోరింది.
జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దానికి పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. అంతేగాక.. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కశ్మీర్ వ్యాప్తంగా ఆంక్షలు విధించింది. మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖ రాజకీయ నాయకులను గ హనిర్బంధం చేసింది. రాజకీయ ప్రముఖులెవరూ కశ్మీర్ రాకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయితే వీటన్నింటినీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్ధానం కేంద్రానికి రెండు నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అన్ని పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ అక్టోబర్ నుంచి విచారిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు కశ్మీర్‌లో మీడియాపై నియంత్రణలకు సంబంధించి కేంద్రం బదులివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కోరింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ జారీ చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేస్తే అది అంతర్జాతీయ ప్రభావాలకు దారితీస్తుందని ప్రభుత్వం వాదించింది. ఇక దేశంలోకి పౌరులు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛను హరించడం తగదని తన సహచరుడిని కలిసేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని శ్రీనగర్ వెళ్లేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో గవర్నర్ పాలన సక్రమంగా లేదని అడ్వకేట్ గోపాల్ శంకర్‌నారాయణన్ కోర్టుకు నివేదించారు. కశ్మీర్‌లో గవర్నర్ పాలన గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల గడువు జూన్‌తో ముగిసిందని, తాజా ఉత్తర్వులు జారీ చేసే సమయానికి గవర్నర్ పాలన అమల్లో లేనందున ఆర్టికల్ 370 రద్దుకు చట్టబద్ధత లేదని ఆయన వాదించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ స్పందిస్తూ ఈ అంశం ఐదుగురు న్యాయమూర్తు ధర్మాసనం అక్టోబర్ నుంచి విచారణ చేపడుతుందని బదులిచ్చారు.