జనరిక్‌ విక్రయాలను అడ్డుకొంటున్నది ఎవరు?

జనరిక్‌ మందులు జాడేది? 
  •  మల్టీ నేషనల్‌ కంపెనీల మాయలో జనరిక్‌ మందులను సూచించని వైద్యులు 
  • జనరిక్‌ గొంతు నొక్కుతున్న కార్పొరేట్‌ కంపెనీలు 
  • సామాన్యులకు అందని జనరిక్‌ ఔషధ ఫలాలు 

బోధన్‌ ప్రతినిధి, జ్యోతి న్యూస్‌ 
దోచుకోవడమే పనిగా పెట్టుకొని కొందరు కార్పొరేట్‌ వైద్యులు ప్రజల చావు బతుకలతో ఆటలాడుతున్నారు. కమీషన్ల కోసం బ్రాండెడ్‌ మందులను అంటగడుతున్నారు. అంతర్జాతీయ సంస్థల విధానం వల్ల జనరిక్‌ నినాదం మరుగున పడుతుందా? ఉద్దేశ్య పూర్వకంగానే జనాన్ని మందుల పేరిట దోచుకొంటున్నారా? ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న వైద్యం ఖర్చులను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన పాలకుల మాటలు నీటి మీద రాతలయ్యాయా? బ్రాండెండ్‌ మందుల ముసుగులో నిలువు దోపిడి జరుగుతుంది. జనరిక్‌ మందులపై అవగాహనలేకే మెడికల్‌ మాఫియా మాయలో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. జీవనధార పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ స్టోర్స్‌ ఏమయ్యాయి. పేద మధ్యతరగతి కుటుంబాల పాలిట దివ్య ఔషధంగా మారిన జనరిక్‌ మందుల జాడేది. ఆరోగ్యమే మహాభాగ్య అన్నట్లు ఆరోగ్యంగా ఉన్నంత వరకు పరవాలేదు. చిన్న అనారోగ్యం చేసిన అభాగ్యులుగా మారిపోతున్నారు. బాధ పెట్టే మందులు లభిస్తున్నాయి. ప్రభుత్వం జీవన్‌ ధార, జన ఔషది పేర్లతో మెడికల్‌ స్టోర్స్‌ ప్రారంభించిన ప్రభుత్వం వాటిపై అవగాహన కల్పించడంలో విఫలమయ్యింది. తక్కువ ధర కావడంతో జబ్బు నయంకాదన్న భయంతో బ్రాండెడ్‌ మందులు వాడితేనే రోగం తగ్గుతుందన్న భ్రమలో ప్రజలు ఉన్నారు. 
జనరిక్‌ బ్రాండెడ్‌ మందుల మధ్య భారీగా తేడాలు… 
జ్వరానికి వాడే పారసితమాల్‌ పది టాబ్లేట్లకు 4 రూపాయలైతే బ్రాండెడ్‌ కంపెనీ పది టాబ్లేట్లకు 9 రూపాయలు డోస్‌ ఒక్కటే మందు పనిచేసే తీరు ఒక్కటే కాని ధరల్లోనే భారీ తేడాలున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్ళునొప్పులు, అని తేడాలేకుండా అన్ని మందుల్లో దోపిడీ జరుగుతోంది. 
జనరిక్‌ మందులు రిఫర్‌ చేయని వైద్యులు…. 
రెగ్యులైజేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం 2002 ఒకటి,ఐదు ప్రకారం వైద్యులు సాధ్యమైనంత వరకు జనరికన మందులను మాత్రమే సూచించాలని అత్యవసర సమయంలో తప్పని సరి అయితే ఖరీదైన బ్రాండెడ్‌ మందులను సూచించాలని నిబంధనలు ఉన్నవైద్యులు పెడ చెవిన పెట్టడం గమనార్హం. చిన్న అనారోగ్యంచేసిన అభాగ్యులుగా మారిపోతున్నారు. బాధపెట్టే రోగం కన్నా ఆర్థికంగా పడుతున్న భారం మరింతగా ప్రజలను కృంగదీస్తుంది. అందుకే వైద్యం ఒక వ్యాపారంగా మారింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతైనా ఖర్చు చేస్తారనే బలహీనతని వ్యాపార సూత్రంగా మలుచుకొని ప్రజలను దోచుకుంటున్నారు. రోగం ఏదైనా సరే వాటికి వేసే మందులు చాలా రకాలు, ఒక్క వ్యాధిని తగ్గించేందుకు నాలుగైదు రకాల మందులు కుదరకపోతే పిరపులు, వ్యాధిని తగ్గించాలనుకుంటే మూల ఔషదాలతో తయారు చేసిన మందులను రాయలి కాని కంపెనీల సేల్స్‌ పెంచడానికి వైద్య నారాయణులు బ్రాండెడ్‌ మెడిసిన్‌ మందులు రాస్తున్నారు. అందుకే జనరిక్‌మందులు మరుగున పడుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజల పాలిట దివ్య ఔషదం జనరిక్‌ మెడిసిన్‌. బ్రాండెడ్‌ కంపెనీ మందుతో సమానంగా నయం చేసే జనరిక్‌ మెడిసిన్‌ తక్కువ ధరలోల& దొరుకుతుంది. సాధారణ మెడికల్‌ షాపుల్లోని మాదిరిగానే దగ్గు,జలుబు, తలనొప్పి, జ్వరం, బీపి, షుగర్‌ నుండి మొదలుకొని ప్రాణాంతక వ్యాధుల వరకు జనరిక్‌ మందులు లభిస్తున్నాయి. ప్రభుత్వం జీవన్‌ధార, జన ఔషది పేర్లతో మెడికల్‌ స్టోర్స్‌ ప్రారంభించిన ప్రభుత్వం వాటిపై అవగాహన సూచించాలని నిబంధనలు ఉనన వైద్యులు పెడచెవిన పెట్టడం గమనార్హం. ప్రలోభాలకు ఫారిన్‌ మందులకు లొంగి కంపెనీ పేర్లు రాస్తున్నారు. బ్రాండెడ్‌ అన్న పదం మెడిసిన్‌ని శాసిస్తున్నది అనేది అక్షర సత్యం. ప్రాణం పోయాల్సిన వైద్యుల నుండి కింది స్థాయి వరకు మెడికల్‌ మాఫియా రాజ్య మేలడంతో సామాన్యుని జేబులకు చిల్లు పడుతుంది. సామాన్యులకు నాణ్యమైన మందులను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.