నోళ్లు తెరిచిన మ్యాన్ హోళ్లు
ప్రాణాలను బలిగొంటున్న మూతలేని డ్రైనేజీలు..పట్టించుకోని అధికారులు
కోర్ ఏరియాలో డ్రైనేజీ పైపులైన్లు – 2,600 కి.మీ
మ్యాన్‌హోళ్లు – 2.04 లక్షలు
శివార్లలోని 16 సర్కిళ్లలో పైపులైన్లు – 3,476.89 కి.మీ
మ్యాన్‌హోళ్లు – 2,96,329
వరద నీటి డ్రైన్‌లు – 1,218.63 కి.మీ
క్యాచ్‌పిట్లు – 1,22,461
రోడ్డు కంటే తక్కువ ఎత్తు
గుంతల్లా మారుతోన్న వైనం
ప్రమాదాలకు గురవుతోన్న వాహనదారులు
జోరుగా పీపీఎం పనులు
మ్యాన్‌హోల్ ఎత్తు పెరగని వైనం
ఉన్నతాధికారులు ఆదేశించినా అంతే
హైదరాబాద్:
గుడి మల్కాపూర్‌లో దారుణం జరిగింది. 15 నెలల బాలుడు ఆడుకుంటూ.. డ్రైనేజ్ మ్యాన్ హోల్‌లో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఆ బాలుడిని రక్షించి.. నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మ్యాన్ హోల్ చాలా రోజుల నుంచి తెరిచి పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జీహెచ్‌ఎంసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదంటూ అధికారులపై మండిపడుతున్నారు.
పీరియాడికిల్ ప్రివెంటీవ్ మెయింటెనెన్స్(పీపీఎం)లో భాగంగా నగరంలో బీటీ రోడ్ల నిర్మాణం జోరుగా సా గుతోంది. ఇప్పటికే 250కి.మీ మేర పనులు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. రహదారుల నిర్మాణం వరకు బాగానే ఉన్నా.. రోడ్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న మ్యాన్‌హోళ్ల మూతలు నగరవాసులను భయపెడుతున్నాయి. రోడ్ల ఎత్తుకు సమానంగా మ్యాన్‌హోళ్ల మూతలు ఉండాలని ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. కార్పెటింగ్, రీ కార్పెటింగ్, పీపీఎం పనులంటూ పొరలు పొరలుగా జీహెచ్‌ఎంసీ చేపడుతోన్న పనులతో బీటీ రోడ్ల ఎత్తు క్రమేణా పెరుగుతోంది.
మ్యాన్‌హోల్ మూతలు మాత్రం రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉండి గుంతల్లా మారుతున్నాయి. బస్సులు, కార్లు, ఆటోల వెనక వెళ్లే ద్విచక్ర వాహనదారులు.. ఆ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌టీసీ క్రాస్ రోడ్ నుంచి వీఎసటీకి వెళ్లే మార్గంలో గురువారం రాత్రి ఓ వాహనదారుడు రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉన్న మ్యాన్‌హోల్ గుంతలో పడగా.. గాయాలయ్యాయి. మ్యాన్‌హోళ్లకు మూతలు ఉన్నప్పటికీ.. లోతున ఉండడంతో ఇబ్బందికరంగా మారుతోంది.
30శాతం కనుమరుగు..
గ్రేటర్‌లోని కోర్ ఏరియాలో 2.04లక్షలు, శివారు సర్కిళ్లలో 2.96 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. సీవరేజి నిర్వహణ బాధ్యతలు నగరంలో వాటర్‌బోర్డు, శివార్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. రెండు విభాగాలు నిర్లక్ష్యంగా వ్యహరించడంతో రహదారులపై ఉన్న మ్యా న్‌హోల్ మూతల్లో ఇప్పటికే దాదాపు 30శాతం కనుమరుగయ్యాయి. ఈ విషయాన్ని ఆయా విభాగాల అధికారులే అంగీకరిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో మ్యాన్‌హోల్ మూతలు గుర్తించి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం మూతలు ఉన్న ప్రాంతంలో వదిలేసి కార్పెటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు కంటే తక్కువ ఎత్తులో మూతలు ఉంటున్నాయి. పనులు పూర్తయిన అనంతరం.. రోడ్డు కంటే ఎక్కువ ఉండేలా మ్యాన్‌హోల్ ఎత్తు పెంచాలి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గుంతల్లా ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతోంది.
సిటీలో రోడ్లపై తెరుచి ఉన్న మ్యాన్ హోళ్లకు మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. 2వేల కి.మీ పొడవైన రోడ్లపై ఉన్న 17వేల మ్యాన్ హోల్స్, 8 వేల సిల్ట్ ఛాంబర్లను యుద్ధ ప్రాతిపదికతన జలమండలి ఆధునీకరిస్తుంది. డివిజన్ల వారీగా పనులు జోరుగా సాగుతుండగా, వర్షాకాలం ఆరంభం కంటే ముందే పనులు పూర్తయ్యేలా జలమండలి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సిటీలో ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ కొన్ని ఉంటే%ౌౌ% స్పీడ్ బ్రేకర్లుగా రోడ్డుకు ఎత్తుగా ఉండేవి మరికొన్ని. వీటితో నిత్యం నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే తెరిచిఉన్న మ్యాన్ హోల్స్ తో వాహనదారులకి అవస్థలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులన్నింటికి చెక్ పెట్టేలా, మ్యాన్ హోల్స్ ని రోడ్డుకు సమాంతరంగా నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న ఛాంబర్లను తొలగించి నూతన వాటిని ఏర్పాట్లు చేయాలని జలమండలి నిర్ణయించింది. సిటీలో దాదాపు 8వేల సిల్ట్ చాంబర్లు, స్లూయిస్ వాల్వ్ చాంబర్లు ఉన్నాయి. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 8వేలకుపైనే మ్యాన్ హోల్స్, క్యాచ్‌పిట్‌లు ఉండగా, వీటిని రహదారులకు సమాంతరంగా నిర్మించేందుకు దాదాపు రూ. 21 కోట్లను కేటాయించి ఆధునీకరణ పనులను వేగంగా జరుపుతోంది. ఈ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి డివిజన్ల వారీగా రోడ్లపై ఉన్న ప్రమాదకరమైన వాటిని గుర్తించి వీటి రిపేర్లపై దష్టి పెట్టింది. జలమండలి పరిధిలోని దాదాపు అన్ని డివిజన్లలో నూతనంగా చేపట్టాల్సిన, ఆధునీకరించాల్సిన మ్యాన్ హోల్స్ వారీగా విభజించి పనులు నిర్వహిస్తుండగా, ఇప్పటికే డివిజన్ 1 గోషామహల్? పరిధిలోని పలు ప్రాంతాలలో గుర్తించిన వాటిలో దాదాపు 140 మ్యాన్ హోల్స్ నిర్మాణం, ఆధునీకరణ పూర్తి కాగా మిగతా పనులను త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించింది. అదేవిధంగా డివిజన్ 2లో 152లో 50కిపైనే చాంబర్లకు రిపేర్ చేయగా, 100 మ్యాన్ హోల్స్ ను ఆధునీకరించారు. డివిజన్ 4లో 50, డివిజన్ 5లో 142, డివిజన్ 6లో 180, డివిజన్ 7లో 230, డివిజన్ 9లో 112, డివిజన్ 10లో 138, డివిజన్ 12లో 41, డివిజన్ 13లో 18, డివిజన్ 14లో 29, డివిజన్ 15లో 48, డివిజన్ 16లో 85ఛాంబర్లు, మ్యాన్ హోల్స్ కు రిపేర్ల ప్రక్రియ పూర్తి కాగా, మిగత వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే కొన్ని డివిజన్లలో పనులు నత్తనడకన సాగుతుండటంపై ఇటీవల ఎండీ సమీక్షలో సంబంధిత అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా గడువు లోగా పనులు పూర్తి కాకుండా సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ శాఖపరమైన చర్యలు తీసుకునేలా అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది.
రోడ్డుకు సమాంతరంగా
సిటీలో రోడ్డుకు సమాంతరంగా నిర్మిస్తున్న వీటిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఉన్నవాటిలో పాత ఛాంబర్లను తొలగించడంతోపాటు, మ్యాన్ హోల్స్ చుట్టూ శిథిలావస్థలో ప్రాంతాలను తీసివేసి, అనంతరం భారీ వర్షాలు, వరదలు లేదా మురుగు నీరు రోడ్లపై పొంగిపోర్లిన సందర్భంలో మునిగిపోయిన మూతలను సులభంగా తీసివేసేలా ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఒక పొరగా గట్టి ప్లాస్టిక్ తో చేసిన గ్రిల్ ను ఆపైన ఉక్కు మూతను బిగిస్తున్నారు. దీంతో ఒకవేళ ఉక్కు మూతను తొలగించినా, మ్యాన్ హోల్ లో పడిపోకుండా గట్టి ప్లాస్టిక్ రక్షణలా ఉండేలా వీటిని వినియోగిస్తున్నారు. దీంతో రోడ్డుకు సమాంతరంగా ఉండటంతో పాటు, ఒకవేళ పైకప్పు తొలగించిన మ్యాన్ హోల్ లో పడిపోయే అవకాశం తక్కువగా ఉంటుందనీ అధికారులు చెబుతున్నారు.