టీఆర్‌ఎస్‌ కన్నా బలమైన పార్టీ లేదు

60 లక్షలకు చేరుకున్న సభ్యత్వాలు: కేటీఆర్‌ 


హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. గురువారంతో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందని కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్‌ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారీగా సభ్యత్వాల నమోదుకు కషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో గజ్వేల్‌, వర్ధన్నపేట ముందు వరుసలో నిలిచాయి. దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి. ఈ నెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. రాష్ట్రంలో బీజేపీకి 12 లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే బలమైన పార్టీ ఏదీ లేదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 
తెలంగాణ ఆడపడుచులకు కోటి బతుకమ్మ చీరలను సెప్టెంబరు 15వ తేదీలోగా పంపిణీ చేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. గురువారం సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో చేనేత, మరమగ్గాల పరిశ్రమ అభివద్ధిపై ఆయన సమీక్షించారు. సిరిసిల్లలో తయారవుతున్న బతుకమ్మ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలు ఆడపడుచులకు ఒక చిరు కానుకగా, నేతన్నలకు ఉపాధిగా నిలిచాయన్నాయి. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, సిద్దిపేట, జమ్మికుంట తదితర ప్రాంతాల్లోని చేనేత, మరమగ్గాల రంగాలను అభివద్ధి చేసేందుకు, కార్మికులకు భద్రతతో కూడిన జీవన ప్రమాణాలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ద్విముఖ కార్యక్రమాలు చేపట్టారన్నారు. 
కొత్త తరహా ఉత్పత్తులపై దష్టిపెట్టి సిరిసిల్ల కూడా తిర్పూర్‌ స్థాయికి చేరుకోవాలన్నారు. సిరిసిల్ల చీరకు బ్రాండింగ్‌ తేవాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలతో పాటు ఇతర చీరల ఉత్పత్తులు కూడా చేసి మార్కెట్‌లో సిరిసిల్ల చీరలకు ఇమేజ్‌ తేవాలన్నారు. సిరిసిల్ల నేతన్నలకు మూడేళ్లలో రూ.900 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా నాలుగేళ్లలో రూ.1600 కోట్ల విలువైన 40.5 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చామన్నారు. దీంతో చేనేత కార్మికుల వేతనాలు రూ.7 వేల నుంచి రూ.16-25 వేలకు చేరుకుందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు. సిరిసిల్ల పరిశ్రమలో 808 మందికి రూ.5.80 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. త్రిప్ట్‌ ఫండ్‌ స్కీం కింద కార్మికుడికి నెలకు రూ.1200 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇప్పటివరకు రూ.1.18 కోట్లు చెల్లించిందని తెలిపారు. సిరిసిల్ల పరిశ్రమకు 50్న కరెంట్‌ సబ్సిడీ కింద రూ.30.50 కోట్లు ఇచ్చామన్నారు. చేనేత దినోత్సవం రోజున కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో చేనేత కళాకారులకు ఆవార్డులు అందించి సత్కరిస్తున్నామన్నారు. 
చీరలు బాగున్నాయి.. 
సిరిసిల్లలో తయారైన బతుకమ్మ చీరలు బాగున్నాయని, నాణ్యత బాగుందని కేటీఆర్‌ ప్రశంసించారు. చీరలకు బ్రాండింగ్‌ క్రియేట్‌ చేయాలని, ప్రత్యేక లోగోను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి మహిళా జర్నలిస్టలను సిరిసిల్లకు పిలిపించి బతుకమ్మ చీరల ప్రత్యేకతను వివరించాలన్నారు. ఉపాధి ఎంత దక్కుతోందని పవర్‌లూం కార్మికులను ప్రశ్నించారు. కారా?నాలో ఎంత మంది పనిచేస్తున్నారని, స్థానికులకు ఉపాధి కల్పించాలని యజమానికి చెప్పారు.