రిజర్వేషన్‌ తుట్టె కదిలిస్తారా?!

మరో సంచలనాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్న మోదీ 
  • 30 సంవత్సరాల క్రితం కుదిపేసిన రిజర్వేషన్ల అంశం
  •  అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ నేతృత్వంలో మండల్‌ కమిషన్‌ 
  • నాడు భగ్గుమన్న యావత్‌ భారతదేశం 
  • దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు 
  • మళ్లీ తెరపైకొస్తున్న రిజర్వేషన్ల అంశం 
  • పునఃస్సమీక్షించాలని బీజేపీపై ఒత్తిడి తెస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ 
  • త్వరలో నివేదిక ఇవ్వనున్న జస్టిస్‌ రోహిణి కమిషన్‌ 
  • రిజర్వేషన్ల అంశాన్ని ముట్టుకుంటే మసే అంటున్న మాయావతి 
  • రిజర్వేషన్లపై కుట్ర జరుగుతోందన్న ప్రియాంకాగాంధీ 

హైదరాబాద్‌: 
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, వాటిని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంటలు రాజేస్తున్నాయి.మోదీ ప్రభుత్వం మరింతబలంగా తిరిగి అధికారంలోకి వచ్చి, ట్రిపుల్‌ తలాఖ్‌, కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి కఠినమైన లక్ష్యాలను సైతం సునాయాసంగా నెరవేర్చుకుపోతున్న నేపథ్యంలో, రిజర్వేషన్ల అంశాన్ని ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్నది. సామాజిక వెనుకబాటుతనంతో, కులమతాలతో నిమిత్తం లేకుండా, దశాబ్దాలుగా పాటిస్తున్న రిజర్వేషన్‌ విధానానికీ, స్ఫూర్తికీ భిన్నంగా ఈడబ్ల్యుఎస్‌ కోటాను అమలు చేసింది మోదీ ప్రభుత్వం. దానికి కొనసాగింపుగా, రిజర్వేషన్‌ అంశాన్ని ఒక జాతీయ ఎజెండాగా మార్చి, పునఃస్సమీక్షించడం ఈ వ్యాఖ్యల లక్ష్యంగా కనిపిస్తున్నది. బలమూ, వ్యూహమూ కలగలిపి లక్ష్యాలను చక్కబెడుతున్న మోదీ ప్రభుత్వం ఈ సాహసానికి పూనుకుంటుందో లేదో గానీ వీపీ సింగ్‌ కాలంలో కదిపిన రిజర్వేషన్ల తుట్టె మళ్లీ 30 సంవత్సరాల తర్వాత మోదీ కదిలించబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. 
అసలైన ఆసక్తికరాంశం 
వర్గీకరణ అధ్యయనంలో భాగంగా జస్టిస్‌ రోహిణి కమిషన్‌ అయిదేళ్లలో ఓబీసీ కోటా కింద భర్తీ అయిన ఉద్యోగాలను పరిశీలించింది. మూడేళ్ల కాలంలో విద్యాసంస్థల్లో ప్రవేశాలనూ విశ్లేషించింది. సంఖ్యాపరంగా 25 శాతం లోపున్న కులాలు 97శాతం ‘ఉద్యోగాలు/ ప్రవేశాలు’ దక్కించుకున్నాయి. ఇంకా సూక్ష్మంగా వెళ్ళి పరిశీలిస్తే 10 కులాలు 24.95 శాతం ‘ఉద్యోగాలు/ ప్రవేశాలు’ పొందాయి. 983 కులాలు ఏ ఫలితాన్నీ పొందలేదు. 994 కులాలకు 2.8 శాతం ప్రాతినిధ్యమే లభించింది. 2015 మార్చి 31నాటికి కేంద్ర ఓబీసీ జాబితాలో 2,418 కులాలు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రస్తుతానికి 2,633కు చేరింది. అంటే దాదాపు రెండువేల కులాలకు దక్కిన ప్రాతినిధ్యం ఎంత నామమాత్రమో ఈ లెక్కల్నిబట్టే అర్థమవుతుంది. రిజర్వేషన్ల ఫలితాలను అందుకోవడంలో నెలకొన్న ఇంతటి అసమానత్వాన్ని ఎలా తొలగించబోతున్నారన్నదే ఇప్పుడున్న ప్రశ్న. ఇప్పటిదాకా ఎటువంటి లబ్ధి పొందని కులాలు, ఎంతో కొంత లబ్ధి పొందినవి, గరిష్ఠంగా లబ్ధి పొందినవిగా విభాగించి వర్గీకరణ శాతాలను ప్రతిపాదించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందేలా చూడటం లక్ష్యం కాబట్టి ఇప్పటివరకూ గరిష్ఠంగా లబ్ధి పొందిన కులాలకు కోతపడటం ఖాయం. జస్టిస్‌ ఈశ్వరయ్య నేత త్వంలోని బీసీ కమిషన్‌ ఏ, బీ, సీలుగా వెనకబడిన వర్గాలను వర్గీకరించాలని అభిప్రాయపడింది. ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిని ద ష్టిలో ఉంచుకొని ఆ వర్గీకరణను సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్గీకరణకు రాజకీయ వ్యతిరేకత పెద్దగా రాకపోవచ్చు. న్యాయపరీకక్షూ వర్గీకరణ నిలబడే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఎత్తులకు పైఎత్తులకు ఏ అంశం ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో లెక్కల్లాగా కచ్చితత్వంతో చెప్పలేం. రిజర్వేషన్లను మాత్రం దీనికి కొంత మినహాయింపుగానే చెప్పుకోవాలి. అనూహ్యరీతిలో ఆర్థికంగా పేదవర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ కారణంగా ఇటీవలి ఎన్నికల్లో భాజపాకు ఉత్తరాదిన లాభం చేకూరలేదనగలమా! 
మండల్‌ కమిషన్‌ సిఫార్సులు దేశ రాజకీయాలను కీలక మలుపుతిప్పాయి. వెనకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేయడం, దాన్ని అమలు చేయడానికి 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం నడుంకట్టడం, ఆ సందర్భంలోనే భారతీయ జనతాపార్టీ రామజన్మభూమి నినాదాన్ని ఎత్తుకుని ఉద్యమించడం- దేశ చరిత్రను అసాధారణంగా ప్రభావితం చేశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయాలు, ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ రెండు అంశాల చుట్టూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తిరుగుతున్నాయి. మండల్‌-మందిర్‌ ఆందోళనల నేపథ్యంలోనే వెనకబడిన వర్గాలకు వేదికగా ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆ పార్టీల వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఆ రెండు రాష్ట్రాల్లో కోలుకోలేని విధంగా కుంగిపోయింది. మండల్‌ సిఫార్సులను ఆలంబనగా చేసుకుని రాజకీయంగా ఎదిగిన పార్టీల నుంచే భాజపాకు ఒకప్పుడు గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. సామాజిక న్యాయం నినాదంతో రాజకీయంగా ఎదిగిన పార్టీలు కాలక్రమంలో కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. వెనకబడిన తరగతుల్లో కొన్నింటికే ప్రాబల్య కేంద్రాలుగా తయారయ్యాయి. ప్రస్తుతం మనముందున్న చరిత్ర ఇది. చరిత్ర పునరావ తం అవుతుందంటే మనం ఒక పట్టాన నమ్మలేం! ఒకసారి దిగిన నదిలో రెండోసారి దిగలేమని గ్రీకు తత్వవేత్త హెరక్లైటస్‌ ఎప్పుడో చెప్పారు. వెనకబడిన వర్గాల రిజర్వేషన్ల అంశం 30 ఏళ్లనాడు రాజకీయాలను ఏ మలుపు తిప్పిందో తిరిగి అలాంటి మలుపునే మళ్ళీ అదే అంశం తీసుకురానుందా, అది కొత్త రాజకీయపార్టీల పుట్టుకకు దారితీస్తుందా లేక ప్రస్తుతం ఉన్న పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందా? ఏది జరిగినా చరిత్ర పునరావ తం అయినట్లే అనుకోవచ్చు! 
రిజర్వేషన్లపై సామరస్య పూర్వక చర్చ జరగాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్య ఆయన ఊహించినట్టుగానే వివాదం రాజేసింది. రిజర్వేషన్లను సమర్థించేవారు, వ్యతిరేకించేవారు సుహ ద్భావ వాతావరణంలో మాట్లాడుకోవాలనీ, కానీ, వాటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రెండు వైపుల నుంచీ తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయని ఆదివారం నాడు ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ఒకటి నిర్వహించిన ‘జ్ఞానోత్సవ్‌’ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల గురించి భాగవత్‌ మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కాదు. వాటిని సమీక్షించాలంటూ గతంలో విస్పష్టంగా ప్రకటించిన ఆయన ఈ మారు కాస్తంత నర్మగర్భంగా సుహ ద్భావ చర్చ జరగాలని అంటున్నారు. అందువల్లనే, ఆయన వ్యాఖ్యలను ఎవరూ తేలికగా తీసుకోకుండా, సామరస్య పూర్వక చర్చ ముసుగులో రిజర్వేషన్లకు ఎసరుపెట్టే కుట్ర జరుగుతున్నదని విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఆరెస్సెస్‌లు రిజర్వేషన్లను వమ్ముచేసే కుట్రకు పాల్పడుతున్నాయనీ, రాజ్యాంగాన్ని మార్చే ఎజెండా ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నదని కాంగ్రెస్‌ అంటున్నది. సామరస్య చర్చ అనడం ద్వారా కోటాల ఉనికిని ప్రశ్నిస్తున్నారనీ, దేశం భగ్గుమంటుందని మాయావతి హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్లు అవసరమా లేదా అన్నదానిపై గాక, ఫలాలు ఎవరెవరికి అందాయన్నది మాట్లాడుకోవచ్చునని అథవాలే వ్యాఖ్యానించారు. సమాజంలోని సంక్లిష్టమైన అంశాలను సైతం సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని చెప్పడంలో భాగంగానే, భాగవత్‌ ఈ ప్రస్తావన చేశారనీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లన్నింటినీ తాము సమర్థిస్తున్నట్టు ఆ తరువాత ఆరెస్సెస్‌ ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చినప్పటికీ, ఆ వ్యాఖ్యలపై వివాదం సాగుతూనే ఉన్నది. 
అడపాదడపా రిజర్వేషన్ల ప్రస్తావన చేస్తూ, వాటిపై చర్చనూ, రచ్చనూ రాజేయడంలో భాగవత్‌ కతకత్యులవుతున్నారు. రిజర్వేషన్లమీదనో, అమలు విధానం మీదనో వ్యతిరేకత లేకుండా ఆయన ఈ చర్చ మాట ఎత్తరన్నది వాస్తవం. వాటిని సమీక్షించే అవసరం ఉన్నదని ఇప్పటికే ఆయన బలంగా బల్ల గుద్దినందున, ఇప్పుడు చర్చ ముసుగులో ఉద్దేశపూర్వకంగా ఆయన మారోమారు మంటలు రేపుతున్నారన్న అభిప్రాయం కలుగుతున్నది. భాగవత్‌ వ్యాఖ్యలను మీడియా తప్పుదోవపట్టించిందని విమర్శించిన బీజేపీ నాయకులు సైతం, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యల ప్రభావం గురించి భయపడుతున్నారు. నాలుగేళ్ళక్రితం బిహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించాలంటూ భాగవత్‌ చేసిన వ్యాఖ్య విపకక్షూటమికి తిరుగులేని అస్త్రంగా ఉపకరించింది. పటేల్‌ రిజర్వేషన్‌ ఉద్యమాన్ని దష్టిలో పెట్టుకొని, రాజ్యాంగ నిర్మాతలు వీటిని ప్రవేశపెట్టిన అసలు లక్ష్యం వెనక్కుపోయి, అవి రాజకీయాంశంగా మారిపోయాయంటూ భాగవత్‌ అప్పట్లో వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు అశాశ్వతమనో, సరిగా లేవనో, సక్రమంగా అమలు కావడం లేదనో, కులాధారిత రిజర్వేషన్లేమిటనో, రాజకీయ ప్రయోజనాలకే ఉపకరిస్తున్నాయనో ఆరెస్సెస్‌ వాదిస్తుండటం తెలిసిందే. 
మోదీ ప్రభుత్వం మరింతబలంగా తిరిగి అధికారంలోకి వచ్చి, ట్రిపుల్‌ తలాఖ్‌, కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి కఠినమైన లక్ష్యాలను సైతం సునాయాసంగా నెరవేర్చుకుపోతున్న నేపథ్యంలో, రిజర్వేషన్ల అంశాన్ని ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్నది. సామాజిక వెనుకబాటుతనంతో, కులమతాలతో నిమిత్తం లేకుండా, దశాబ్దాలుగా పాటిస్తున్న రిజర్వేషన్‌ విధానానికీ, స్ఫూర్తికీ భిన్నంగా ఈడబ్ల్యుఎస్‌ కోటాను అమలు చేసింది మోదీ ప్రభుత్వం. దానికి కొనసాగింపుగా, రిజర్వేషన్‌ అంశాన్ని ఒక జాతీయ ఎజెండాగా మార్చి, పునఃస్సమీక్షించడం ఈ వ్యాఖ్యల లక్ష్యంగా కనిపిస్తున్నది. బలమూ, వ్యూహమూ కలగలిపి లక్ష్యాలను చక్కబెడుతున్న మోదీ ప్రభుత్వం ఈ సాహసానికి పూనుకుంటుందో లేదో తెలియదు కానీ, ఆ బలాన్ని దశాబ్దాలుగా నిలిచిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికీ, ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చడానికో వినియోగించడం మంచిది. 
రిజర్వేషన్ల అమలు తీరుపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. రిజర్వేషన్ల అంశాన్ని ముట్టుకుంటే.. దేశం భగ్గున మండిపోతుందంటూ బహుజన్‌ సమాజ్‌ వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించి 24 గంటలు గడవకముందే అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన గళాన్ని వినిపించారు. పున:సమీక్ష పేరుతో రిజర్వేషన్ల వ్యవస్థను ఎత్తేయడానికి చాపకింద నీరులా కుట్ర సాగుతోందని ఆమె ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా డిమాండ్లను తీసుకొచ్చి, రిజర్వేషన్ల పున: సమీక్షించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, వాటిని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. రిజర్వేషన్ల వ్యవస్థ పున: సమీక్షకు సరైన వాతావరణం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారికి రిజర్వేషన్ల ఫలాలు అందట్లేదని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశాన్ని ద ష్టిలో ఉంచుకుని.. రిజర్వేషన్లపై నరేంద్ర మోడీ- అమిత్‌ షా ద్వయం కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. మోహన్‌ భగవత్‌ చేసిన ఈ ప్రకటన పట్ల రాజకీయ ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. నిప్పు లేనిదే పొగరాదని, ఈ వ్యవస్థను ఎత్తేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందనే విషయం మోహన్‌ భగవత్‌ మాటల ద్వారా తేటతెల్లమైందని మాయావతి విమర్శించారు. తాజాగా- ప్రియాంక గాంధీ వాద్ర అదే గళాన్ని అందిపుచ్చుకున్నారు. సామాజిక అసమతౌల్యానికి దారి తీసేలా నరేంద్ర మోడీ-అమిత్‌ షా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం గొంతు కోసే ప్రయత్నాలకు వారిద్దరు తెర తీశారని ధ్వజమెత్తారు. దీనిపై ఆమె మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ అసలు లక్ష్యం.. సామాజిక న్యాయమేనని ఆమె ధ్వజమెత్తారు. సామాజిక న్యాయాన్ని ఛిద్రం చేసేలా నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చ పేరుతో.. రిజర్వేషన్లను ఎత్తేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ, నరేంద్ర మోడీ-అమిత్‌ షా ప్రధాన లక్ష్యమని అన్నారు. వారి ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు.