సంచార జాతులు శాశ్వత నివాసులవ్వాలి
సంచారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో పాటు తమకు ప్రత్యేక గ్రూపులు చేస్తే మేలు జరుగు తుందని సంచార జాతులు కోరుతున్నాయి. సంచారజాతులు స్థిరనివాసులు కావాలి. వాళ్ల జీవన విధానం సంపూర్ణంగా మారాలి. యాచకవ త్తి నుంచి ఉద్యోగ స్థిరనివాస స్థితికి రావాలి. తెలంగాణ కొత్త చరిత్రను బహుజనాక్షరాలతో లిఖించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. గతమం తా బీసీలను బలహీనవర్గాల పథకాలుగానే చూసింది. బీసీలంటే బలహీనవర్గాల పథకాలు కాదు, దేశసంపదలు. అభివ ద్ధికి పునాదిరాళ్లు. ఈ భావన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుది. అందుకే తెలంగాణ రాష్ట్రం బీసీ వర్గీయులను అభివ ద్ధి సాధనాలుగా, గొప్పమానవ వనరుగా తీర్చిదిద్దేందు కు సిద్ధమవుతున్నది. బీసీలను ఉత్పత్తి శక్తులుగా మార్చే ప్రయత్నానికి ముగ్గులుపోస్తున్నది. ప్రధానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై ఆయన ప్రత్యేక ద ష్టిపెట్టారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్ ప్రకా రం తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇవ్వకపోతే అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా వెనుకాడమని కేసీఆర్ అంటున్నారు.
తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా బీసీ వర్గాల దీర్ఘకాలిక ప్రయోజనాలను ద ష్టిలో పెట్టుకొని కేసీఆర్ స్టేట్స్‌మెన్‌గా ఆలోచించారు. దానికి పునాదిగా విద్యా, ఉద్యోగాల్లో బీసీ (ఈ) గ్రూపునకు చెందిన ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. సమాజంలో సగభాగానికి మించిన బీసీలకు రిజర్వేషన్ల విషయం లో రాష్ట్రాలకు స్వతంత్రత ఇవ్వాలని కేంద్రంపై పోరాటం చేస్తానని కేసీఆర్ చెప్పటమే గాక, ఈ అంశంపై అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగుతానని అసెంబ్లీలో బాహాటంగా ప్రకటించటం హర్షణీయం. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్యాంగ సవ రణ చేసి 9వ షెడ్యూల్డ్ ద్వారా రిజర్వేషన్లు పెంపుదల చేయాలన్న దారికి ఏపీ సీఎం చం ద్రబాబు కూడా కలిసిరాక తప్పదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అత్యధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రంగా తమిళనాడు అగ్రభాగాన నిలిచింది. షెడ్యూల్డ్ 9 ద్వారా 69 శాతం రిజర్వేషన్లను తమిళనాడు సాధించుకుంది. తమిళనాడు తరహాలోనే రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధించుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు దేశంలోని అన్ని రాష్ట్రా లను ఈ అంశంపైకి ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థ లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకున్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఇచ్చుకునే హక్కుకావాలన్న దానికి కేసీఆర్ ఊపిరిపోస్తున్నారు. ఇందుకోసం బీసీ (ఈ) గ్రూపులో ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీని సమావేశపరిచి సభ ఏకగ్రీవ తీర్మానానికి సన్నద్ధం చేయటం, అన్నిపార్టీలు అంగీకరించాయి. రాష్ట్రాల్లో ఉన్న కులాల ఆధారంగా విద్య, ఉద్యోగ రంగాల్లో, కుటుంబ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ పరిధిలో రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం కావాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 85 శాతంగా బహుజనవర్గాలున్నందున వారి జనాభా లెక్కలప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉండాలన్న అంశంలో భారత సహకార సమాఖ్య స్ఫూర్తి ఉండాలి. అదేవిధంగా కేంద్రంలో ఓబీసీ జాబితాలోకి రాని బీసీ కులాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. బీసీల వర్గీకరణ విషయానికొస్తే తమిళనాడు, రాజస్థాన్‌ల తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నారు. బీసీలు 52 శాతం మంది ఇక్కడున్నారు. వీరికి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం ఇప్పుడున్న విధానాల వల్ల సాధ్యం కాదు. దీన్ని జయించాలంటే రాజ్యాంగ రచన చేసుకోవాలి.
అంటే బీసీ వర్గాల్లో కొన్ని కులాలు సొంతకాళ్లపై నిలబడగలిగే స్థితిలో ఉన్నాయి. కొన్ని కులాల పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్సీ, ఎస్టీల కంటే దారుణంగా ఉన్న బీసీ వర్గాలూ ఉన్నాయి. మరి వీరిపై మొదట ప్రత్యేక ద ష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ డి గ్రూపులో ఉప్పర కులంతోపాటు మరో రెండు సంచార జాతులున్నాయి. కొన్ని బీసీ కులా లు బాగా దెబ్బతిని ఉన్నాయి. అగ్నికుల క్షత్రియ, మంగలి, చాకలి లాంటి కులాలు మోస్ట్‌బ్యాక్ వర్డ్‌గా ఉన్నాయి. వీళ్లకు న్యాయం జరుగాలి. చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, మేర తదితర కొన్ని కులాలు కులవత్తి ఆధారంగానే జీవిస్తున్నాయి. వీళ్ల ను ఎంబీసీలుగా చూడటం న్యాయం. అదేవిధంగా సంచార జాతులను ఎంబీసీలను కలిపి చూస్తే కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. బీసీలలో ఉన్న ఎ,బి,సి,డి గ్రూపుల్లో మొత్తం 61కి పైగా సంచారజాతుల లక్షణాలున్న కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలలోని సంచార జాతులను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 85 కులాలుగా ఉన్నాయి. ముస్లిం గ్రూపుల లో 6 వరకు సంచారజాతులవారున్నారు. ఫకీర్లు, బండలు పగులగొట్టే ఖాసీంల వంటి కులాలు సంచారజాతుల వాళ్లు.
సంచారజాతులను ప్రత్యేకించి ఒక గ్రూపులో ఉంచితే ఈ వర్గాలకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో లోతుగా అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే అది పెద్ద మార్పునకు దారి చూపినట్లవుతుంది. కులవ త్తులను విడువని వారున్నారు. ఆ వ త్తిని విడిచి వేరే వ త్తులలోకి అడుగుపెట్టినవారు, అలాగే తమ వ త్తిని వ్యాపారవ త్తిగా మార్చుకొని నిలువగలిగిన వాళ్లున్నారు. దీనిపై కూడా విభిన్న కోణాల్లో కేసీఆర్ మేధోమథనం చేస్తున్నారు. కొన్ని కులాలకు ఆదాయ వనరుగా ఉండే వ త్తులకు సాయం ఈ కోణం నుంచే చేస్తూ వస్తున్నారు. సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో పాటు తమకు ప్రత్యేక గ్రూపులు చేస్తే మేలు జరుగు తుందని సంచార జాతులు కోరుతున్నాయి. సంచారజాతులు స్థిరనివాసులు కావాలి. వాళ్ల జీవన విధా నం సంపూర్ణంగా మారాలి. యాచకవ త్తి నుంచి ఉద్యోగ స్థిరనివాస స్థితికి రావాలి. నేటికీ కొందరు అడవులపై ఆధారపడి జీవిస్తున్నా రు. అడుక్కు తినేవాళ్లు, పిట్టలు తినేవాళ్లు.. వీళ్లు బీసీలే. తరతరాలుగా కొందరు యాచకవత్తిలో జీవిస్తున్నారు. వీరు కూడా బీసీలే. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు సంచారజాతులు, పళ్లు, కూరగాయ లు, మూలికలు అమ్ముకునేవారు, కథలు చెప్పుకొని జీవించేవారు, పటం కథలు చెప్పుకుంటూ జీవించేవారు, రోడ్డుపక్కన ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ సెకండ్ హ్యాండ్ వస్తువుల వ్యాపారం చేసే సంచారజీవులు, ప్లాట్‌లలో చెత్తమోసుకపోయే సంచారజాతులున్నారు. వీరంతా బీసీలే. వీళ్ల బతుకులు మారాలి. అదే తన లక్ష్యంగా కేసీఆర్ ప్రతినబూనారు. వత్తులను నమ్ముకొని వేరే పని లేకుండా ఉన్నవా ళ్లు ఎంబీసీలు, వీరికోసం కేసీఆర్ ప్రత్యేకించి ఎం బీసీ కార్పొరేషన్‌నే నెలకొల్పారు. కుమ్మరులు, మం గలి, చాకలి, విశ్వకర్మలు, వడ్రంగి, కమ్మరి, ఔసుల, కమ్మరి, మాంసం అమ్ముకుంటూ ఎదుగుబొదుగు లేకుండా జీవిస్తున్న ఆరె కటికలు లాంటి ఎంబీసీల ను వీరిని ఆధునికత వైపునకు, ఉద్యోగ రంగాల్లోకి తీసుకురావాలి. వీరికి అత్యవసరంగా ప్రభుత్వ సా యం అవసరమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, మంగలిషాపులు, నిర్మాణం వైపునకు దష్టిపెట్టింది. చేతివత్తులపై ఆధారపడి జీవించే సేవాకులాలవారు చిన్నవ త్తుల వారున్నారు. వీరం తా ఎంబీసీలుగా ఉన్నారు. వీళ్ల అభివ ద్ధిని ఎలా సాధించాలన్న దానిపై ప్రభుత్వమే ప్రశ్నించుకొని ఒక సవాలుగా తీసుకొని కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్‌ను రూపొందించారు. వ త్తులు బాగా నడిచే కులాల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఎంబీసీలను, సంచారజాతులను గుర్తించింది. వీళ్ల అభివ ద్ధికి శ్రీకారం చుట్టబోతున్నది.
ఇప్పటికీ తమకు కులం సర్టిఫికెట్లు లేవని, దీనివ ల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని క్షేత్రస్థాయిలోకి వెళ్లిన బీసీ కమిషన్‌కు సంచారజాతులవా రు తెలియజేశారు. వీరి పరిస్థితి మరింత దారుణం గా ఉన్నది. మాకు కులం సర్టిఫికెట్లు ఇస్తే చాలని 24 బీసీ కులాలకు చెందిన బీసీకులాల వారు మొర పెట్టుకుంటున్నారు. తమ కులం పేరు చెప్పి సర్టిఫికె ట్లు అడిగితే ఆధారాలేమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారని వారు కమిషన్ ద ష్టికి తీసుకువచ్చారు. వాళ్లు ఇల్లు లేని వాళ్లు, స్థిర నివాసం లేనివాళ్లు కావడంతో ఆధారాలు చూపటం తమకు కష్టంగా ఉం దంటున్నారు. తమకు కుల సర్టిఫికెట్లు ఇచ్చిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని సంచారజాతులు అంటున్నాయి.
ఎంబీసీలలో నేటికీ కులవత్తి సరిగాలేక తన్నుకులాడుతున్నారు. కులవత్తులను వ్యాపార వ త్తులుగా మార్చుకునే శక్తులులేని పాతకాలపు కులవత్తులున్నాయి. చాకలి వారికి మోడ్రన్ లాండ్రీ రావాలి. మంగలివారికి బ్యూటీపార్లర్లు నెలకొల్పాలి. ఆధునిక సెలూన్లు వారు పెట్టుకోలేరు. వీళ్లకు తక్షణసాయం అందాలి. పాతకాలపు పద్ధతులను వదులుకోకుండా వ త్తి ఆధునీకరణ చెందనివారు ఎంబీసీలు. ఈ స్థితి గతులన్నీ మారాలి. రాష్ట్రంలో సంచారజాతులు, ఎంబీసీలలో కొత్త వెలుగులు రావాలి. బీసీలను బలహీనవర్గాల పథకాలుగా చేసిన గత చరిత్రను తిరుగరాయాలి. బీసీలను ప్రభుత్వ పథకాలు గా కాకుం డా వీళ్ల జీవితాలను సంపూర్ణంగా మార్చే గమ్యాలు గా ముందుకు సాగుదామన్న ముఖ్యమం త్రి కేసీఆ ర్ ఆలోచనలు ఆచరణరూపం దాల్చాలని సబ్బండ వర్ణాలు కోరుకుంటున్నాయి. కేసీఆర్ తెలంగాణను బహుజన్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీగా తీర్చిదిద్దే పనిని చేపడుతున్నారు. ఇందుకు తలా ఒక చేయివేసి తెలంగాణను శక్తివంతంగా పునర్నిర్మించుకుందాం అనే తలంపునకు బీసీలు ఆచరణాత్మకరూపులుగా ఎదుగాలి. తెలంగాణ పునర్నిర్మాణం అంటే సగం జనాభా గలిగిన బీసీల సంపూర్ణ అభివద్ధి నిర్మాణం.