జీవనదుల పరవళ్లు

పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 
నిండుకుండల్లా తొణికిసలాడుతున్న జలాశయాలు 

-వరుణుడు ఆలస్యంగా వచ్చినా మంచి ఫలితాలే ఇచ్చాడు 
-ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకున్న జీవనదులు 
– శ్రీశైలం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు 
-ఖరీఫ్‌కు నష్టపోయినా రబీకి అంతా మేలే 
-హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న తీర ప్రాంత రైతులు 
-మేలు చేసిన మహారాష్ట్ర కుండపోత వర్షాలు 
-పూర్తిస్థాయి నీటిమట్టాల సామర్థ్యానికి చేరుకున్న జలాశయాలు 
-జలపాతాల వద్ద పెరుగుతున్న సందర్శకుల సందడి 
-తాగు సాగునీటి అవసరాలకు సరిపడ నీరు 
-తెలంగాణలో గొలుసుకట్టు చెరువులకు జల కళ 

హైదరాబాద్‌: 
కష్ణమ్మ, గోదారమ్మ పోటాపోటీగా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు నదీ ప్రవాహాలు భారీగా పెరిగాయి. ఈ జీవనదుల పరిధిలోని పలు ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. వరద నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. దిగువన ఉన్న ప్రాజెక్టులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. 
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దాదాపు 3,59,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 879.30 అడుగులకు చేరింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఏపీ జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మూడు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుత నీటి నిల్వ 184.27 టీఎంసీలుగా నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1351 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌ కు 735 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. 
మరోవైపు కష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలుకాగా..ప్రస్తుతం 88.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.3,49,526 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..అంత కంటే ఎక్కువగా 3,64,052 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ..ప్రస్తుతం 20.04 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. నారాయణపూర్‌ జలాశయానికి 4,02,951 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..మొత్తం 4,18,637 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 6.05 టీఎంసీలు 
గా ఉంది. జూరాలకు ఇన్‌ ఫ్లో 3,69,484 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 3,74,600 క్యూసెక్కులగా నమోదైంది. 
మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా..ప్రస్తుతం నీటి నిల్వ 60.72 టీఎంసీలుగా ఉంది. తుంగభద్రకు ఇన్‌ ఫ్లో 1,42,114 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4,089 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 142.08 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్‌ కు ఇన్‌ ఫ్లో 64,136 క్యూసెక్కులు వస్తుండగా..9,271 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. 
పదేళ్ల తర్వాత నారాయణపూర్‌ జలాశయం నుంచి భారీగా వరద నీరు విడుదల చేశారు. రెండురోజుల క్రితమే 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. వరదనీరు కిందకు వదలటంతో దిగువున వున్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. గత వారం రోజులుగా ఆలమట్టిలోకి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇది క్రమేపి పెరగటంతో గత మంగళవారం ఉదయం 3.6 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. నారాయణపూర్‌ నుంచి దిగువకు కూడా 3.6 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. సోమవారం కురిసిన భారీ వర్షాలకు ప్రవాహం మరింత పెరగడంతో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాయచూరు జిల్లా అధికారితో మాట్లాడి నారాయణపూర్‌ నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు. దీనికి తగ్గట్లుగా ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకుని నీటి విడుదలను పెంచారు. 
పదేళ్లలో గరిష్టస్థాయి రికార్డు 
నారాయణపూర్‌ నుంచి అధిక జలాలను విడుదల చేయడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిది. కష్ణానది చరిత్రలోనే అత్యధికంగా 2009లో శ్రీశైలం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. 2009 అక్టోబరు 2న 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దిగువన భీమా నది నుంచి, స్థానికంగా లభ్యమైన నీటితో కలిసి జూరాలలోకి 11.14 లక్షల క్యూసెక్కుల వరద అప్పట్లో వచ్చింది. ప్రస్తుతం నారాయణపూర్‌ కు దిగువన ఉన్న భీమానదికి కూడా భారీ వరద ఉంది. ఉజ్జయిని డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. భీమా, ఇతర నదుల నుంచి వచ్చిన వరద ప్రవాహం క ష్ణానదిలో కలిసే అవకాశం ఉంది. 
శ్రీశైలంలోకి 2.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. సరాసరి రోజూ 23 టీఎంసీలకు పైగా వరదనీరు శ్రీశైలంలోకి వస్తోంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తు నీటి మట్టం 133 టీఎంసీల వద్ద ఉంది. మరో 80 టీఎంసీలు వస్తే ఈ ప్రాజెక్టు నిండుతుంది. ఇప్పటికే విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. సాగర్‌ నిండటానికి 186 టీఎంసీలు అవసరం. ఇప్పటివరకు వచ్చిన వరద నీరు.. కష్ణానదిలో కొనసాగుతున్న ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుంటే నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు అవకాశాలు మెరుగుపడినట్లే కనపడుతోంది. కాస్త ఆలస్యంగా అయినా ఏపీలో ఖరీఫ్‌ సాగుకు నీరు లభిస్తుంది. 
ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి మట్టం 1,705 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1697.05 అడుగులకు చేరింది. దీని పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 99 టీఎంసీల నిల్వ ఉంది. ఈ జలాశయానికి ఇన్‌ ఫ్లో 3,62,875 క్యూసెక్కులు నమోదు కాగా.. 3,90,072 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. 
నారాయణపూర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1604.33 అడుగులకు చేరింది. దీని పూర్తి స్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 24.34 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఇన్‌ఫ్లో 3,39,775 క్యూసెక్కులు కాగా.. 3,71,517 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1041.11 అడుగులకు చేరింది. దీని పూర్తి స్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.33 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 2,70,725 క్యూసెక్కులు నీరు వస్తుండగా.. 2,92,492 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి 2,41,945 క్యూసెక్కుల మేర నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 871.30 అడుగుల మేర నీరు చేరింది. ఇక ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 147.27 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం నుంచి 82,925 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1612.44 అడుగులు ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 40.14 టీఎంసీలుగా ఉంది. తుంగభద్రకు 4,741 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. 1,042 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 510.60 అడుగులు మేర ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 132.69 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్‌కు 55,554 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. 858 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.